ఎన్నికల ముందు ఫీట్లు ఎందుకు?

కూర్చుని అంతా బాగుందని అనుకుంటున్నారు. ఆయన ప్రతీ రోజూ పలు శాఖల మీద సమీక్ష చేస్తూంటారు. దానికి హాజరైన అధికారులు, మంత్రులు కూడా అంతా బాగుందని చెబితే [more]

Update: 2020-02-22 02:00 GMT

కూర్చుని అంతా బాగుందని అనుకుంటున్నారు. ఆయన ప్రతీ రోజూ పలు శాఖల మీద సమీక్ష చేస్తూంటారు. దానికి హాజరైన అధికారులు, మంత్రులు కూడా అంతా బాగుందని చెబితే అక్కడితో తన పాలన భేష్, ఇదే స్వర్ణయుగం అని మురిసిపోతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో జరుగున్నవి జగన్ కి తెలుసా అని సొంత పార్టీ నేతలే ఇపుడు ప్రశ్నిస్తున్నారు. ఓ వైపు లోకల్ బాడీ ఎన్నికలు ముంగిట్లో పెట్టుకుని జగన్ సర్కార్ అడ్డగోలుగా, రేషన్ కార్డులు, పింఛనులు పెద్ద ఎత్తున రద్దు చేయడం పట్ల ప్రజలు రగిలిపోతున్నారు. లక్షల్లో ప్రతీ చోటా ఇవి గల్లంతు కావడంతఒ ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.

వ్యతిరేకతగా…?

ప్రజలకు అభివఋధ్ధి అన్నది సెకండరీ అయిపోయింది. అలాగే అవినీతి మీద ఎన్ని కబుర్లు చెప్పినా కూడా పట్టదు, వారికి దక్కాల్సింది లాక్కుంటే మాత్రం వారు పెట్టే గోల అలా ఇలా ఉండదు. జగన్ ప్రస్తుతం చేస్తున్నది అదే గత సర్కార్ టైంలో రేషన్ కార్డులు బాగా ఉండేవి. వాటిని జగన్ మార్చేసి అయిదు రకాలు కార్డులు అంటున్నారు. అంతవరకూ కధ బాగున్నా అవి అమలవుతున్నాయా అంటే లేవని చెప్పాలి. గ్రామ సచివాలయాలు దారుణంగా పనిచేస్తున్నాయి. అక్కడకు పోయి సోది కబుర్లు చెప్పుకుని వచ్చేవారే ఉద్యోగులుగా ఉన్నారు. దాంతో తమ కార్డులు రద్దు అయ్యాయని వెళ్ళి గోడు పెట్టుకున్నా పట్టించుకునే నాధుడు లేడు. అది జనంలో వ్యతిరేకతను పెంచుతోంది.

యాంటీ ఓటింగ్…

సరిగ్గా లోకల్ బాడీ ఎన్నికల ముందు ఇలా రద్దు చేస్తూ పోతున్న జగన్ సర్కార్ కొత్త కార్డుల విషయంలో మాత్రం విధి విధానాలు రూపొందించలేదు. దాంతో వాలంటీర్లు కూడా చేతులెత్తేస్తున్నారు. అంతే కాదు, వారికి ఇచ్చిన ట్యాబులలో ఎన్నో సాంకేతిక సమస్యలు, దాంతో ఎవరికీ అక్కడ ఏమీ తెలియదు, అంతా గందరగోళంగా పరిస్థితి ఉంది. దీంతో రేషన్ కార్డులు, పించన్లు పోగొట్టుకున్న వారి బాధ తారస్థాయిలో ఉంది. ఇది నిజంగా జగన్ సర్కార్ కి యాంటీ ఓటింగుని తెస్తుందని అంటున్నారు. వారే రేపటి రోజున లోకల్ బాడీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మాకు వద్దు అంటూ ఓట్లు వేస్తే అపుడు జగన్ సర్కార్ కి అవమానం ఎంత ఉంటుందో ఊహిస్తున్నారా అని వైసీపీ నేతలే అంటున్నారు.

అపుడే తలబొప్పి….

ఓ వైపు చంద్రబాబు ప్రతీ అవకాశాన్ని తన రాజకీయానికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఆయన ఇపుడు ప్రజా చైతన్య యాత్రలు చేస్తున్నారు. రేషన్ కార్డులు, పించనులు ఇవే బాబుకు ఆయుధాలుగా మారుతున్నాయి. కోరి కోరి ఎన్నికల ముందు ఇలాంటి రద్దులు చేపట్టడం మతిమాలిన జగన్ పార్టీ విధానాలు అంటున్నారు. దీనివల్ల టీడీపీకి లోకల్ బాడీ ఎన్నికల్లో భారీగా లబ్ది కలిగినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. మొత్తానికి జగన్ తన సర్కార్ పై స్థాయిలో బాగుందని అనుకుంటే సరిపోదని, దిగువన ప్రజలు పడే అవస్థలు కూడా చూడాలని, తక్షణం రద్దు అన్న మాట లేకుండా రేషన్ కార్డులు, పించన్లు ఇచ్చిన నాడే ఆయన పార్టీకి జనం చేరువ అవుతారని సూచిస్తున్నారు. మరి జగన్ వింటారా.

Tags:    

Similar News