మైండ్ బ్లాంక్ అయిందా?

జగన్ కి ఏం రాజకీయాలు తెలుసు. కుర్రాడు. కళ్ళ ముందే పెరిగాడు, ఎప్పటికీ సీఎం కాలేడు. ఇలా గత పదేళ్ళుగా రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఆత్మానందం పొందిన [more]

Update: 2020-02-16 13:30 GMT

జగన్ కి ఏం రాజకీయాలు తెలుసు. కుర్రాడు. కళ్ళ ముందే పెరిగాడు, ఎప్పటికీ సీఎం కాలేడు. ఇలా గత పదేళ్ళుగా రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఆత్మానందం పొందిన వారు ఇపుడు పెద్ద షాక్ తింటున్నారు. ఎంతలా అంటే అసలు నోటంటా ఒక్క మాటా రావడం లేదుగా. రాయలసీమ జిల్లాలకు చెందిన ఒక పెద్దాయన జగన్ ని మా అబ్బాయి అంటూనే పత్రికల్లో రాయలేని భాషలో తిట్లు లంకించుకునేవారు. చంద్రబాబు వేదిక మీద ఉంటే చాలు పూనకం వచ్చినట్లుగా జగన్ ని నానా మాటలూ అనేవారు. పాపం ఆ పెద్దాయన ఇపుడు అయిపూ అజా లేకుండా పొయారుగా. కూసాలు కదిలిపోయే షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వడంతో ఆయన ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియడంలేదు.

ఊహించని ట్విస్ట్ :

గత కొద్ది రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అసలు ఊహించలేదనే చెప్పాలి. మరి రాజకీయ చాణక్యుడు, చతురుడు అని పెద్ద బిరుదులు ఎన్నో వెనకేసుకున్న బాబు ఢిల్లీతో జగన్ దోస్తీని కనీసంగా వాసన పట్టలేకపోయారంటేనే ఆయన అనుభవం మీద సందేహాలు వస్తున్నాయి. మూడు రాజధానులు, మండలి రద్దు వంటితో పాటు, అమరావతి రాజధాని స్కాముల మీద జగన్ తవ్వి తీస్తూంటే అమాయకంగా కేంద్రం వైపు చూస్తూ ఇన్నాళ్ళూ బెదిరిస్తూ వచ్చిన పసుపు తమ్ముళ్ళకు ఇపుడు వూహించని ట్విస్టులు కనిపిస్తున్నాయి. కేంద్రం దగ్గరుండి జగన్ చేత ఇవన్నీ చేయిస్తోందా అని ఇపుడే వారు బుర్రలలో ట్యూబ్ లైట్లు వెలుగుతున్నాయట.

ఐటీ దాడులతో….

ఇక మరో వైపు ఐటీ దాడులతో టీడీపీ శిబిరం నిరాశలోకి వెళ్ళిపోయింది. బాబు సన్నిహితులైన బీజీపీ కొత్త పూజారులు, ఎంపీలు కూడా అసలు దీని గురించి ఎక్కడా కనిపెట్టనంత వేగంగా ఈ దాడులు జరిగాయి. ఐటీ అధికారులు ప్రాధమిక నివేదికలోనే రెండు వేల కోట్లు నల్లధనం అని తేల్చారు. ఇంకా లోతైన దర్యాప్తు ఉందని అంటున్నారు. అదే కనుక జరిగితే ఆ తీగ అలా పాక్కుంటూ ఎక్కడికి వస్తుందో. ఏ డొంక కదిలి అసలు బిగ్ బాస్ ఎవరు బయటకు వస్తారో తెలియని పరిస్థితి. మరి ఇదంతా అంచనా వేయడంలో పసుపు శిబిరం పూర్తిగా విఫలం అయిందనిపిస్తోందంటున్నారు.

ఇపుడు గుర్తొచ్చిందా?

బాబు వెంట తిరిగి, ఆయనతో కలసి జోలె పట్టిన ఓ కమ్యూనిస్ట్ పెద్దాయన ఇపుడు అర్జంటుగా లౌకిక వాదం అంటూ గాండ్రిస్తున్నారు. చంద్రబాబు తన పక్కనే ఉంటూ మరో వైపు కమలానికి కన్నుగీటుతున్నపుడు ఈ లౌకికవాదం ఏమైందో ఆ ఎర్రన్నకే తెలియాలి. ఆలూ లేదు చూలూ లేదు ఇంతలోనే వైసీపీ లౌకికవాదాన్ని మంటగలిపిందని ఆయన పెడబొబ్బలు పెడుతున్నారు. బీజేపీతో పోయి కలుస్తారా అంటూ నిప్పులు చిమ్ముతున్నారు. బాబు పక్కన ఉంటూ కూడా కేంద్రం అండతో రాజకీయం చేద్దామనుకున్న ఆ కమ్యూనిస్టు కి అపుడు ఇవేమీ కనిపించలేదని సెటైర్లు పడుతున్నాయి. మొత్తానికి హఠాత్తుగా జగన్ చేసిన ఢిలీ టూర్ ఏపీలో అన్ని రాజకీయ పార్టీలకు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసిందనే చెప్పాలి.

Tags:    

Similar News