గట్టిగానే టార్గెట్ ?

జగన్ సర్కార్ కేవలం మాటలే తప్ప చేతలు లేవని ఏకంగా తెలుగు తమ్ముళ్ళే తీసిపారేసే పరిస్థితి. ఏదీ ఒక్క ఆరోపణ నిరూపించండి, కేవలం కక్ష సాధింపు చర్యలు [more]

Update: 2020-02-22 06:30 GMT

జగన్ సర్కార్ కేవలం మాటలే తప్ప చేతలు లేవని ఏకంగా తెలుగు తమ్ముళ్ళే తీసిపారేసే పరిస్థితి. ఏదీ ఒక్క ఆరోపణ నిరూపించండి, కేవలం కక్ష సాధింపు చర్యలు తప్ప మీ దగ్గర ఏ ఆధారాలూ లేవు. మేము నిప్పులం, పట్టుకోవాలని చూస్తే కాలిపోతారు. ఇవన్నీ అధినేత చంద్రబాబుతో సహా తమ్ముళ్ళు విసిరిన వాగ్బాణాలు. చేసిన పెను సవాళ్ళు. మరి దానికి సరైన జవాబు అన్నట్లుగా ఇపుడిపుడే వైసీపీ సీరియస్ యాక్షన్ కి దిగుతోంది. ఇన్నాళ్ళూ చూసింది జస్ట్ ట్రయల్ మాత్రమే. ఇపుడే అసలు సినిమా మొదలైందంటోంది. దానికి పెద్ద ఉదాహరణగా ఎటువంటి హడావుడి లేకుండా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్ఐ భాగోతాన్ని ఒక్కసారిగా బయటపడేసి షాక్ తినిపించింది. ఇపుడు ఏపీవ్యాప్తంగా గత స‌ర్కార్ అవినీతిపై సిట్ ని ఏర్పాటు చేస్తూ కీలకమైన నిర్ణయం తీసుకుంది.

అదే టార్గెట్….

తాజాగా వైసీపీ సర్కార్ సీనియర్ ఐపీఎస్ అధికార్ కొల్లి రఘురాంరెడ్డి ఆధ్వర్యంలో వేసిన సిట్ అమరావతి రాజధాని కుంభకోణంపైన ప్రధానంగా దృష్టి పెడుతుంది. ఆ తరువాత ఏపీలో గత అయిదేళ్ళలో జరిగిన అతి పెద్ద ప్రాజెక్టుల స్కాముల మీదా కూడా దర్యాప్తు చేస్తుంది. ముఖ్యంగా ఇన్సైడింగ్ ట్రేడింగ్ మీద సిట్ పూర్తి పరిశీలన చేస్తుంది. ఈ మేరకు మంత్రి వర్గం ఉప సంఘం ఇచ్చిన నివేదికను దగ్గర ఉంచుకుని మరీ సిట్ విచారణకు రెడీ అవుతోంది. ఇక సిట్ కి విశేష అధికారాలు జగన్ సర్కార్ కట్టబెట్టడం విశేషం. ఏ దశంలోనైనా అనుమానం వస్తే ఎంతటి పెద్దవారినైనా నోటీసులు ఇచ్చి పిలిచి విచారించవచ్చు. మొత్తానికి చూస్తూంటే జగన్ సర్కార్ సరైన ట్రాక్ లోకి వచ్చినట్లుగా కనిపిస్తోంది.

ఇక చేతలేనా?

ఊరకే నోరు పారేసుకుని మీరు అవినీతిపరులు అంటూ ఊసుపోని కబుర్లు చెప్పడం వల్ల రాజకీయ దుమారం తప్ప ఒనకూడేది ఏదీ లేదని కూడా జగన్ భావించడం మంచి పరిణామమే. అదే విధంగా దీని వల్ల జనాలకు కేవలం కక్షతో అంటున్నారన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అంతే కాదు, ఓడిపోయిన టీడీపీకి అప్పనంగా సానుభూతికి సంపాదించిపెట్టడమే తప్ప సర్కార్ కార్యదీక్షకు, దక్షతకు కూడా ఈ మాటలు ఎందుకూ పనికిరావు అని సొంత ప్రభుత్వంలోనే ఉంది. దాంతో ఇక యాక్షన్ లోకి దిగాలని చాలా సైలెంట్ గా జగన్ సర్కార్ సిట్ ఏర్పాటు డెసిషన్ తీసుకుంది అంటున్నారు.

గుండెల్లో రైళ్ళే…..

దాదాపు పది మంది సభ్యులు, సీనియర్ అధికారులతో ఏర్పాటు చేసిన సిట్ గత టీడీపీ అయిదేళ్ళ అవినీతి బాగోతాల పని పట్టడానికేనని వినిపిసోంది. దాంతో పసుపు పార్టీ తమ్ముళ్ళ గుండెళ్ళో రైళ్ళు పరిగెడుతున్నాయని అంటున్నారు. ఎవరెన్ని చెప్పినా, ఎన్ని బొంకినా కూడా గత పాలనలో ఇష్టారాజ్యంగా అవినీతి జరిగిందన్నది జనాల్లో ఉన్న స్తూలమైన అభిప్రాయం. దాన్ని వెలికి తీసే జనం కూడా హర్షిస్తారు. అలా కాకుండా ఒకరిపైన ఒకరు బురద జల్లుకుంటే మాత్రం పలుచన అవుతారు. దీన్ని గ్రహించే పకడ్బందీగా జగన్ సర్కార్ సిట్ ని ఏర్పాటు చేసిందని అంటున్నారు. ముఖ్యంగా అమరావతి రాజధాని విషయంలో ఇప్పటికే సీఐడీ దూకుడుగా ఉంది. ఈడీ రంగంలోకి దిగుతోందని అంటున్నారు. ఇపుడు సిట్ కూడా పని మొదలుపెడితే పద్మవ్యూహంలో పసుపు పార్టీ చిక్కుకున్నట్లే.

Tags:    

Similar News