Ys jagan : జగన్ చుట్టూ గార్బేజీని వదిలించుకోరా?

అవును.. మోహన్ బాబు చేసిన కామెంట్స్ ను తప్పుపట్టలేం. జగన్ కు నేరుగా చెప్పలేరు కాని. ఏపీలోని వైసీపీ నాయకత్వంలో ఇదే రకమైన కామెంట్స్ అంతర్గతంగా వినపడుతున్నాయి. [more]

Update: 2021-10-13 15:30 GMT

అవును.. మోహన్ బాబు చేసిన కామెంట్స్ ను తప్పుపట్టలేం. జగన్ కు నేరుగా చెప్పలేరు కాని. ఏపీలోని వైసీపీ నాయకత్వంలో ఇదే రకమైన కామెంట్స్ అంతర్గతంగా వినపడుతున్నాయి. చెబితే లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయని ఊరుకుంటున్నారు కాని మోహన్ బాబు లాంటి నేతలు పదుల సంఖ్యలోనే వైసీపీ లో ఉన్నారు. సీనియర్ నేతలు సలహాలు ఇవ్వాలన్నా ఇవ్వడం లేదు. ఎందుకంటే జగన్ సలహాదారులే కొంపముంచుతున్నారు కాబట్టి.

మోహన్ బాబు చేసిన….

ఇటీవల సినీనటుడు మోహన్ బాబు ఒక టీవీ ఇంటర్యూలో మాట్లాడుతూ జగన్ ను కొందరు ఐఏఎస్ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. మోహన్ బాబు వ్యాఖ్యల్లో కొంత నిజముంది. అసలు వాస్తవమేమిటంటే పార్టీలోని కీలక నేతలే జగన్ ను తప్పుదోవ పట్టిస్తున్నారు. జగన్ ఎవరి సలహా తీసుకోరన్న ప్రచారం ఉన్నప్పటికీ కొందరి ముఖ్యల సలహాలను జగన్ తీసుకుంటారు. వారే ఇప్పడు జగన్ రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారు.

గతంలో బాబు కూడా….

గతంలో చంద్రబాబు కూడా ఇలాగే అధికారులపై ఆధారపడ్డారు. అధికారులు ఇచ్చిన తప్పుడు నివేదికలు చూస్తూ మురిసిపోయి మందహాసాలు చేేసేవారు. విపక్ష పార్టీలను చిన్నచూపు చూసేవారు. కానీ అదే చివరకు ముంచేసిందని ఫలితాలు చూసిన తర్వాత కాని చంద్రబాబుకు తెలయరాలేదు. పార్టీలో విభేదాలు పరిష్కరించకుండా నేతలు ఇచ్చే నివేదికలు, చెబుతున్న మాటలు విని జగన్ కూడా ఆనందపడుతున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రయత్నించడం లేదు. అసలు ఎవరితోనైనా మాట్లాడితే కదా? విషయాలు తెలిసేది అని కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఓడిపోతే వారి తప్పేనట….

2024 లో ఒకవేళ జగన్ ఓడిపోతే అది జనం తప్పు కాదట. ఓటర్ల తప్పు కూడా కాదట. జగన్ పొరపాటు కూడా కాదట. కేవలం చుట్టూ ఉన్న వాళ్ల వల్లే జగన్ ఓడిపోయారని అనుకోవాల్సి ఉంటుందన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. జగన్ తన చుట్టూ గార్బేజీని పెట్టుకుని కూర్చున్నారని సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులే అంటున్నారు. పోటీలో గెలవడం కోసం టీం ను తయారు చేసుకోవడం నైపుణ్యమని, గెలుస్తామని ఓడిపోయే టీంను పెట్టుకోవడం మూర్ఖత్వమే అనుకోవాలని ఒక సీనియర్ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు. మోహన్ బాబు అన్నాడని కాదు కాని ఈ అభిప్రాయం వైసీపీ నేతలు 60 శాతం మందిలో ఉంది.

Tags:    

Similar News