ys jagan : వారికి నో ఛాన్స్…. వీరికే ఎక్కువ అవకాశం

జగన్ మంత్రి వర్గ విస్తరణపై చాలా కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యమైన నేతలతో మనసులో భావాలను పంచుకుంటున్నారు. ఏపీలో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలున్నాయి. నిజానికి దసరాకు [more]

Update: 2021-10-13 02:00 GMT

జగన్ మంత్రి వర్గ విస్తరణపై చాలా కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యమైన నేతలతో మనసులో భావాలను పంచుకుంటున్నారు. ఏపీలో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలున్నాయి. నిజానికి దసరాకు మంత్రి వర్గ విస్తరణ చేయాలనుకున్నప్పటికీ బద్వేల్ ఉప ఎన్నిక రావడంతో మంత్రి వర్గ విస్తరణను సంక్రాంతికి వాయిదా వేశారు. ఈసారి జగన్ పూర్తి స్థాయిలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారు. వంద శాతం కొత్తవారికి అవకాశం కల్పించనున్నారు.

జాబితాను రెడీ…..

ఈ పరిస్థితుల్లో తాను మంత్రి పదవిలోకి తీసుకోవాల్సిన జాబితాను జగన్ ఇప్పటికే సిద్దం చేసుకున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సామాజికవర్గాలను పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా, క్లీన్ ఇమేజ్ ఉన్నవారికే అవకాశం ఇవ్వనున్నారని తెలిసింది. ఇప్పటి వరకూ కొందరి పేర్లను మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావించినా వారిపై కొన్ని కేసులు ఉండటం, అవినీతి ఆరోపణలు రావడంతో వారిని పక్కన పెట్టాలని జగన్ నిర్ణయించారు.

ఇంటలిజెన్స్ నివేదికల ద్వారా….

ఇప్పటికే తన మంత్రి వర్గంలో ఉన్న గుమ్మనూరి జయరాం, ఆదిమూలపు సురేష్ వంటి వారిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. సురేష్ ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని సీబీఐ కేసు కూడా నమోదు చేసింది. అయితే ఇప్పుడు వచ్చేది ఎన్నికల టీం కాబట్టి క్లీన్ ఇమేజ్ ఉన్నవారికే అవకాశం ఇస్తారంటున్నారు. ఇందులో భాగంగా జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకంటున్నారు. ఇంటలిజెన్స్ నివేదికల ఆధారంగా ఎవరిపై ఆరోపణలున్నాయన్నది తెలుసుకుని తర్వాత జాబితాను ఖరారు చేస్తారంటున్నారు.

సమర్థతకే….

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఈసారి ఎక్కువ మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అక్కడ జనసేన బలంగా ఉండటంతో పాటు టీడీపీతో కలసి పోటీ చేస్తే ఎదుర్కొనే సత్తా ఉన్న నేతలకే ఇక్కడ మంత్రిగా బాధ్యతలను అప్పగిస్తారని చెబుతున్నారు. సామాజికవర్గం పరంగానే కాకుండా ఈ మంత్రివర్గంలో సమర్థతకే పెద్ద పీట వేయాలన్నది జగన్ నిర్ణయంగా ఉంది. మరి ఎవరికి మంత్రి పదవి వరిస్తుందనేది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News