డ్యూటీ దిగిపోతే?

వృత్తుల్లో కూడా అనేక రకాలు ఉంటాయి. దర్జాగా ఉదయం పది గంటలకు ఆఫీస్ కి వెళ్ళి సాయంత్రం అయిదు గంటలకల్లా ఇంటికి చేరే జాబ్ అంటే చాలా [more]

Update: 2020-02-10 13:30 GMT

వృత్తుల్లో కూడా అనేక రకాలు ఉంటాయి. దర్జాగా ఉదయం పది గంటలకు ఆఫీస్ కి వెళ్ళి సాయంత్రం అయిదు గంటలకల్లా ఇంటికి చేరే జాబ్ అంటే చాలా అదృష్టమనే అంటారు. అదే కొన్ని రంగాల్లో అయితే ట్వంటీ ఫోర్ హవర్స్ జాబ్ చేస్తూనే ఉండాలి. వైద్యులు, సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులకు అసలు టైం దొరకదు. మరి అలాంటిది ఏపీ లాంటి ఇబ్బందులో ఉన్న రాష్ట్రం, రాజకీయంగా రావణ కాష్టం లాంటి రాష్ట్రం, కొత్తగా ఏర్పడి ఇంకా విభజన గాయాలు కూడా మానని ఏపీలో ముఖ్యమంత్రి పదవి అంటే రోజులో ఒక్క ఇరవై నాలుగు గంటలే కాదు, మరో ఇరవై నాలుగు గంటలు కూడా కావాలనుకుంటారు ఎవరైనా. అంతలా పనిచేసినా తీరని సమస్యలు ఏపీకే సొంతం. కానీ అలాంటి ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని చెప్పుకునే చంద్రబాబు ఉంటే. రెండవ ముఖ్యమంత్రి జగన్ మాత్రం టెన్ టూ ఫైవ్ జాబ్ లా చేస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.

వీకెండ్ లో అంతే….?

జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక అధికారులకు ఒక శుభవార్త వినిపించారు. లేట్ అవర్స్, సెలవుల్లో అసలు రివ్యూస్ ఉండవని చెప్పేశారు. ఇక ఆఫీస్ గంటలు తరువాత తాను మీటింగులు పెట్టనని హ్యాపీగా ఉండొచ్చని వరాలు ఇచ్చేశారు. అది ఉద్యోగులకు బాగానే ఉంది. అయితే సీఎం కూడా ఆ టైంనే ఫాలో అయిపోతున్నారని చాలా కాలంగా వస్తున్న పెద్ద కంప్లైట్. జగన్ వీకెండ్ లో అసలు ఎవరికీ అందుబాటులో ఉండరట. ఫ్రైడే ఈవెనింగ్ ఫైవ్ కి జగన్ సీఎం గా డ్యూటీ దిగిపోతే మళ్ళీ మండే ఉదయం పది గంటలకే డ్యూటీ ఎక్కుతారని ఒక కామెంట్ ఉంది.

టీడీపీ సెటైర్లు…

ఇక విమర్శించేందుకు ఏది దొరుకుతుందా అని ఎపుడూ ఆలోచించే టీడీపీ దీన్ని కూడా వదిలిపెట్టడంలేదు. ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు అయితే జగన్ ఏపీ పాలన గురించి అసలు పట్టించుకోవడంలేదని, బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నరని, సాయంత్రం అయితే చాలు ఆయన వీడియో గేమ్స్, పబ్జీ గేమ్స్ ఆడుకుంటున్నారని గట్టిగానే విమర్శిస్తున్నారు. ఇక నిన్నటి ఎన్జీవో నేత, నేటి రాజకీయ నాయకుడు అయిన అశోక్ బాబు కూడా జగన్ ని విమర్శించేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి ఆఫీస్ ఎక్కడ ఉన్నా ఒక్కటేనని, ఆయన ఎవర్ని అయినా కలుస్తారా ఏంటి అంటూ వెటకారం ఆడుతున్నారు. ఇదే విధంగా తమ్ముళ్ళు మాట్లాడుతూ జగన్ సొంత పార్టీ వారికే ముఖం చూపించరని, ఇక ప్రజలకు ఏం న్యాయం చేస్తారని అంటున్నారు.

బాధ్యత ఉండాలి…

ఇలాంటి విమర్శల మీద వైసీపీ నేతలు కూడా గట్టి రిప్లై ఇస్తున్నారు. ముఖ్యమంత్రి ఆఫీసులో ఉంటేనే పాలించినట్లు కాదని, జగన్ నిరంతరం ఏపీ గురించి ఆలోచన చేస్తూ ఉంటారని, ఎప్పటికపుడు తగిన సూచనలు అందరికీ ఇస్తారని అంటున్నారు. ప్రతి వారి టైం విలువైనది అని భావించే మనిషి జగన్ అని అందుకే ఆయన అవసరం లేకపోయినా ఉద్యోగులతో మీటింగులు పెట్టి గొప్పలకు పోరని పరోక్షంగా చంద్రబాబు మీద సెటైర్లు వేస్తున్నారు. ఇక జగన్ ఎక్కడ ఉన్నారు, ఎంత సేపు గడిపారు అన్నది ముఖ్యం కాదని ఆయన చేసిన పనులు ఎలా ఉన్నాయన్నదే చర్చించాలని హితవు పలుకుతున్నారు. ఇలా వైసీపీ సమర్దించుకుంటున్నప్పటికీ ఆ పార్టీలోని పెద్దలకు కూడా జగన్ అప్పాయింట్ మెంట్ దొరకడం కష్టమన్న మాట మాత్రం ప్రచారంలో ఉంది. ఇక వీకెండ్ లో అయితే జగన్ ని కలవడం అన్నది చాలా దుర్లభం అన్న మాటా ఉంది. అయితే సీఎంగా జగన్ ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్తే మంచిదన్న సూచనలూ పార్టీ నుంచి కూడా వినిపించడం విశేషం.

Tags:    

Similar News