ముహూర్తం ఫిక్సయింది

జగన్ ఢిల్లీ టూర్ రాజకీయంగా పెద్ద సక్సెస్. ఏపీకి ఏమొచ్చింది అన్న మాట పక్కన పెడితే జగన్ కి మాత్రం పార్టీ పరంగా లాభదాయకంగా ఈ టూర్ [more]

Update: 2020-02-16 03:30 GMT

జగన్ ఢిల్లీ టూర్ రాజకీయంగా పెద్ద సక్సెస్. ఏపీకి ఏమొచ్చింది అన్న మాట పక్కన పెడితే జగన్ కి మాత్రం పార్టీ పరంగా లాభదాయకంగా ఈ టూర్ సాగింది. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా వంటి పెద్దలు జగన్ని మర్యాదగా చూశారు. ఆయన్ని కొత్త మిత్రుడిగా సమాదరించారు. ఇక వైసీపీ ఎన్డీయేలో చేరిపోయినట్లే. అది అధికారికంగా బయటపడేది మాత్రం ఈ నెలాఖరులోనే. మోడీ కేంద్ర మంత్రివర్గ విస్తరణను అపుడే చేపడతారు. దాంతో వైసీపీని ఈసారి క్యాబినేట్లోకి తీసుకోవడం దేశ రాజకీయాలకే పెద్ద ఆకర్షణగా మారబోతోంది.

మూడు పదవులట…..

వైసీపీకి మొదట రెండు పదవులు అనుకున్నారు. కానీ ఇపుడు మూడు వరకూ ఇచ్చేందుకు లెక్క కుదిరింది. ఆ జాబితాను కూడా జగన్ అమిత్ షా చేతిలో పెట్టారని ఢిల్లీ వర్గాల భోగట్టా. అందులో విజయసాయిరెడ్డి పేరు లేకపోవడం ఒక విశేషంగా చెబుతున్నారు. ఆయన మీద సీబీఐ కేసులు ఉండడంతో ఆయన్ని పక్కన పెట్టాలని బీజేపీ పెద్దలు సూచించారో లేక జగనే సుజనా చౌదరి అనుభవంతో ముందు జాగ్రత్తపడ్డారో తెలియదు కానీ చివర్లో తప్పించేశారట. ఇక లోక్ సభలో వైసీపీ నేత మిధున్ రెడ్డికి క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ దక్కనుంది. అలాగే మరో ఇద్దరికి సహాయమంత్రులుగా ఇస్తారు. ఆ జాబితాలో మహిళా కోటాలో కాపు నేత వంగా గీత ఉండొచ్చు అంటున్నారు. ఆమె కాకపోతే బాలశౌరి ఉండొచ్చు. అపుడు మహిళా కోటా, ఎస్సీ వర్గం తరఫున నుంచి అమలాపురం ఎంపీ అనూరాధ ఉంటారని అంటున్నారు. విశాఖలో పాలనా రాజధానిని పెడుతున్నందువల్ల కృష్ణా జిల్లాలకు ఒక మంత్రి పదవి, రాయల‌సీమకు ఒక పదవి, గోదావరి జిల్లాల నుంచి ఒకరిని మంత్రి పదవిగా జగన్ అన్ని రకాల న్యాయం చేస్తున్నారని అంటున్నారు.

బీజేపీకి రాజ్యసభ….

ఇక ఈ రాయబేరాల్లో బీజేపీకి ఒక రాజ్యసభ సీటు ఇచ్చేందుకు జగన్ రెడీ అయ్యారని అంటున్నారు. వచ్చే నెలలో నాలుగు సీట్లు ఏపీలో ఖాళీ అవుతాయి. అందులో నుంచి తమ కోటాలో పార్టీకి ఒక సీటు కేటాయించాలని బీజేపీ పెద్దలు జగన్ ని కోరారని భోగట్టా. దానికి జగన్ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. దాంతో వైసీపీ నుంచి మూడు సీట్లే ఇపుడు మిగులుతాయని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఉభయకుశలోపరిగా ఈ రాయబేరాలు సాగాయని చెబుతున్నారు.

Tags:    

Similar News