Ys jagan : ఇప్పుడు కూడా జగన్ దూరమేనట

బద్వేల్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలయింది. అక్టోబరు 30వ తేదీన ఎన్నిక జరగనుంది. వైసీపీ అభ్యర్థిగా వెంకటసుబ్బయ్య సతీమణి దాసరి సుధ పేరును వైఎస్ జగన్ ఖరారు [more]

Update: 2021-09-28 06:30 GMT

బద్వేల్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలయింది. అక్టోబరు 30వ తేదీన ఎన్నిక జరగనుంది. వైసీపీ అభ్యర్థిగా వెంకటసుబ్బయ్య సతీమణి దాసరి సుధ పేరును వైఎస్ జగన్ ఖరారు చేశారు. డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమయింది. బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి జగన్ రెండు నెలల క్రితమే ప్రచారాన్ని ప్రారంభించారు. బద్వేలులో దాదాపు ఆరు వందల కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించి వచ్చారు.

ప్రచారానికి దూరంగా….

అయితే జగన్ బద్వేలు ఉప ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనే అవకాశం లేదు. బద్వేలులో వైసీపీకి గట్టి పట్టుంది. టీడీపీ బలహీనంగా ఉంది. టీడీపీ కూడా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన ఓబులాపురం రాజశేఖర్ పేరునే ఖరారు చేసింది. దీంతో సునాయాస విజయమేనని వైసీపీ భావిస్తుంది. ఈ కారణంగానే ముఖ్యమంత్రి జగన్ బద్వేలు ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటారని తెలుస్తోంది.

ఏ ఎన్నికలోనూ….

ఇప్పటి వరకూ జరిగిన ఏ ఎన్నికల్లోనూ జగన్ ప్రచారంలో పాల్గొనలేదు. కార్పొరేషన్ ఎన్నికలు, పరిషత్ ఎన్నికలు జరిగినా ఆయన ప్రచారానికి దూరంగానే ఉన్నారు. తిరుపతి లోక్ సభ ఎన్నికల ప్రచారానికి జగన్ వెళదామనుకున్నా కరోనా కారణంగా చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ జరిగిన ఏ ఎన్నికలకూ జగన్ ప్రచారానికి పోలేదు. ఇదే తరహాలో బద్వేలు ఉప ఎన్నికల ప్రచారానికి జగన్ దూరంగా ఉండనున్నారని తెలిసింది.

మంత్రులకే బాధ్యతలు….

బద్వేలు నియోజకవర్గంలో టీడీపీ చివరి గెలుపు 2001 ఉప ఎన్నికలోనే. 2004 నుంచి వరసగా జరిగిన నాలుగు ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్, వైసీపీ గెలుస్తూ వస్తున్నాయి. రిజర్వడ్ నియోజకవర్గం అయిన తర్వాత టీడీపీ ఇక్కడ గెలవలేదు. దీంతో జగన్ ఈ ఉప ఎన్నికను లైట్ గానే తీసుకోనున్నారు. ప్రచారానికి దూరంగా ఉండనున్నారు. మండలాల వారీగా మంత్రులకు బాధ్యతలను త్వరలో జగన్ అప్పగించనున్నారు. భారీ మెజారిటీ రావాలని జగన్ నేతలకు లక్ష్యాన్ని నిర్దేశించనున్నారు.

Tags:    

Similar News