నమ్మినవారే ఇబ్బంది పెడుతున్నారే?

నేత‌ల శైలి చాలా బిన్నంగా ఉంటుంది. పార్టీఅధికారంలో లేన‌ప్పుడు ఒక‌విధంగా అధికారంలోకి వ‌చ్చాక మరో విధంగా వ్యవ‌హ‌రించ‌డం అంద‌రికీ కామ‌నే. ఇప్పుడు ఈ విష‌యం ఎందుకు చ‌ర్చకు [more]

Update: 2020-02-09 15:30 GMT

నేత‌ల శైలి చాలా బిన్నంగా ఉంటుంది. పార్టీఅధికారంలో లేన‌ప్పుడు ఒక‌విధంగా అధికారంలోకి వ‌చ్చాక మరో విధంగా వ్యవ‌హ‌రించ‌డం అంద‌రికీ కామ‌నే. ఇప్పుడు ఈ విష‌యం ఎందుకు చ‌ర్చకు వ‌స్తోందంటే.. ప్రస్తుతం ఈ దేశంలో హానెస్ట్ (నిజాయితీ) సీఎంలు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో జ‌గ‌న్ ముందు వ‌రుస‌లో ఉన్నారు. అలాంటి నాయ‌కుడు కూడా త‌న కేబినెట్ మంత్రుల‌ను ఆచితూచి వేసుకున్నారు. ఒక‌ప‌క్క.. మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇస్తూనే ఆయ‌న అత్యంత కీల‌క‌మైన నాయ‌కుల‌కు మాత్రమే త‌న కేబినెట్‌లో ఛాన్స్ ఇచ్చారు. ఇలాంటి వారిలో చాలా మంది జ‌గ‌న్‌కు ప్లస్సుగా ఉన్నవారు ఉన్నారు.

ఎనిమిది నుంచి పది మంది…

అంటే, వైసీపీని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు, జ‌గ‌న్‌ను సీఎంగా చూసేందుకు త‌పించిన వారిలో చాలా మంది కేబినెట్‌లో ప‌ద‌వులు ద‌క్కించుకున్నారు. వీరికి జ‌గ‌న్‌కు మ‌ధ్య చాలా ర్యాపో ఉంది. అయితే, ఇలాంటి ప్లస్సులే ఇప్పుడు జ‌గ‌న్‌కు భారీ మైన‌స్సులుగా మారార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్రస్తుత కేబినెట్‌లోని చాలా మంది మంత్రులు జ‌గ‌న్‌కు అన్నివిధాలా ఎప్పటికీ ప్లస్సులే.. అదేస‌మ‌యంలో వారు ఇప్పుడు మైన‌స్సులుగా మార‌డంతో జ‌గ‌న్ త‌ల‌ప‌ట్టుకుంటున్నార‌నే భావ‌న వ్యక్తమ‌వుతోంది. వీరిలో దాదా పు 8 నుంచి 10 మంది మంత్రుల పేర్లు బాహాటంగానే వినిపిస్తోంది.

బొత్స..అనిల్ లు….

అయితే, ఈ ప‌దిమందిలోనూ మ‌రింత మైన‌స్స్ అని వ్యాఖ్యలు ఎదుర్కొంటున్న మంత్రుల గురించి మాట్లాడుకుందాం. మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ‌. ఈయ‌న జ‌గన్‌కు చాలా ప్లస్. అయితే, ఈయ‌నే మైన‌స్ అయ్యారు. త‌న జిల్లా విజ‌య‌న‌గ‌రంలో తాను త‌ప్ప ఆయ‌న‌ పార్టీని ఎద‌గ‌నివ్వడం లేదు. కీల‌క‌మైన నాయ‌కులు ఈయ‌న క‌నుసన్నల్లోనే ప‌నిచేయాల్సి రావ‌డంతో వారంతా ప్రభుత్వ కార్యక్రమాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకువెళ్లలేక పోతున్నారు. ఇక‌, కుటుంబ ఆధిప‌త్యం పెరిగిపోయింది. అదేవిధంగా మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్‌. ఈయ‌న కూడా జ‌గ‌న్‌కు అత్యంత ప్లస్‌. జగ‌న్ సీఎం అయితే చాల‌ని క‌ల‌లు క‌న్న నాయ‌కుల్లో ఈయ‌న ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్నారు.

