Ys jagan : తాడేపల్లి నుంచే కంట్రోల్ చేయగలిగారా?

రాజకీయాల్లో కేవలం అనుభవం ఉంటేనే సరిపోదు. అధికారంలో వారి వలలో చిక్కకూడదు. అలాగే వారికి దన్నుగానే ఉండాలి. అప్పడే తమకు కావాల్సిన సమయంలో పరిస్థితులు అనుకూలంగా మారిపోతాయి. [more]

Update: 2021-10-26 14:30 GMT

రాజకీయాల్లో కేవలం అనుభవం ఉంటేనే సరిపోదు. అధికారంలో వారి వలలో చిక్కకూడదు. అలాగే వారికి దన్నుగానే ఉండాలి. అప్పడే తమకు కావాల్సిన సమయంలో పరిస్థితులు అనుకూలంగా మారిపోతాయి. నలభై ఏళ్ల రాజకీయం అనుభవం తనకు ఉందని చంద్రబాబు చెప్పుకుంటారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు జగన్ బుడ్డిపాలు తాగుతుంటాడాని మొన్నామధ్య 36 గంటల దీక్షలో చంద్రబాబు చెప్పారు. అంటే తనకంటే జగన్ బచ్చా అని చెప్పకనే చెప్పారు.

గల్లీలకే పరిమితం….

కానీ ఆ బచ్చానే ఇప్పుడు చంద్రబాబుకు ఊహించని షాక్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ఒంటి చేత్తో చంద్రబాబును చితక్కొట్టిన జగన్, ఇప్పుడు రాజకీయంగా కూడా రాటుదేలిపోయారు. చంద్రబాబు కంటే వ్యూహాల్లో దిట్ట అని నిరూపించుకున్నారు. చంద్రబాబును ఢిల్లీలో గల్లీలకే పరిమితం చేసి కేంద్రం పెద్దల అపాయింట్ మెంట్లు దొరకకుండా చేయడంలో జగన్ వ్యూహం ఉందని అంటున్నారు. జగన్ తాడేపల్లి ఇంట్లోనే ఉండి ఢిల్లీలో చంద్రబాబును కంట్రోల్ చేయగలిగారు.

నాడు చేసిన తప్పులే….

నిజానికి చంద్రబాబుకు గతంలో చేసిన తప్పులే ఇప్పుడు వెంటాడుతున్నాయి. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన బీజేపీతో పొత్తు ఉన్నా కేంద్ర మంత్రి పదవులు తీసుకోకుండా ఉండాల్సింది. దానివల్ల రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనం ఏదీ లేదు. అయినా రెండు కీలకమైన మంత్రి పదవులు పొందారు. మూడేళ్ల తర్వాత సాకులు చెప్పి బీజేపీతో ఫ్రెండ్ షిప్ కటీఫ్ చెప్పేశారు. అలాగని ఊరుకున్నారా? మోదీ, అమిత్ షాలపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఢిల్లీ వెళ్లి మరీ కాంగ్రెస్ నేతలను కలసి మోదీని ఓడించాలని పిలుపు నిచ్చారు. కానీ రాజకీయాల్లో తక్కువ అనుభవం ఉన్న జగన్ అలా చేయలేదే?

జగన్ రూటు….

తాను అత్యధిక పార్లమెంటు స్థానాలను గెలిచినా కేంద్ర ప్రభుత్వంలో చేరేందుకు జగన్ ప్రయత్నించలేదు. బీజేపీ నేతలు ఆఫర్ ఇచ్చినా సున్నితంగానే తిరస్కరించారంటారు. అంతేకాకుండా బయట నుంచే అంశాల వారీగా మద్దతు ఇస్తున్నారు. బీజేపీతో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదు. బీజేపీ నేతలు కోరినట్లుగానే టీటీడీలో కొందరికి సభ్యులుగా అవకాశం కల్పించారు. ఇలా తన జుట్టును వారి చేతుల్లో పెట్టలేదు. ఫలితంగానే జగన్ జోక్యంతో చంద్రబాబుకు ఢిల్లీలో ఎవరి అపాయింట్ మెంట్ లభించలేదని, బాబు ఢిల్లీ టూర్ ను జగన్ తాడేపల్లి నుంచే అట్టర్ ప్లాప్ చేశారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News