ఇంతకీ బీజేపీ దగ్గరా.. దూరమా… ?

బీజేపీ ఒక రాజకీయ పార్టీ. అద్భుతమైన వ్యూహాలు కలిగిన పార్టీ. లేకపోతే రెండే రెండు సీట్లు కలిగిన చోటు నుంచి ఈ రోజున రెండు సార్లు ఫుల్ [more]

Update: 2021-07-15 13:30 GMT

బీజేపీ ఒక రాజకీయ పార్టీ. అద్భుతమైన వ్యూహాలు కలిగిన పార్టీ. లేకపోతే రెండే రెండు సీట్లు కలిగిన చోటు నుంచి ఈ రోజున రెండు సార్లు ఫుల్ మెజారిటీతో కేంద్రంలో గద్దె మీద ఎలా కూర్చోగలదు. దేశంలో రాజకీయం మొత్తం ఔపోసన పట్టేసిన పార్టీ కూడా అది. ఇక ఏపీలో రాజకీయం మీద ఆ పార్టీకి అవగాహన తక్కువగా అనుకుంటే అవతలవారిదే పొరపాటు. ఏపీలో బీజేపీ సొంతంగా ఎదుగూ బొదుగూ లేని స్థితిలో ఉంది. మరో వైపు అధికార వైసీపీ, విపక్ష టీడీపీ కూడా స్నేహం కోసం చేతులు చాస్తున్నాయి.

కోత వేశారుగా…?

జగన్ ఢిల్లీ వెళ్ళి వస్తున్నారు, పెద్దలను కలసి వినతులు చేస్తున్నారు. ఇలా తొలి రెండేళ్లలో పది సార్లు పూర్తి అయింది. మరో మూడేళ్లలో మరిన్ని ఢిల్లీ టూర్లు కూడా ఉన్నాయి. అయితే దీని వల్ల ఏమి ఒరిగింది అంటే పెదవి విరుపే జవాబు అవుతుంది. తాజాగా కేంద్ర పెద్దలను కలసి కనీసం అప్పు చేసుకునే వెసులుబాటు అయినా ఇవ్వండి మహాప్రభో అని వేడుకున్నా కూడా ససేమిరా కుదరదు అంటూ కోత విధించారు. ఏపీ రుణపతిమితిలో భారీ కటింగ్ విధించి జగన్ కి గట్టి షాక్ ఇచ్చేశారు. 43 వేల కోట్ల దాకా రుణ పరిమితిని పెంచమంటే 27 వేల కోట్లకు లెక్కను దించేశారు.

చేతులు కట్టేశారు….

ఏపీ ఖజానా సంగతి అందరికీ తెలుసు. అక్కడ ఏమీ లెదు అని ఢిల్లీ పెద్దలకూ తెలుసు. మరి జగన్ ఈ రెండేళ్ళలో ఏం చేశారు అంటే అప్పులే చేసారు. నాడు టీడీపీ అదే చేసింది. ఇలా రెండు ప్రభుత్వాలు కలసి ఏడేళ్ళ కాలంలో ఏకంగా అప్పులను నాలుగు లక్షల కోట్లకు పెంచేశారు. మరో మూడేళ్ళు జగన్ అప్పులు చేస్తే కచ్చితంగా ఆరు లక్షల కోట్లకు చేరిపోతుంది. ఇప్పటికే ఏపీ దివాళా తీసిందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. మొత్తానికి కేంద్రం రుణ పరిమితిలకు కోత వేయడానికి ఇదొక ప్రధాన కారణం అంటున్నారు.

పొల్టికల్ స్ట్రాటజీ …..

జగన్ సర్కార్ కి చెప్పుకోవడానికి సంక్షేమమే ఉంది. ఈ మధ్యనే ప్రభుత్వ సొమ్ముతో పంచుడేంది అంటూ సోము వీర్రాజు గర్జించారు. కేంద్రానిదీ అదే ఒపీనియన్. జగన్ అలా రాజకీయంగా ఎదిగిపోతూంటే తమకు ఇబ్బంది. అందుకే ఎక్కడ మీట నొక్కాలో అక్కడే నొక్కేశారు. కేంద్రం నిధులు ఇవ్వదు. అప్పులు అయినా చేసుకోనివ్వదు. మరి సర్కార్ బండిని నడిపేది ఎలా. ఇలా జగన్ చక్రబంధంలో ఉంటేనే కదా రాజకీయంగా బ్యాడ్ అయ్యేది. జనాలకు ఈ విషయాలు తెలియవు పధకాలలో కోత వేసినా అవి ఆగినా నెగిటివిటే వచ్చేస్తుంది. అందుకే బీజేపీ ఇలా షాక్ ఇచ్చేసింది అంటున్నారు. మొత్తానికి కేంద్రంతో గుడ్ రిలేషన్స్ జగన్ వైపు నుంచి ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నది మోడీ, అమిత్ షా. అందుకే వారికి జగన్ దగ్గరా కాదు, దూరమూ కాదు. మరి ఏమిటి అంటే జవాబు ఉండదంతే.

Tags:    

Similar News