అంజాద్ భాషా కూడా….

అయితే, ఈయ‌న మంత్రి అయ్యాక నెల్లూరులో ఆధిప‌త్య పోరు పెరిగిపోయింది. అన్నీ త‌న‌క‌న్నుస‌న్నల్లో నే జ‌ర‌గాల‌నే మంకు ప‌ట్టుతో ముందుకు సాగుతున్నారు. ఎవ‌రినీ ఎద‌గ‌నివ్వడం లేద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక‌, కుటుంబ స‌భ్యుల వ‌సూళ్లన్నీ ఈయ‌న క‌నుస‌న్నల్లోనే సాగుతున్నాయ‌ట‌. దీంతో ఈయ‌న వ్యవ‌హారం మైన‌స్‌గా మారిపోయింది. మంత్రి అంజాద్ భాషా. మైనార్టీ నాయ‌కుడు. జ‌గ‌న్ సీఎం కావాల‌ని అనుకున్నారు. అయితే, త‌ర్వాత క‌డ‌ప రాజ‌కీయాల‌తో పోటీ ప‌డ‌లేక మౌనం వ‌హించారు. ఈ మౌనం జ‌గ‌న్‌కు శాపంగా మారింది. మైనార్టీ వ‌ర్గం ఇప్పుడు వ్యతిరేకిస్తున్న అనేక విష‌యాల‌పై ఆయ‌న సర్ది చెప్పడంలో విఫ‌ల‌మ‌య్యారు.

కొడాలి నాని, కృష్ణదాస్….

మంత్రి కృష్ణదాస్‌. ఈయ‌న కూడా జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు. భారీ ప్లస్‌. పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు కృషి చేశారు. అయితే, మంత్రిగా ఆయ‌న ప‌ద‌విలో ఉన్నా శ్రీకాకుళంలో పార్టీ ఎదుగుద‌ల‌కు కృషి చేయ‌లేక‌పోతున్నారు. ముఖ్యంగాజిల్లా టీడీపీ నాయ‌కుల దూకుడుకు ఆయ‌న క‌ళ్లెం వేయ‌లేక పోతున్నారు. ఇది మైన‌స్‌గా మారింది. కొడాలి నాని. వైఎస్ జ‌గ‌న్ అంటే ప్రాణం. దీంతో ఆయ‌న భారీ ప్లస్‌. కానీ, జ‌గ‌న్ ఆశ‌యాల‌కు అనుగుణంగా వ్యవహ‌రించ‌లేక‌ దురుసు ప్రవ‌ర్తనతో, వెకిలి వ్యాఖ్యల‌తో మైన‌స్ అయ్యారు.

ఆధిపత్యం కోసం…..

పెద్ది రెడ్డి రామ‌చంద్రారెడ్డి. జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహిత మంత్రి. ఇది గొప్ప ప్లస్‌. పార్టీ విప‌క్షంలో ఉండ‌గా.. పార్టీ కోసం పాద‌యాత్ర చేసిన నాయ‌కుడు కూడా ఈయ‌నే. అయితే, మంత్రి అయ్యాక చిత్తూరులో ఆధిప‌త్య పోరుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. టీడీపీ నుంచి మాజీ మంత్రి అమ‌ర్‌నాథ్‌రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకోవాల‌ని అనుకుంటున్నా.. మోకాల‌డ్డుతున్నారు. అన్ని చోట్లా ఆయన పేరు చెప్పుకుని ఆయ‌న అనుచ‌రులు వ‌సూళ్లకు తెర‌దీశార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. సో.. ఇలా చెప్పుకొంటూ పోతే.. ప‌దుల సంఖ్యలో మంత్రులు అటు ప్లస్ ఇటు మైన‌స్‌గా మారిపోయారు. మ‌రి జ‌గ‌న్ వీరిని ఎలా కంట్రోల్ చేస్తారో ? చూడాలి.

Tags:    

Similar News