Ys jagan : యాటిట్యూడ్ మార్చుకుంటేనే మరోసారి?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందరినీ దూరం చేసుకుంటున్నారు. తనను ప్రేమించిన వారు సయితం ద్వేషించే పరిస్థితులు తెచ్చుకుంటున్నారు. ఒక్కొక్కరుగా జగన్ ను వీడి పోతుండటం పార్టీకి [more]

Update: 2021-11-01 14:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందరినీ దూరం చేసుకుంటున్నారు. తనను ప్రేమించిన వారు సయితం ద్వేషించే పరిస్థితులు తెచ్చుకుంటున్నారు. ఒక్కొక్కరుగా జగన్ ను వీడి పోతుండటం పార్టీకి తీవ్ర స్థాయిలో నష్టం చేకూరుస్తుందనే చెప్పాలి. డీఎల్ రవీంద్రారెడ్డితో ప్రారంభమైన ఈ అసహనం మరికొంత మంది నేతల్లోనూ త్వరలోనే బయటపడే అవకాశాలున్నాయి. జగన్ ఈ పరిస్థితులను తానే కొని తెచ్చుకుంటున్నారు.

ఎంతోమంది బలంగా….

జగన్ అధికారంలోకి రావాలని ఎంతో మంది నేతలు కోరుకున్నారు. సామాజికవర్గం పరంగా, రాజకీయంగా తటస్థులు సయితం జగన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని భావించారు. గత ఎన్నికల్లో వారు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జగన్ కు లాభపడ్డారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ వారిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అసలు వాళ్లు ఉన్నారనే స్పృహ లేకుండా జగన్ వ్యవహరిస్తున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

తనవల్లనేనన్న భ్రమలో….

గత ఎన్నికల్లో తటస్థులగా ఉన్న ఉండవల్లి అరుణ‌ కుమార్ వంటి నేతలు కూడా పరోక్షంగా జగన్ విజయానికి సహకరించారు. ఇక నియోజకవర్గ స్థాయి నేతలయితే పేర్లు చెప్పలేనంత మంది జగన్ ను మనస్ఫూర్తిగా సీఎం కావాలని కోరుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన వల్లనే విజయం సాధ్యమయిందన్న ఓవర్ కాన్ఫిడెన్స్ జగన్ లో బాగా పేరుకుపోయింది. దీంతో ఎవరినీ లెక్క చేయడం లేదు. ఇది రానున్న ఎన్నికల్లో ప్రభావం తీవ్ర స్థాయిలో చూపే అవకాశముంది.

మరికొందరు నేతలు…

జగన్ కు ఈ అసంతృప్తులు కొత్తేమీ కాదు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ప్రతిపక్షంలో ఉన్నంత వరకూ అనేక మంది నేతలు జగన్ ను వీడారు. సబ్బం హరి, కొణతాల రామకృష్ణ, మైసూరారెడ్డి తో పాటు అనేకమంది పార్టీ నుంచి వెళ్లిపోయారు. చివరకు సోదరి షర్మిల కూడా దూరమయ్యారు. కేవలం తన వల్లనే గెలిచారనుకోవడం ఒక భ్రమ. ఆ భ్రమ నుంచి బయటపడితేనే వైసీీపీ బాగు పడుతుంది. మరోసారి అధికారంలోకి వస్తుంది. మరికొందరు నేతలు పార్టీ నుంచి జారిపోతే దానికి జగన్ యాటిట్యూడ్ మాత్రమే కారణమని చెప్పక తప్పదు.

Tags:    

Similar News