Ys jagan : జగన్ దెబ్బకు స్క్రీన్ చిరిగిపోయిందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కొక్కటికీ తన అడ్డంకులను నరుక్కుంటూ వస్తున్నారు. ముందుగా విపక్ష నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీయడంలో చాలా వరకూ సక్సెస్ అయ్యారు. దీంతోనే [more]

Update: 2021-09-21 06:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కొక్కటికీ తన అడ్డంకులను నరుక్కుంటూ వస్తున్నారు. ముందుగా విపక్ష నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీయడంలో చాలా వరకూ సక్సెస్ అయ్యారు. దీంతోనే చంద్రబాబుకు భయం పట్టుకుంది. ఇక ఏపీలో సినీ గ్లామర్ ఎక్కువగా ఉంటుంది. సినీ హీరోల అభిమానులు సంఖ్య కూడా ఎక్కువే. ఎక్కువగా యువత సినీ హీరోల పట్ల ఆరాధనాభావంతో వ్యవహరిస్తుంటారు. వైసీపీకి తొలి నుంచి సినీ గ్లామర్ తక్కువే.

ఏనాడూ టాలీవుడ్….

జగన్ అధికారంలోకి వస్తారన్న నమ్మకం లేకపోవడంతో సినీ పరిశమ్ర ఏనాడు జగన్ కు అండగా నిలవలేదు. చిన్నా చితకా ఆర్టిస్ట్ లు తప్ప పెద్ద హీరోలు ఎవరూ మద్దతు తెలపలేదు. భవిష్యత్ లో వారు తనకు అండగా ఉంటారన్న నమ్మకం కూడా జగన్ కు లేదు. సినీ పరిశ్రమలో ఎక్కువ భాగం టీడీపీ వైపు ఉంది. ఇప్పుడు జనసేన పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ కు కూడా సినీ పరిశ్రమలో కొందరు మద్దతు ఇచ్చే అవకాశముంది. జగన్ వెంట ఎట్టిపరిస్థితుల్లో సినీ పరిశ్రమ వెంట నడిచే ప్రసక్తి లేదు.

పారదర్శకత కోసమే….

సినీ పరిశ్రమకు ఎన్ని రాయితీలు ఇచ్చినా జగన్ కు రాజకీయంగా ప్రయోజనం లేదు. అందుకే జగన్ సినీ టిక్కెట్ల వ్యవహారాన్ని తెరమీదకు తెచ్చారు. పారదర్శకత కోసం ఆన్ లైన్ లో సినిమా టిక్కెట్లను ప్రభుత్వమే నిర్వహిస్తుందన్న ప్రభుత్వం నిర్ణయంతో టాలీవుడ్ లో వణుకు మొదలయింది. నిజానికి సినీ పరిశ్రమలో వైట్ మనీ కంటే ఎక్కువగా బ్లాక్ మనీ ఫ్లోట్ అవుతుంది. హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్ నుంచి నిర్మాతల లాభాల వరకూ అంతా గోప్యమే. పారదర్శకత ఉండదు. దీనికి తోడు ప్రేక్షకులకు ఉపయోగం కూడా ఏమీలేదు. అత్యధిక ధరలకు టిక్కెట్లను విక్రయించుకుని సొమ్ము చేసుకోవడం అలవాటుగా మారిపోయింది.

ముద్రగడ వంటి వారు….

దీనికి చెక్ పెట్టేందుకు జగన్ తీసుకున్న నిర్ణయం వెనక కూడా కొన్ని పార్టీలకు ఆర్థికంగా అండగా ఉంటున్న సినీ పెద్దల ఆర్థికమూలాలను దెబ్బతీయడమే. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. జగన్ నిర్ణయాన్ని చూసి మెగాస్టార్ చిరంజీవి వంటి వారు కూడా దిగివచ్చి జగన్ ను అభ్యర్థించుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో సినీ పరిశ్రమకు ఏమాత్రం సంబంధం లేని ముద్రగడ పద్మనాభం వంటి వారు కూడా హీరో, హీరోయిన్ల ఖర్చులు, రెమ్యునరేషన్లు ఆన్ లైన్ ద్వారా ప్రభుత్వానికి జమ చేయాలని కోరడం విశేషం. మొత్తం మీద జగన్ సినీ పెద్దలను కట్టడి చేయకపోయినా జనాల్లో మాత్రం సినీ పరిశ్రమతో ప్రజలకు జరిగే నష్టాన్ని మాత్రం తీసుకెళ్లగలిగారు.

Tags:    

Similar News