జ‌గ‌న్‌ను వాళ్లే లైట్ తీస్కొంటున్నారా?

జ‌గ‌న్ ప్రభుత్వంపై విప‌క్షం టీడీపీ స‌హా చంద్రబాబు అనుకూల మీడియాలో గ‌డిచిన రెండు రోజులుగా ప్రజా సంక్షేమ ప‌థ‌కాల విష‌యంలో తీవ్ర విమ‌ర్శలు వినిపిస్తున్నాయి. అర్హులైన చాలా [more]

Update: 2020-02-25 02:00 GMT

జ‌గ‌న్ ప్రభుత్వంపై విప‌క్షం టీడీపీ స‌హా చంద్రబాబు అనుకూల మీడియాలో గ‌డిచిన రెండు రోజులుగా ప్రజా సంక్షేమ ప‌థ‌కాల విష‌యంలో తీవ్ర విమ‌ర్శలు వినిపిస్తున్నాయి. అర్హులైన చాలా మందికి పింఛ‌న్లు ఇవ్వ డం లేద‌ని, ఏళ్ల తరబడి పింఛను పొందుతున్న వారి పేర్లు జాబితాలో మాయమ‌య్యాయ‌ని, అదే సమయంలో అస్మదీయులు, అనర్హులకు కొత్తగా పింఛన్లు ఇస్తున్నార‌ని, కొత్త పింఛన్లలో అత్యధికం ఇలాంటివే ఉన్నాయ‌ని టీడీపీ స‌హా ఆ పార్టీ అనుకూల మీడియా భారీ ఎత్తున ద‌మ్మెత్తి పోస్తోంది. మ‌రి ఇంత‌లా ప్రభుత్వంపై సంక్షేమం విష‌యంలో ఎందుకు విమ‌ర్శలు వ‌స్తున్నాయి.

అర్హులందరికీ…

ఏదో విమ‌ర్శలు చేశారంటే చేశార‌ని ప‌క్కన పెట్టడం కాకుండా ఆధారాలు, ఫొటోల‌తో స‌హా ల‌బ్దిని కోల్పో యిన వారి జాబితాను స‌ద‌రు మీడియా ప్రముఖంగా పేర్కొంటోంది. దీంతో జ‌గ‌న్ ప్రభుత్వంపై వ్యతిరేక‌త పెరుగుతోంది. దీంతో అస‌లు ఏం జ‌రుగుతోంది? సీఎంగా జ‌గ‌న్ ఏం చెబుతున్నారు? అనే అంశాలు కీలకంగా మారాయి. సీఎం జ‌గ‌న్ వైఖ‌రిని గ‌మ‌నిస్తే ఆయ‌న ఏ వేదిక ఎక్కినా.. ఎక్కడ ఎవ‌రితో స‌మీక్ష నిర్వహించినా రాష్ట్రంలో అర్హులైన వారు చిట్టచివ‌ర‌న ఎక్కడ ఉన్నా కూడా మ‌న ప్రభుత్వం అందించే సం క్షేమ ఫ‌లాలు అంది తీరాల్సిందే. దీనికి పార్టీలు, కులాలు, మ‌తాలు అనే అడ్డంకులు ఉండ‌రాద‌ని బ‌ల్ల గుద్ది మ‌రీ చెబుతున్నారు.

ఎమ్మెల్యేలు మాత్రం…..

మ‌రి క్షేత్ర‌స్తాయిలో మాత్రం దీనికి భిన్నంగా ప‌రిస్థితి క‌నిపిస్తోంది. చాలా మంది ల‌బ్ధిదారులు కూడా త‌మ పేర్లు అర్హుల జాబితాలో లేద‌ని, పింఛ‌న్లు, రేష‌న్ కార్డులు ఆగిపోయాయ‌ని వాపోతున్నారు. దీంతో అస‌లు క్షేత్రస్థాయిలో ఏం జ‌రుగుతోంద‌నే విష‌యంపై ఆరా తీయ‌గా చాలా చిత్రమైన విష‌యం వెలుగు చూసింది. ఒక‌ప‌క్క పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ అంద‌రికీ ప్రభుత్వ సేవ‌లు అందాల‌ని చెబుతుంటే కొంద‌రు ఎమ్మెల్యేలు మాత్రం ప‌నిగ‌ట్టుకుని ఆయ‌న మాట‌ల‌ను పెడ‌చెవిన పెడుతున్నార‌ట‌.

సిబ్బందికి హెచ్చరిస్తూ…..

గ్రామ‌, వార్డు స‌చివాల‌య సిబ్బందితో నిత్యం ట‌చ్‌లో ఉంటూ వైసీపీకి చెందిన వారికి మాత్రమే ప‌థ‌కాలు అందాల‌ని టీడీపీ సానుభూతి ప‌రుల‌కు అందితే.. తాట తీసి ఇంటికి పంపిస్తామ‌ని హెచ్చరిస్తున్నార‌ట‌. దీంతో స‌చివాల‌య సిబ్బంది ఏమీ చేయ‌లేక పోతున్నారు. ఈ ప‌రిస్థితితో జ‌గ‌న్ ఎంత మంచి చేయాల‌ని అనుకున్నా.. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల‌ను క‌ట్టడి చేయ‌క‌పోతే.. ఫ‌లితం ఉండ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News