“జాస్తి” కి జగన్ ఆఫర్ నిజమేనా?

ఖాళీ అయ్యేది నాలుగు స్థానాలే.. కానీ ఆశావహులు మాత్రం ఎంతోమంది ఉన్నారు. ఇది వైసీపీ అధినేత జగన్ కు మాత్రం ఇబ్బందేనని చెప్పకతప్పదు. మార్చి నాటికి ఏపీకి [more]

Update: 2020-02-24 02:00 GMT

ఖాళీ అయ్యేది నాలుగు స్థానాలే.. కానీ ఆశావహులు మాత్రం ఎంతోమంది ఉన్నారు. ఇది వైసీపీ అధినేత జగన్ కు మాత్రం ఇబ్బందేనని చెప్పకతప్పదు. మార్చి నాటికి ఏపీకి సంబంధించి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఈ నాలుగింటిని అధికార వైసీపీ కైవసం చేసుకుంటుంది. శాసనసభలో సంఖ్యాపరంగా బలంగా ఉండటంతో నాలుగు స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి. అయితే జగన్ ఆయన పేరును బాగానే పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.

మాజీ న్యాయమూర్తిని…..

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపాలన్న యోచనలో జగన్ ఉన్నారని తెలుస్తోంది. చంద్రబాబుకు, టీడీపీకి చెక్ పెట్టాలంటే కృష్ణా జిల్లాకు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన జాస్తి చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపితే కొంత సానుకూలత ఏర్పడుతుందని భావిస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనతో కమ్మ సామాజిక వర్గంలో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను జాస్తి చలమేశ్వర్ నియామకం ద్వారా వారిని కొంతలో కొంత శాంతపర్చవచ్చని జగన్ భావిస్తున్నారు. ఇటీవల జగన్ ను జాస్తి చలమేశ్వర్ కలవడం కూడా ఇందులో భాగమేనంటున్నారు.

మేకపాటితో పాటు……

అలాగే నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి రాజమోహన్ రెడ్డి పేరును కూడా జగన్ పరిశీలిస్తున్నారు. పార్టీని నమ్ముకుని తొలి నుంచి తనతో నడిచిన మేకపాటి రాజమోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లోనూ నెల్లూరు సీటును త్యాగం చేశారు. దీంతో ఆయనకు ఖచ్చితంగా ఈసారి అవకాశమివ్వాలని జగన్ భావిస్తున్నారు. ఆయనతో పాటు 2014 ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయిన అయోధ్య రామిరెడ్డికి కూడా రాజ్యసభకు పంపాలని జగన్ యోచిస్తున్నారు.

షర్మిల పేరు కూడా….

దీంతోపాటు వైసీపీ విజయానికి కృషి చేసిన షర్మిల పేరు కూడా ప్రముఖంగా విన్పిస్తుంది. షర్మిలకు రాజ్యసభకు పంపాలని పార్టీ సీనియర్ నేతలు సయితం డిమాండ్ చేస్తున్నారు. వీరితో పాటు మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబుతో పాటు మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేల పేర్లను కూడా జగన్ పరిశీలిస్తున్నారు. జగన్ మాత్రం ఈ నాలుగు పదవులపై సీరియస్ గానే కసరత్తు చేస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తం మీద జగన్ సెలక్షన్ లో జాస్తి చలమేశ్వర్ పేరు ఉండటం పార్టీలోనూ చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News