Ys jagan : జగన్ కు అదే వరం.. అదే శాపమా?

ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత జగన్ రాజీ పడని విషయం ఏదైనా ఉందీ అంటే అది హామీలనే చెప్పాలి. ఎన్ని ఆర్థిక కష్టాలున్నా పథకాల అమలుకు ఆయన [more]

Update: 2021-11-04 02:00 GMT

ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత జగన్ రాజీ పడని విషయం ఏదైనా ఉందీ అంటే అది హామీలనే చెప్పాలి. ఎన్ని ఆర్థిక కష్టాలున్నా పథకాల అమలుకు ఆయన వెనకాడటం లేదు. ఖజానా ఖాళీగా ఉన్నా చెప్పిన సమయానికి లబ్దిదారుల ఖాతాల్లో జగన్ నిధులను జమ చేస్తున్నారు. ఇది ఆయనకు కలసి వచ్చే అంశమే. కోట్లాది మంది లబ్దిదారుల్లో ఒక నమ్మకాన్ని జగన్ ఏర్పరచుకున్నారు. జగన్ ఉంటే తమకు వచ్చే నగదు ఆగదన్న భరోసా వారిలో కన్పిస్తుంది.

చెప్పిన టైంకు చెప్పినట్లే….

వివిధ పథకాల కింద జగన్ చెప్పిన టైంకు చెప్పినట్లే వారి బ్యాంకు అకౌంట్ లో జమ చేస్తున్నారు. ఇప్పటికే వివిధ పథకాల కింద దాదాపు మూడున్నర లక్షల కుటుంబాలకు జగన్ లక్ష కోట్లకుపైగానే నగదును జమ చేశారు. ఇందుకు క్యాలెండర్ రూపొందించి మరీ ఆ తేదీకి నగదును జమ చేస్తుండటంతో లబ్దిదారుల్లో విశ్వాసం పెరిగింది. వివిధ పథకాల ద్వారా తమకు నగదు ఎప్పుడు అందుతుందో తెలుసుకుని వారు తమ బడ్జెట్ ను రూపొందించుకునేందుకు ఉపయోగపడుతుంది.

జీతాలయినా…?

ఇప్పటి వరకూ జగన్ వివిధ పథకాల ద్వారా అందించిన లక్ష కోట్ల రూపాయల నగదు తిరిగి మార్కెట్ లోకే రావడంతో రాష్ట్ర ఆదాయం కూడా పెరిగింది. కరోనా సమయంలోనూ పథకాలను జగన్ ఆపకపోవడంతో ఆయన పాలనపై లబ్దిదారులకు మరింత విశ్వాసాన్ని పెంచింది. ఏపీలో ఉద్యోగుల జీతాలయినా ఆలస్యమవుతాయేమో కాని, తమకు పథకాల ద్వారా రావాల్సిన నగదు లేట్ కాదన్న నమ్మకాన్ని జగన్ కల్గించడంలో సక్సెస్ అయ్యారు.

వారిలో అసహనం…

అయితే ఇదే సమయంలో అభివృద్ధి లేకుండా జగన్ ప్రజా సొమ్మును పప్పు బెల్లాలుగా పంచి పెడుతున్నారన్న విమర్శలు లేకపోలేదు. పథకాలు అందని లబ్దిదారులు, ఉద్యోగులు, ఎగువ మధ్యతరగతి ప్రజలు మాత్రం ఈ పథకాలకు నగదును చెల్లించే ప్రక్రియపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీరిలో 70 శాతం మందిలో జగన్ పాలన పట్ల వ్యతిరేకత కన్పిస్తుంది. మొత్తం మీద జగన్ మూడేళ్ల పాలనలో పథకాలు వరంగానే కన్పిస్తున్నా, మరొక కోణంలో శాపంగానూ పరిణమించే అవకాశం లేకపోలేదు.

Tags:    

Similar News