ఢిల్లీ సైలెన్స్ అందుకేనటగా

వైఎస్ జగన్ ని ఇపుడు ఢిల్లీ కూడా ఏమీ చేయలేదా? ఆ విధంగా జగన్ ముందుగానే వారికి అన్నీ చెప్పి ఉంచారా? అందుకే ఢిల్లీ ఉలకకుండా పలకకుండా [more]

Update: 2020-01-18 02:00 GMT

వైఎస్ జగన్ ని ఇపుడు ఢిల్లీ కూడా ఏమీ చేయలేదా? ఆ విధంగా జగన్ ముందుగానే వారికి అన్నీ చెప్పి ఉంచారా? అందుకే ఢిల్లీ ఉలకకుండా పలకకుండా ఉందా అన్న ధర్మ సందేహాలు ఏపీ ప్రతిపక్షాల్లో కలుగుతున్నాయి. నిత్యం మోడీని తిట్టడమే కాదు, పెద్ద నోట్లు రద్దు చేసిన సమయంలో మోడీని వంద సార్లు కాల్చి చంపాలంటూ దారుణమైన భాషను ఉపయోగించిన సీపీఐ నారాయణ సైతం మోడీ శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతి అంటూ సెంటిమెంట్ రంగరించారు. మోడీ జోక్యం చేసుకుంటేనే తప్ప మూడు రాజధానుల కధకు బ్రేక్ పడదని నారాయణ సైతం గట్టిగా అభిప్రాయపడ్డారు. మరో వైపు బీజేపీ కొత్త ఎంపీ సుజనా చౌదరి సైతం కేంద్రం చూస్తూ ఊరుకోదు, అమరావతి అంగుళం కదల్చినా యుధ్ధాలైపోతాయని హూంకరించారు. ఇక చంద్రబాబు అయితే ఏ నోటితో మోడీని పరుషంగా తిట్టారో అదే నోటితో మోడీ శ్రీకారం చుట్టిన రాజధాని అని ఆయనను ముగ్గులోకి లాగడానికి చూశారు. పవన్ సంగతి సరేసరి, కేంద్రమే జోక్యం చేసుకుని అఖిలపక్షం వేయాలన్నారు. మొత్తానికి ఏమవుతోంది… కేంద్రం చూస్తూ ఊరుకుంటోందనిపించేలా సీన్ ఉంది.

భేఖాతర్….

ఇది చాలా తెలివైన ఎత్తుగడ, ఇంకా చెప్పాలంటే పలాయన వాదం కూడా. విభజన తరువాత ఏ ఒక్క హామీ ఏపీకి నెరవేర్చని బీజేపీ ఇపుడు బాధ్యత ఎందుకు తీసుకుంటుంది, డిమాండ్ చేసిన వారి వెర్రితనం కాకపోతేనూ, ఎన్ని జిల్లాలు ఉండాలో, ఎన్ని రాజధానులు ఉండాలో రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. ఇది అక్షరాలా రాష్ట్రాల జాబితాలోని అంశం. ప్రత్యకంగా జోక్యం చేసుకోవాలని కేంద్రం అనుకుంటే ప్రత్యేక దృష్టి కూడా ఇక్కడ పెట్టాలి. నిధులు కూడా అలాగే ఇవ్వాలి. ఇప్పటికే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు కూడా. బీజేపీకి అమరావతి రాజధాని కావాలంటే లక్ష కోట్లు నిధులు ఇస్తే అక్కడే కడతామని. ఆ సవాల్ వస్తుందని ముందే ఊహించిన బీజేపీ కేంద్ర పెద్దలు మౌనంగా ఉన్నారు. జగన్ సంగతి కూడా తెలుసు. అందుకే నో కామెంట్స్ అన్నట్లుగా ఉండిపోతున్నారు.

జగన్ చెప్పే ఉంచారా…?

ఇక జగన్ విషయం తీసుకుంటే ఆయన తొలి నుంచి పోలవరం, అమరావతి మీద ప్రత్యేక దృష్టితో ఉన్నారు. అక్కడ భారీ ఎత్తున అవినీతి జరిగిందని జగన్ బలమైన భావన. ఇవన్నీ ఆయన ఢిల్లీ పెద్దలను కలసిన మొదట్లోనే వివరించారు. తాను ఏం చేయదలచుకున్నదీ ఇప్పటికే చెప్పిఉంటారని కూడా అంతా భావిస్తున్నారు. ఇక జగన్ విషయం, ఆయన మొండితనం బీజేపీ పెద్దలు విద్యుత్ ప్రైవేట్ ఒప్పందాల సమీక్ష విషయంలో చూశారు. అందువల్ల తగ్గమంటే జగన్ తగ్గరు, సో జగన్ ఎలా అనుకుంటే అలా కానీయమనే ధోరణితోనే బీజేపీ పెద్దలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

విఫలమవుతారా?

బీజేపీ నాయకుల అంతర్గత సంభాషణల్లో చూసుకుంటే జగన్ మూడు రాజధానుల విషయంలో చేసిన ప్రయోగం విఫలం ఆవుతుందని చర్చకు వస్తోందట. జగన్ ఈ మూడు భారాలను మోయలేక చేతులెత్తేస్తారని, పాలన సైతం ఇంకా అద్వాన్నంగా సాగుతుందని, మరిన్ని ఉప ప్రాంతీయ ఉద్యమాలు కూడా పుట్టే అవకాశాలు ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారుట. సరైన సమయం చూసి అపుడు ఏపీ మీద దృష్టి పెడితే రాజకీయంగా ప్రయోజనంగా ఉంటుందన్నది కేంద్ర పెద్దల వ్యూహంగా ఉందిట. అందుకే జగన్ విషయంలో గో ఎహెడ్ అన్నట్లుగా సైలెంట్ గా కేంద్రం ఉండిపోతోందని ఢిల్లీ సమాచారం. మొత్తానికి ఇపుడు మాత్రం ఏపీలోని విపక్షానికి కేంద్రం గట్టి హ్యాండ్ ఇచ్చేసిందనే ప్రచారం సాగుతోంది.

Tags:    

Similar News