Ys jagan : డేంజర్ జోన్ లో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు

వైసీపీలో తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు దాదాపు 66 మంది ఉన్నారు. మొత్తం 175 నియోజకవర్గాలకు గాను కొత్త వారిని ఎంపిక చేయడంతో జగన్ గత ఎన్నికల్లో సక్సెస్ [more]

Update: 2021-11-08 02:00 GMT

వైసీపీలో తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు దాదాపు 66 మంది ఉన్నారు. మొత్తం 175 నియోజకవర్గాలకు గాను కొత్త వారిని ఎంపిక చేయడంతో జగన్ గత ఎన్నికల్లో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ దృష్టి పెట్టినట్లు తెలిసింది. వారి పనితీరు ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు తిరిగి లభించే అవకాశముంది. కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు తెలియడంతో వారికి ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారని తెలిసింది.

ఫస్ట్ వార్నింగ్….

పనితీరును మార్చుకోవాలని జగన్ ఇప్పటికే కొందరికి సూచించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా చిత్తూరు జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో తొలి సారి గెలిచిన ఎమ్మెల్యేలపై అసంతృప్తి నెలకొంది. వీరికి ఇప్పటికే హెచ్చరికలు అధిష్టానం నుంచి అందాయి. నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడం, సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత మొదలు కావడంతో రానున్న కాలంలో పనితీరు మార్చుకోవాల్సిందిగా సూచనలు అందినట్లు చెబుతున్నారు.

వీరందరికీ కష్టమే…..

కొన్ని జిల్లాల్లో సామాజిక సమీకరణాలు, పార్టీలో అసంతృప్తుల నేపథ్యంలో దృష్ట్యా కొందరికి మరోసారి టిక్కెట్ దక్కే అవకాశం లేదని అంటున్నారు. ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు, దర్శి, కనిగిరి, కర్నూలు జిల్లాలోని కోడుమూరు, నందికొట్కూరు, నెల్లూరు జిల్లాలోని గూడూరు, గుంటూరు జిల్లాలోని తాడికొండ, పొన్నూరు, తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం, విశాఖ జిల్లాలోని పాడేరు, గాజువాక, విజయనగరం జిల్లాలోని ఎస్.కోట వంటి చోట్ల అభ్యర్థు మార్పు ఖాయమంటున్నారు. వీరంతా డేంజర్ జోన్ లో ఉన్నట్లే. రానున్న కాలంలో వీరు పనితీరును మార్చుకుని, పార్టీలో ఉన్న అసంతృప్తులను తొలగించుకోకుంటే వచ్చే ఎన్నికల్లో వీరందరికీ టిక్కెట్లు దక్కడం కష్టమేనన్న టాక్ పార్టీ నుంచి విన్పిస్తుంది.

జిల్లాల వారీగా తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు వీరే

జమ్మలమడుగు – సుధీర్ రెడ్డి
బద్వేలు -దాసరి సుధ
కడప – అంజద్ బాషా సాహెబ్ బేపరి
చిత్తూరు – ఆరంగి శ్రీనివాస్
పూతలపట్టు – ఎంఎస్ బాబు
పలమనేరు – ఎన్. వెంకటయ్య గౌడ
మదనపల్లె – నవాజ్ బాషా
తంబాళపల్లె – పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి
శ్రీకాళహస్తి – బియ్యపు మధుసూధన్ రెడ్డి
సత్యవేడు (ఎస్సీ) – కె.ఆదిమూలం
తాడిపత్రి – కేతిరెడ్డి పెద్దారెడ్డి
అనంతపురం అర్బన్ – అనంత వెంకటరామిరెడ్డి
కళ్యాణదుర్గం – కె.వి.ఉషశ్రీ చరణ్
సింగనమల (ఎస్సీ) – జొన్నగడ్డల పద్మావతి
గుంతకల్లు – యల్లారెడ్డి గారి వెంకటరామి రెడ్డి
రాప్తాడు – తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
పెనుకొండ – మెలగుండ్ల శంకరనారాయణ
కదిరి – డాక్టర్ పి.వి.సిద్ధారెడ్డి
పుట్టపర్తి – దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి
కర్నూలు – హఫీజ్ ఖాన్
పత్తికొండ – కె. శ్రీదేవి
కొడుమూరు (ఎస్సీ) – డాక్టర్ సుధాకర్ బాబు
నంద్యాల – శిల్పా రవిచంద్రారెడ్డి
ఆళ్లగడ్డ – గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి
బనగానపల్లె – కాటసాని రామిరెడ్డి
శ్రీశైలం – శిల్పా చక్రపాణి రెడ్డి
నందికొట్కూరు (ఎస్సీ) – ఆర్థర్
గూడూరు (ఎస్సీ) – వరప్రసాద్
సంతనూతలపాడు – టీజేఆర్ సుధాకర్ బాబు
దర్శి – మేడిశెట్టి వేణుగోపాల్
మార్కాపురం – కేపీ నాగార్జున రెడ్డి
కనిగిరి – బుర్రా మధుసూదన యాదవ్
వేమూరు – మేరుగు నాగార్జున
పొన్నూరు – కిల్లారి రోశయ్య
తాడికొండ – ఉండవల్లి శ్రీదేవి
తెనాలి – అన్నాబత్తుని శివకుమార్
పెద్దకూరపాడు – నంబూరి శంకర్ రావు
చిలకలూరిపేట – విడుదల రజని
వినుకొండ – బోల్ల బ్రహ్మనాయుడు
గురజాల – కాసు మహేశ్ రెడ్డి
కైకలూరు -దూలం నాగేశ్వరరావు
అవనిగడ్డ – రమేశ్ బాబు సింహాద్రి
పామర్రు – కాయల అనిల్ కుమార్
నందిగామ – మొండికోట జగన్మోహన్ రెడ్డి
మైలవరం – వసంతకృష్ణ ప్రసాద్
దెందులూరు – కొటారు అబ్బాయ్ చౌదరి
చింతలపూడి(ఎస్సీ )- వీఆర్ ఐజా
ఉంగుటూరు – పుప్పాల శ్రీనివాసరావు
ఉండి – పీవీఎల్ నరసింహరావు
నిడదవోలు – జీఎస్ నాయుడు
గోపాలపురం(ఎస్సీ) – తలారి వెంకట్రావు
రామచంద్రాపురం – శ్రీనివాస వేణుగోపాల కృష్ణ చెల్లుబోయిన
గన్నవరం(ఎస్సీ) – చిట్టిబాబు కొండేటి
రంపచోడవరం(ఎస్టీ) – నగులపల్లి ధనలక్ష్మి
జగ్గంపేట – జ్యోతుల చంటిబాబు
రాజానగరం – జక్కంపూడి రాజా
అనపర్తి – డా.సత్తి సూర్యనారాయణరెడ్డి
పెందుర్తి – అదీప్ రాజ్
నర్సీపట్నం – పెట్ల ఉమాశంకర్ గణేశ్
పాడేరు(ఎస్టీ) – భాగ్యలక్ష్మి
అరకు లోయ(ఎస్టీ) – చెట్టి పాల్గుణ
గాజువాక – తిప్పల నాగిరెడ్డి
పార్వతీపురం – అలజంగి జోగరావు
ఎస్ కోట – కడుబండి శ్రీనివాస్
పాతపట్నం – రెడ్డి శాంతి
పలాస – సీదిరి అప్పలరాజు

Tags:    

Similar News