ఇప్పుడు అసలు కథ తేలుతుంది

ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక తొలిసారిగా కేంద్రం దగ్గర ఆయనకు ఉన్న పలుకుబడి ఏంటన్నది చర్చకు వస్తోంది. జగన్ ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీని అనేక మార్లు [more]

Update: 2020-02-01 02:00 GMT

ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక తొలిసారిగా కేంద్రం దగ్గర ఆయనకు ఉన్న పలుకుబడి ఏంటన్నది చర్చకు వస్తోంది. జగన్ ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీని అనేక మార్లు కలవడం, కేంద్ర మంత్రులతో మంతనాలు జరపడం ఇవన్నీ ఒక ఎత్తు. ఇక నిధులను సాధించడం, సాధించకపోవడం కూడా వివిధ కారణాల మీద ఆధారపడిఉంటాయి. కానీ రాజకీయంగా, వ్యక్తిగతంగా కూడా జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న శాసనమండలి రద్దు బిల్లు ఇపుడు కేంద్రం కోర్టులోకి వెళ్ళింది. దానికి ఆమోద ముద్ర చకచకా వేయించడంపైనే జగన్ పలుకుబడి ఏంటన్నది లోకానికి తెలుస్తుందని అంటున్నారు.

బడ్జెట్ సెషన్ లోగానే….

జగన్ ఒకటి అనుకున్నారంటే అది వెంటనే జరిగిపోవాలి. ఏపీ బడ్జెట్ సమావేశాల నాటికి ఉభయ సభలూ ఉండరాదని, కేవలం అసెంబ్లీలో మాత్రమే గవర్నర్ మాట్లాడాలన్నది జగన్ గట్టి పట్టుదలగా ఉందిట. ఉభయ సభలూ సమావేశమైతే మళ్లీ యనమల రామకృష్ణుడు, నారా లోకేష్ వంటి వారు ముఖాలను జగన్ చూడాల్సిఉంటుందట. అందువల్ల మండలి రద్దు అయిన తరువాతనే ఏపీ బడ్జెట్ సమావేశాలు పెట్టాలని కూడా జగన్ డిసైడ్ అయ్యారట. ఇక నిన్ననే ఏపీ ప్రత్యేక సమావేశాలు జరిగాయి కాబట్టి మార్చి రెండవ వారం వరకూ బడ్జెట్ సమావేశాలు జరగవు అంటున్నారు. అంటే నెలన్నర సమయం ఉంది. ఈ సమయంలోనే మండలికి తాళం వేయించాలన్నది జగన్ పంతం.

జెట్ స్పీడ్ తో….

ఇలా అసెంబీలో మండలి రద్దు తీర్మానం అయిందో లేదో అలా కేంద్రానికి దాన్ని పంపారు. అంటే కేంద్రానికి తన తొలి ప్రాధాన్యత ఏంటన్నది జగన్ చెప్పకనే చెప్పారన్నమాట. ఇంతవరకూ బాగానే ఉన్నా కేంద్రం కూడా ఇంతలా సీరియస్ గా ఈ వ్యవహారాన్ని తీసుకోవాలి కదా. ఇలా తీర్మానం కాపీ వచ్చిన వెంటనే అలా పార్లమెంట్ ముందుకు తేలేరు కదా. మరి వారిలో ఆ చురుకుదనం పుట్టించాలంటే జగన్ తన పలుకుబడినే కాదు, రాజకీయ చతురతను కూడా ఉపయోగించాలి. మండలి రద్దు కధ యాభై రోజుల్లో పూర్తి చేసేందుకు తగిన ప్రణాళికను కూడా జగన్ రూపొందించుకోవాలి. ప్రధాని మోడీ సహా అమిత్ షా కేంద్ర పెద్దలతో గట్టిగానే లాబీయింగ్ చేయాలి.

అదే ధైర్యమా…?

అయితే జగన్ కి ఇక్కడ ఒక ధైర్యం ఉందని అంటున్నారు. రాజ్యసభలో తన పార్టీ ఎంపీలే ఆయన ధైర్యం అంటున్నారు. ఈ రోజుకు ఇద్దరు ఉన్న వైసీపీ ఎంపీలు మార్చి అంతానికి ఆరుగురు అవుతారు. అలాగే రాజ్యసభలో బీజేపీకి ఇపుడు ఉన్న డెబ్బైకి పైగా ఎంపీలు ఒక్కసారిగా తగ్గుతారని అంటున్నారు. ఈ రకమైన సమీకరణలే జగన్ లో కొత్త ఆశలు రేపుతున్నాయి. రాజ్యసభలో ఇకపై ప్రతీ బిల్లూ ఆమోదం పొందాలంటే జగన్ ఎంపీలు చాలా ముఖ్యం. దాంతో ఇదొక రాజకీయ రాయబేరమన్నమాట. నాకు నీవు, నీకు నేను అన్న తరహాలో మండలి రద్దుకు కేంద్రం ఒకే అంటే ఆ పార్టీ ఏ బిల్లు పెట్టినా జగన్ రాజ్యసభలో ఓకే అంటారన్నమాట. ఈ కారణం వల్లనే జగన్ తొందరగా కేంద్రానికి తీర్మానం పంపించారని, టీడీపీ వాళ్ళు అంటున్నట్లుగా ఏళ్ళూ, పూళ్ళూ కాకుండా గరిష్టంగా రెండు నెలల వ్యవధిలోనే మండలి చాప్టర్ క్లోజ్ చేయాలని జగన్ కంకణం కట్టుకున్నారట. ఓ విధంగా జగన్ సవాల్ గా తీసుకున్నాక మండలి రద్దు లేటుపై తమ్ముళ్ళు చేస్తున్న ప్రచారం పేరాశతోనే అనుకోవాలేమో.

Tags:    

Similar News