Ysrcp : ఎమ్మెల్యేలను జగన్ అలా ఫిక్స్ చేశారా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. ఇటు అధినేత జగన్ అటు పార్టీ నేతలు కూడా మానసికంగా ఎన్నికలకు సిద్దమయ్యారు. మరికొద్ది రోజుల్లోనే [more]

Update: 2021-11-01 02:00 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. ఇటు అధినేత జగన్ అటు పార్టీ నేతలు కూడా మానసికంగా ఎన్నికలకు సిద్దమయ్యారు. మరికొద్ది రోజుల్లోనే ప్రశాంత్ కిషోర్ టీం రానుంది. వారు వచ్చిన వెంటనే సర్వేల హడావిడి ప్రారంభమవుతుంది. అంటే ఎన్నికల వాతావరణం నియోజకవర్గాల్లో అలుముకున్నట్లే. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు సయితం పల్లె బాట పట్టారు. ఇప్పటి వరకూ వ్యాపారాలపై దృష్టి పెట్టిన ఎమ్మెల్యేలు ప్రజల మధ్య కనిపిస్తున్నారు.

అందుబాటులో ఉండకుండా….

ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని గ్రహించిన జగన్ యాక్షన్ ప్లాన్ వారి ముందు ఉంచారు. వైఎస్సార్ ఆసరా పథకాన్ని లబ్దిదారులకు అందచేయాలని జగన్ ఆదేశించారు. దీంతో నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనక తప్పలేదు. అంతేకాదు వారానికి రెండు రోజుల పాటు ఖచ్చితంగా ఏదో ఒక గ్రామ సచివాలయాన్ని సందర్శించాల్సిందేనని జగన్ ఆదేశించారు. తాను కూడా రచ్చబండ పేరుతో గ్రామ సచివాలయాలను సందర్శిస్తానని చెప్పారు.

కార్యక్రమాలతో….

దీంతో జగన్ రాకముందే గ్రామ సచివాలయాలకు ఎమ్మెల్యేలు వెళుతున్నారు. అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకుంటున్నారు. గ్రామ సచివాలయంలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యేలు అడిగి తెలుసుకుంటున్నారు. నిజానికి వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉంది. వారి కారణంగా ప్రజలకు దూరమయిపోతున్నామన్న ఆవేదన వారిలో ఉంది. అయితే ఆ వ్యవస్థ జగన్ డ్రీమ్ ప్రాజెక్టు కావడంతో ఏమీ అనలేకపోయారు.

ఫిక్స్ చేసి మరీ…..

అందుకే జగన్ కూడా ఎమ్మెల్యేల వ్యవహార శైలిని గమనించి వారానికో కార్యక్రమాన్ని ఫిక్స్ చేశారంటున్నారు. దీనివల్ల వారంలో ఐదు రోజుల పాటు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఉండేలా కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాల వివరాలను నియోజకవర్గాల వారీగా తెప్పించుకుని నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలకు కూడా సిద్ధమయ్యే అవకాశముంది. మొత్తం మీద ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను పోగొట్టే కార్యక్రమాన్ని జగన్ స్వయంగా చేపట్టినట్లు కనపడుతుంది.

Tags:    

Similar News