ఉత్తరాంధ్రలో ఆ మంత్రులకు జగన్ షాక్ ఇస్తారా..?

కేబినెట్‌లో మార్పులు చేయడానికి సమయం దగ్గర పడుతుంది. మరో నాలుగు నెలల్లో జగన్, తన కేబినెట్‌లో మార్పులు చేయడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే పలువురు [more]

Update: 2021-09-07 00:30 GMT

కేబినెట్‌లో మార్పులు చేయడానికి సమయం దగ్గర పడుతుంది. మరో నాలుగు నెలల్లో జగన్, తన కేబినెట్‌లో మార్పులు చేయడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే పలువురు మంత్రులకు ఉద్వాసన పలికి కొత్తవారికి జగన్ అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. అయితే తమ పదవులని కాపాడుకోవాలని ఇప్పుడు కేబినెట్‌లో ఉన్న మంత్రులు బాగానే ప్రయత్నిస్తున్నారు. కరోనా నేపథ్యంలో సరిగ్గా పనిచేయడమే కుదరలేదు కాబట్టి, జగన్ కనికరిస్తారని భావిస్తున్నారు. కానీ వాస్తవ పరిస్తితులని చూస్తే అలా కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న కేబినెట్‌లో సగంపైనే మంత్రులకు జగన్ షాక్ ఇస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రలో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రుల్లో ఎవరికి షాక్ తగులుతుందో అనే అంశం ఆసక్తికరంగా మారింది.

ఐదుగురు మంత్రులు…

ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ఐదుగురు మంత్రులు ఉన్నారు. విశాఖలో… అవంతి శ్రీనివాస్, విజయనగరంలో.. బొత్స సత్యనారాయణ, పుష్పశ్రీ వాణి, శ్రీకాకుళంలో…ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజులు జగన్ కేబినెట్‌లో ఉన్నారు. అయితే వీరిలో సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ పదవీకాలం ఐదేళ్లు కొనసాగడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక తొలిసారి మంత్రి పదవులు పొందిన నలుగురులో ఎవరికి చెక్ పెడుతుందో చెప్పలేమని అంటున్నారు. పర్యాటక శాఖ మంత్రిగా అవంతి శ్రీనివాస్, గొప్ప పనితీరు ఏమి కనబర్చలేదని, కానీ ఈయనకు విజయసాయిరెడ్డి సపోర్ట్ ఉంద‌ని అంటున్నారు. అయితే జిల్లాలో ఈ సారి అవంతిని మార్చి గుడివాడ అమ‌ర్‌నాథ్‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తార‌న్న చ‌ర్చలు బ‌లంగా వినిపిస్తున్నాయి. జ‌గ‌న్ చూపంతా అమ‌ర్‌నాథ్ వైపే ఉండ‌డం ఆయ‌న‌కు ప్లస్ కానుంది.

పనితీరు సరిగా లేక….

అటు పుష్పశ్రీవాణి కూడా మంచి పనితీరు కనబర్చలేదు. వ్యక్తిగత కారణాల వల్ల ఆమె యాక్టివ్‌గా ఉండలేకపోయారు. ఇక ఈమె విషయంలో డౌటే అని అంటున్నారు. ఎస్టీ కోటాలో మంత్రి + ఉప ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీవాణిని త‌ప్పించే విష‌యంలో ఎవ్వరికి ఎలాంటి సందేహాలు లేవ‌నే అంటున్నారు. ఇక ధర్మాన కృష్ణదాస్‌ని తప్పించి…ఆయన సోదరుడు, సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావుకు పదవి ఇవ్వొచ్చని చెబుతున్నారు. శాఖా ప‌రంగా ఆయ‌న‌కు పెద్ద ప్లస్ పాయింట్స్ లేవు.. ఇక గ‌తేడాదే ఉప ముఖ్యమంత్రి ప్రమోష‌న్ కూడా వ‌చ్చింది.

లాలూచీ పడుతున్నారని…

ఎక్కువ మంది మంత్రుల‌ను త‌ప్పిస్తే కృష్ణ దాస్ ఖ‌చ్చితంగా అవుట్ అవుతారు. ఇక జిల్లా రాజ‌కీయాల్లో కృష్ణదాస్ దూకుడుగా లేక‌పోవ‌డంతో పాటు కుల స‌మీక‌ర‌ణ‌ల్లో టీడీపీ వాళ్లతో లాలూచీ ప‌డుతున్నార‌న్న విమ‌ర్శలు కూడా ఆయ‌న‌కు మైన‌స్ అవుతున్నాయి. అలాగే గతేడాది మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో కేబినెట్‌లోకి వచ్చిన అప్పలరాజు పదవికి ఎలాంటి ఢోకా లేదని అంటున్నారు. అప్ప‌ల‌రాజు దూకుడుగా ఉండ‌డంతో పాటు శాఖ‌లోనూ హ‌డావిడి చేస్తున్నారు. పైగా ఆయ‌న మంత్రి అయ్యి యేడాదే అయ్యింది. ఇక జిల్లా రాజ‌కీయాల్లోనూ ఆయ‌న దూకుడుగా ఉంటున్నారు. మరి ఈ ఈక్వేష‌న్ల‌లో ఉత్తరాంధ్ర మంత్రుల్లో జగన్ ఎవరికి షాక్ ఇస్తారో చూడాలి.

Tags:    

Similar News