ఆ నలుగురికి ఖామయట

రాష్ట్రంలో వైసీపీ రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. ఏపీ ప్రభుత్వం విష‌యంలో కేంద్రం సానుకూలంగా ఉండ‌డంతో త్వర‌లోనే మండ‌లి ర‌ద్దు అవుతుంద‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది జ‌రిగితే చాలా మందికి [more]

Update: 2020-02-17 14:30 GMT

రాష్ట్రంలో వైసీపీ రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. ఏపీ ప్రభుత్వం విష‌యంలో కేంద్రం సానుకూలంగా ఉండ‌డంతో త్వర‌లోనే మండ‌లి ర‌ద్దు అవుతుంద‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది జ‌రిగితే చాలా మందికి జ‌గ‌న్ ఇచ్చిన 'మండ‌లి స‌భ్యత్వం' ఆశ‌లు గ‌ల్లంత‌వుతాయి. అదే స‌మ‌యంలో మ‌రి జ‌గ‌న్ ఆశ‌లు పెట్టిన నాయ‌కులు ఏమ‌వుతారు ? అనేది కీల‌క ప్రశ్న. తాజాగా జ‌గ‌న్ దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చార‌ని ప్రచారం జ‌రుగుతోంది. జ‌గ‌న్ దృష్టిలో న‌లుగురు కీల‌క నాయ‌కులు ఉన్నారు. వీరిలో ఇద్దరు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మిగిలిన ఇద్దరూ త‌న ఎమ్మెల్యే టికెట్లను త్యాగం చేశారు.

త్యాగం చేసినందుకు…..

దీంతో ఆ న‌లుగురికి జ‌గ‌న్ ప‌దవులు ఇస్తార‌న్న టాక్ వైసీపీ వ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తోంది. ఈ పేర్ల‌లో లేళ్ల అప్పిరెడ్డి, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌, కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్రస్వామి, జొన్నల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి ఉన్నారు. ఈ న‌లుగురికి జ‌గ‌న్ అంటే అంతులేని అభిమానం, గౌర‌వం కూడా. జ‌గ‌న్ మాటే వేదంగా వీరు భావిస్తారు. లేళ్ల అప్పిరెడ్డి గుంటూరు వెస్ట్ టికెట్ ను గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో చంద్రగిరి ఏసుర‌త్నం కోసం త్యాగం చేశారు. దీంతో ఆయ‌న‌ను శాంత ప‌రిచేందుకు జ‌గ‌న్ ప‌ద‌వి ఇస్తాన‌ని అప్పట్లోనే హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇదే జిల్లా చిల‌క‌లూరి పేట నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు కూడా మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని హామీ ఇచ్చారు.

పద్మావతికి కూడా…..

జ‌గ‌న్ ఇటు గుంటూరు వెస్ట్‌, అటు చిల‌క‌లూరిపేట‌లో బీసీ వ‌ర్గాల‌కు ఛాన్స్ ఇవ్వడంతో అప్పిరెడ్డి, రాజ‌శేఖ‌ర్ త‌మ సీట్లు త్యాగం చేయ‌క త‌ప్పలేదు. ఇక‌, మంత్రి ప‌దవి రేసులో చివ‌రి నిముషంలో అవ‌కాశం మిస్సయిన విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్రస్వామికి కూడా ఇప్పుడు ప‌ద‌వి ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది. ఇక‌, అనంత‌పురం జిల్లా శింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే జొన్నల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి కూడా ప‌ద‌వుల రేసులో ముందున్నారు. ప‌ద్మావ‌తికి ఏదో ఒక ప‌ద‌వి ఖ‌చ్చితంగా వ‌స్తుంద‌ని అంటున్నారు. ఆమెకు రెండు కుల స‌మీక‌ర‌ణ‌లు ప్లస్ కానున్నాయి.

న్యాయం చేయాలని….

మండ‌లి ర‌ద్దు కావ‌డంతో చాలా మందికి ప‌ద‌వుల‌పై ఆశ‌లు పోయినా.. ఈ న‌లుగురి విష‌యంలో జ‌గ‌న్ న్యాయం చేయాల‌ని నిర్ణయించుకున్నార‌ని స‌మాచారం. త్వర‌లోనే రాష్ట్రంలో నాలుగు ప్రాంతీయ మండ‌ళ్లు ఏర్పాటు కానున్నాయి. వీటికి చైర్మన్‌ల‌ను ఏర్పాటు చేసేందుకుజ‌గ‌న్ ప్రయ‌త్నిస్తున్నారు. ఈ జాబితాలోనూ చాలా మంది పేర్లు వినిపిస్తున్నా.. ఈ న‌లుగురికి అవ‌కాశం ద‌క్కుతుంద‌ని అంటున్నారు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News