Ys jagan : ఇషాక్ కు జగన్ ఎందుకు ఎమ్మెల్సీగా చేశారంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందు చూపుతోనే వెళుతున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు కనపడుతుంది. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన [more]

Update: 2021-11-10 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందు చూపుతోనే వెళుతున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు కనపడుతుంది. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఇషాక్ భాషా కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తాను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్ మైనారిటీలకు పదవుల విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవులను గతంలో ముగ్గురికి కేటాయించారు.

ఎన్నికల ఎత్తుగడే….

తాజాగా ఇషాక్ భాషాకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం రాజకీయ ఎత్తుగడేనన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. కర్నూలు పట్టణ నియోజకవర్గం తొలి నుంచి వైసీపీకి అండగా ఉంటూ వస్తుంది. జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో ముస్లింలు గెలుపోటముల్లో కీలకంగా మారుతున్నారు. మైనారిటీలను వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో తమ వైపు తిప్పుకునేందుకు జగన్ ఇషాక్ భాషాకు ఇచ్చారన్న టాక్ పార్టీలో వినపడుతుంది.

జిల్లాలో ఎక్కువ ప్రాంతాల్లో….

కర్నూలు పట్టణ ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి ఇప్పటికే హఫీజ్ ఖాన్ ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయనకు సీటు ఇవ్వడంతో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కర్నూలు పట్టణంలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. కర్నూలు మాత్రమే కాకుండా నంద్యాల, ఆళ్లగడ్డ, ఆదోని, డోన్ వంటి ప్రాంతాల్లో ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. దీంతోనే ఇషాక్ భాషాను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారని భావిస్తున్నారు.

మార్కెట్ యార్డు ఛైర్మన్ నుంచి….

నంద్యాల మార్కెట్ యార్డు ఛైర్మన్ గా ఇషాక్ భాషా ప్రస్తుతం ఉన్నారు. నంద్యాలలో టీడీపీకి ముస్లిం నేతలు ఎక్కువగా ఉన్నారు. టీడీపీకి ఎన్ఎండీ ఫరూక్ నేతగా ఉన్నారు. నంద్యాలలో పార్టీ మరింత బలపడాలంటే ఇషాక్ ను ఎమ్మెల్సీగా చేయాలని జగన్ నిర్ణయించినట్లు తెలిసింది. గతంలో నంద్యాల పర్యటనలో భాగంగా ముస్లింలకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారని, దానిని నిలబెట్టుకున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.

Similar News