తోక జాడించారో…?

వైసిపి అధికారం లోకి వచ్చి రావడంతోనే ముఖ్యమంత్రి జగన్ ప్రజా వేదికను కూల్చేసి రణనినాదం చేశారు. ఇది చంద్రబాబు ను తెలుగుదేశాన్ని భయపెట్టేందుకే అని అంతా అనుకున్నారు. [more]

Update: 2020-01-28 08:00 GMT

వైసిపి అధికారం లోకి వచ్చి రావడంతోనే ముఖ్యమంత్రి జగన్ ప్రజా వేదికను కూల్చేసి రణనినాదం చేశారు. ఇది చంద్రబాబు ను తెలుగుదేశాన్ని భయపెట్టేందుకే అని అంతా అనుకున్నారు. కానీ ఫ్యాన్ పార్టీ అధినేత ఆలోచన వేరంటున్నారు. పదేళ్లుగా విపక్షంలో ఉండి ఆవురావురుమంటూ వున్న వైసిపి శ్రేణులకు గట్టి సందేశం ఇచ్చి అదుపులో పెట్టేందుకే అన్నది ఆ పార్టీ ఆఫ్ ది రికార్డ్ లో ముఖ్య నేతల మాట. అవినీతి బురద గత పదేళ్ళుగా పార్టీపైనా, దొంగలుగా నేతలపైనా వున్న ముద్ర తుడిచిపెట్టాలంటే తమ సర్కార్ నిజాయితీని ప్రజల్లో జగన్ నిరూపించుకోవాలిసి వుంది. అందుకే తొలి గురి ప్రజావేదిక కూల్చివేత పై పెట్టి అక్రమాలు, అన్యాయం సహించేది లేదనే హెచ్చరికలు పరోక్షంగా తమ పార్టీ వారికి గట్టిగా పంపారని తెలుస్తుంది.

మండలి రద్దుతో గ్రూప్ లకు …

శాసనమండలి రద్దు నిర్ణయం ఎంతో సాహసోపేతమైనది. జగన్ ఇలాంటి డిసిషన్ తీసుకుంటారని విపక్ష టిడిపి లో వారే కాదు వైసిపి వర్గాలు ఊహించలేదు. ఎన్నికల్లో పలువురికి జగన్ ఇచ్చిన హామీలు, అలాగే మండలిలో పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వంటి తనకు ఇష్టమైన సహచరుల పదవులు ఊడిపోయే పనులు ఆయన చేస్తారని ఎవ్వరూ లెక్కేయలేదు. అయితే అనూహ్యంగా ముఖ్యమంత్రి అందరికి షాక్ ఇచ్చేశారు.

గ్రూపులకు గట్టి షాక్….

దీనికి పలు కారణాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల కొన్ని జిల్లాల్లో వైసిపి నేతల నడుమ గ్రూప్ వార్ లు మొదలైయ్యాయి. ఆధిపత్యం కోసం ఆరాటంతో పార్టీ పరువును ఫ్యాన్ పార్టీ నేతలు రోడ్డుకి ఈడుస్తున్నారు. వీరికి పలుసార్లు ఒక పక్క హెచ్చరికలు పంపుతున్నా తన నిర్ణయాలను, మాటను లెక్క చేయకపోతే ఫలితాలు ఎంతటి తీవ్రంగా వుంటాయో చాటి చెప్పేందుకు మండలి రద్దు బాగా పనికొస్తుందని మరికొంత కాలం అధికార వైసిపిలో క్రమశిక్షణ బాగా పెరుగుతుందని ఆ పార్టీ వారే అంటూ ఉండటం విశేషం.

Tags:    

Similar News