ys jagan : మరోసారి పీకే అవసరం జగన్ కు ఎందుకు?

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు జనాలకు నచ్చకపోవచ్చు. ప్రత్యామ్నాయం కోరుకోవచ్చు. పది శాతం మంది ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకున్నారంటే అధికారం కోల్పోవడం పెద్ద విషయమేమీ [more]

Update: 2021-09-17 06:30 GMT

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు జనాలకు నచ్చకపోవచ్చు. ప్రత్యామ్నాయం కోరుకోవచ్చు. పది శాతం మంది ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకున్నారంటే అధికారం కోల్పోవడం పెద్ద విషయమేమీ కాదు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను వేధిస్తున్న సమస్య ఇదే. గత ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ ఓటింగ్ శాతం తీసుకుంటే కేవలం పదిశాతం మాత్రమే తేడా ఉంది. దీంతో జగన్ వచ్చే ఎన్నికలను తేలిగ్గా తీసుకునేందుకు సిద్ధంగా లేరు.

సంక్షేమ పథకాలతో…?

నిన్న మొన్నటి వరకూ జగన్ తన సంక్షేమ పథకాలు తనకు శ్రీరామరక్ష అని భావించారు. దాదాపు మూడు లక్షల కుటుంబాలకు నేరుగా లబ్ది చేకూర్చారు. ఈ కుటుంబాలన్నీ వన్ సైడ్ గా వైసీపీకి మద్దతు తెలిపితే జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ అందరూ అండగా నిలబడతారా? లేదా? వచ్చే ఎన్నికల్లో సంక్షేమ పథకాలే తనను గట్టెక్కిస్తాయా? లేక ప్రత్యామ్నాయం కోరుకుంటే? అన్న సందేహాలు జగన్ ను వెంటాడుతున్నట్లున్నాయి.

రిస్క్ చేయకూడదనేనా?

అందుకే జగన్ ఈసారి ఎన్నికల్లో కూడా రిస్క్ చేయదలచుకోలేదు. ప్రశాంత్ కిషోర్ ను మళ్లీ నమ్ముకోవాలని జగన్ డిసైడ్ అయ్యారు. గత ఎన్నికల్లో చంద్రబాబుపై వ్యతిరేకత తనకు అనుకూలంగా మారింది. ప్రశాంత్ కిషోర్ సలహాలు, సర్వేలు పార్టీని ఒడ్డెక్కించాయి. కానీ ఇంతా చూస్తే రెండు పార్టీల మధ్య ఉన్న ఓట్ల తేడా పదిశాతం మాత్రమే. 151 నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచి 49.9 శాతం ఓట్లను సాధించుకుంది.

పదిశాతం మాత్రమే…?

అదే తెలుగుదేశం పార్టీ 23 స్థానాల్లోనే గెలిచి 39.2 శాతం ఓట్ల షేర్ ను సొంతం చేసుకుంది. ఇక జనసేన సయితం 6.78 శాతం ఓట్లను సాధించింది. ఈ లెక్కన చూసుకుంటే తన సంక్షేమ పథకాలు, తన పాలన జనాలను మెప్పిస్తుందని జగన్ అనుకోవడం లేదు. అందుకే ప్రశాంత్ కిషోర్ ను వ్యూహకర్తగా రంగంలోకి దించుతున్నారు. ఆయన టీం సేవలను జగన్ ఉపయోగించుకుంటున్నారు. రిస్క్ ఎందుకనేమో…? మరోసారి పీకే ప్లాన్ తో పీఠాన్ని దక్కించుకోవచ్చన్న ఆలోచనతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుంది.

Tags:    

Similar News