యాక్షన్ ప్లాన్ రెడీ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఇప్పుుడు మూడు పార్టీలను ఎదుర్కొనాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించాలని జగన్ [more]

Update: 2020-02-22 13:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఇప్పుుడు మూడు పార్టీలను ఎదుర్కొనాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ మేరకు కార్యాచరణను జగన్ సిద్ధం చేశారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకూ అమలు చేయడానికి ఒక టీంను జగన్ నియమించుకున్నారని తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీలు పూర్తిగా లోకల్ బాడీ ఎన్నికల్లో గల్లంతయితేనే నాలుగేళ్ల పాలన సజావుగా సాగుతుందన్నది జగన్ కు తెలియంది కాదు.

ప్రత్యేక వ్యూహంతో…..

అందుకోసం ప్రత్యేక వ్యూహాలను జగన్ అమలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు మార్చి 15వ తేదీలోపు పూర్తి చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టీడీపీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాలపై జగన్ దృష్టి పెట్టారు. అక్కడ ద్వితీయ శ్రేణి నేతలతో పాటు, ప్రభావం చూపగలిగిన నేతలను వైసీపీలోకి రప్పించేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ అయిందంటు న్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల టీడీపీ నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

మూడు పార్టీలకూ….

ఇక పట్టణ ప్రాంతాల్లో బీజేపీ, జనసేన కూటమి, గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండటంతో అందుకు కూడా జగన్ ప్రత్యేక ప్రణాళికలను రూపొందించినట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన స్థానాలను దక్కించుకున్న వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే జోరును కొనసాగించాలని జగన్ భావిస్తున్నారు. అందుకే ధైర్యం చేసి మరీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళుతున్నారు. రాష్ట్రంలో టీడీపీకి పట్టున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జగన్ రెండు సార్లు పర్యటించేలా ప్రోగ్రాం షెడ్యూల్ కూడా తయారయిందంటున్నారు.

బలమైన నేతలను….

ముఖ్యంగా ఎనిమిది నెలలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెల్లే బాధ్యతను పార్టీ యువజన, విద్యార్థి విభాగాలకు జగన్ అప్పగించినట్లు చెబుతున్నారు. దీంతో పాటుగా స్థానికంగా బలమున్న నేతలను గుర్తించే పనిని కూడా వీరికే అప్పగించారట. ఎమ్మెల్యేలతో వీరికి పొసగకున్నా పార్టీలో చేర్చుకునేందుకే జగన్ రెడీ అయిపోతున్నారు. మొత్తం మీద వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేందుకు జగన్ వ్యూహాలు ఏమేరకు పనిచేస్తాయన్నది చూడాలి.

Tags:    

Similar News