జగన్ బెయిల్ రద్దు కాకూడదు దేవుడా… ?

జగన్ బెయిల్ రద్దు అవుతుందా లేదా అన్నది తెలియడానికి ఆగస్ట్ 25 వరకూ అంతా ఎదురుచూడాల్సిందే. ఆ రోజున సీబీఐ  కోర్టు  తీర్పు వెలువడనుంది. సరే ఈ [more]

Update: 2021-07-31 06:30 GMT

జగన్ బెయిల్ రద్దు అవుతుందా లేదా అన్నది తెలియడానికి ఆగస్ట్ 25 వరకూ అంతా ఎదురుచూడాల్సిందే. ఆ రోజున సీబీఐ కోర్టు తీర్పు వెలువడనుంది. సరే ఈ విషయంలో అధికార వైసీపీ ఫుల్ టెన్షన్ తో ఉంటుంది అన్నది తెలిసిందే. ఎందుకంటే జగన్ కర్త, కర్మ, క్రియగా ఉన్న వైసీపీ బెయిల్ రద్దు కాకూడదు అంటూ వేయి దేవుళ్లకు మొక్కుకుంటోంది. అలా జరగదులే అన్న ధీమా కూడా ఎక్కడో ఉండి కూడా ఉంటుంది. సరే తీర్పు ఎలా వచ్చినా దానిని స్వీకరించాల్సినది, ఆ భారాన్ని మోయాల్సినది వైసీపీనే. కానీ చిత్రంగా వైసీపీకి పూర్తిగా వ్యతిరేకించే టీడీపీ క్యాడర్ కూడా జగన్ బెయిల్ రద్దు కాకూడదు మహా ప్రభో అంటోందిట. మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఇక్కడే ఉంది మతలబు అంటున్నారు.

తమ్ముళ్ల లాజిక్…

సోషల్ మీడియా వేదికగా దీని మీద టీడీపీ తమ్ముళ్లు ఒక్క లెక్కన నినదిస్తున్నారు. జగన్ బెయిల్ రద్దు కాకూడదు, ఆయన పూర్తి కాలం ఏపీకి సీఎం గా ఉండాలని వారు గట్టిగా కోరుకుంటున్నారు. ఇప్పటికే ఇంటర్వెల్ దాకా వచ్చిన వైసీపీ సినిమా క్లైమాక్స్ లో ఎన్నో ట్విస్టులు ఉంటాయి. జగన్ వాటిని చూడాలి, జనాలకు కూడా జగన్ పాలన మీద భ్రమలు తొలగాలి అంటే ఆయనే సీఎం గా ఉంటూ 2024 ఎన్నికలకు వెళ్లాలని కోరుకుంటున్నారుట. ఏపీ అప్పుల పాలు అయిందని, అభివృద్ధి అన్నదే లేదని, ఈ రోజున అన్ని రకాలైన సమస్యలు పొంచి ఉన్నాయని సోషల్ మీడియాలో తమ్ముళ్ళు బాగానే విశ్లేషిస్తున్నారు. ఈ నేపధ్యంలో బెయిల్ రద్దు అయి జగన్ జైలుకు వెళ్తే వైసీపీ నెత్తిన పాలు పోసినట్లే అని కూడా వారు లాజిక్ పాయింటే తీస్తున్నారు.

అలా కాకూడదనే ….?

పొరపాటున బెయిల్ రద్దు అయి జగన్ జైలు కి వెళ్తే టీడీపీకి ఉన్న ఒక్క ఛాన్స్ అధికారం కూడా పోయినట్లేనని కూడా వారు అంటున్నారు. ఒక విధంగా ఇదే నిజం కూడా. జగన్ జైలు కి వెళ్తే ఏపీలో రాజకీయ సంక్షోభం వస్తుంది. గట్టిగా ఆరు నెలలు తిరగకుండానే సర్కార్ కుప్ప కూలుతుంది. ఆ తరువాత మళ్లీ జగన్ నే జనాలు ఎన్నుకుంటారు. కుట్ర పన్ని జగన్ని జైలుకి పంపారన్న సానుభూతి వెల్లువలా వ్యాపిస్తుంది. గతంలో జగన్ జైలుకు వెళ్ళబట్టే విపరీతమైన సింపతీ వచ్చింది. ఆ విషయం తెలుసు కనుకనే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వంటి వారు జగన్ బెయిల్ రద్దు పోరాటం ఎందుకు రాజు గారూ అని రఘురామ మీద చిరాకు పడ్డారు. మరి తమ్ముళ్ల లాజిక్ టీడీపీ పెద్దలకు తెలియదా, వారు నిజంగనే జగన్ జైలుకు వెళ్ళాలని కోరుకుంటున్నారా అన్నదే అర్ధం కాని విషయం.

టెన్షన్ లోనేనా …?

ఇక వైసీపీ విషయానికి వస్తే ఆ పార్టీ పూర్తి టెన్షన్ లో ఉందా అన్న చర్చ వస్తోంది. జగన్ వన్ టూ టెన్ గా పార్టీలో ఉన్నారు. ఆయన కనుక బెయిల్ రద్దు తో జైలు కి వెళ్తే భార్య భారతిని పెట్టినా కూడా ప్రభుత్వం నిలబడదు, దానికి మించి పాలన కూడా ఇప్పటికే ఇబ్బందులలో ఉంది. ఆర్ధికపరమైన ఇక్కట్లను చక్కబెట్టడం కూడా ఎవరి వల్లా కాదు, జగన్ సీఎం గా ఉంటే ఏదో రకంగా నడుపుకుని రావచ్చు. ఇక గట్టిగా రెండేళ్ళ పాలన పూర్తి చేసుకున్న ఎమ్మెల్యేలు అయితే మళ్ళీ ఎన్నికలకు రెడీ అవడానికి వెనకంజ వేస్తారు. దాంతో ఎలా చూసుకున్నా జగన్ బెయిల్ రద్దు కావద్దు అన్నదే వైసీపీలో మాట. కానీ రాజకీయంగా చూస్తే బెయిల్ రద్దు అన్నది వైసీపీకి ఉపయోగపడేదే అంటున్నారు రాజకీయ మేధావులు.

Tags:    

Similar News