అంగుళం కూడా వెనక్కు తగ్గడట

రాష్ట్రంలో అధికార వికేంద్రీక‌ర‌ణ కోసం అడుగులు వేస్తున్న వైసీపీ ఈ అడుగుల వేగాన్ని మ‌రింత పెంచింది. రాష్ట్రంలో మూడు రాజ‌ధానుల ప్రతిపాద‌న‌ను అసెంబ్లీలో ప్రక‌టించిన వైసీపీ అధినేత, [more]

Update: 2020-01-17 02:00 GMT

రాష్ట్రంలో అధికార వికేంద్రీక‌ర‌ణ కోసం అడుగులు వేస్తున్న వైసీపీ ఈ అడుగుల వేగాన్ని మ‌రింత పెంచింది. రాష్ట్రంలో మూడు రాజ‌ధానుల ప్రతిపాద‌న‌ను అసెంబ్లీలో ప్రక‌టించిన వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ ఇప్పుడు త‌న వ్యూహాన్ని మ‌రింత‌గా ప‌దును తేర్చారా ? అంటే .. తాజాగా సోమ‌వారం జ‌రిగిన ప‌రిణామాలు ఔన‌నే అంటున్నాయి. ఒక‌ ప‌క్క సీఎం హైద‌రాబాద్ ప‌ర్యట‌న‌, మ‌రోప‌క్క హైప‌వ‌ర్ క‌మిటీ మూడోసారి భేటీ అయి ప‌రిస్థితుల‌పై చ‌ర్చించ‌డం చూస్తే మూడు రాజ‌ధానుల ఏర్పాటు విష‌యంలో జ‌గ‌న్ ఒక్క అంగుళం కూడా వెన‌క్కి త‌గ్గే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

రైతులకు ప్రత్యేకంగా….

రాజ‌ధాని విష‌యంలో ఆదిలో వ‌చ్చిన డిమాండ్‌పై తాజాగా హైప‌వ‌ర్ క‌మిటీ చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. రైతులు న‌ష్టపోతార‌నే వాద‌న వ‌చ్చిన స‌మ‌యంలో వారికి అన్యాయం చేయ‌మ‌ని ప్రక‌టించిన మంత్రులు ఇప్పుడు ఆదిశ‌గా మ‌రింత క్లారిటీ ఇచ్చారు. గ‌తంలో రైతుల నుంచి అప్పటి ప్రభుత్వం తీసుకున్న భూముల‌కు ప్రతిగా ఇస్తామ‌న్న డెవ‌ల‌ప్డ్ ల్యాండ్‌ల విస్తీర్ణాన్ని మ‌రింత‌గా పెంచాల‌ని నిర్ణయించిన‌ట్టు తెలిసింది. దీనిని మ‌రో 200 గ‌జాల‌కు పెంచుతూ హైప‌వ‌ర్ క‌మిటీ సిఫార‌సు చేసిన‌ట్టు స‌మాచారం.

ఉద్యోగుల కోసం కూడా….

అదే స‌మ‌యంలో కౌలును మ‌రింత పెంచేందుకు కూడా క‌మిటీ సిఫారసు చేసింది. ఇది రైతుల‌కు ఎంతో మేలు చేస్తుంద‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో అమ‌రావ‌తిని పూర్తిగా త‌ర‌లించే ప్రతిపాదన కూడా లేద‌ని పేర్కొంటోంది. ఇక‌, రాజ‌ధానిలో మ‌రో కీల‌క విష‌యం ఉద్యోగుల త‌ర‌లింపు. ఈ విష‌యంలోనూ హైప‌వ‌ర్ క‌మిటీ కీల‌క నిర్ణయాలు తీసుకుంది. విశాఖ‌కు త‌ర‌లివ‌చ్చే ఉద్యోగుల‌పై వ‌రాల జ‌ల్లు కురిపించాల‌ని ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. రాజ‌ధాని త‌ర‌లింపున‌కు ముందుగానే విశాఖ‌లో ఉద్యోగుల‌కు స్థలాలు ఇళ్లు కేటాయించాల‌ని నిర్ణయించారు.

అన్నింటా స్పష్టతతో…

అదే స‌మ‌యంలో 30శాతం హెచ్చార్సీ, వారానికి ఐదు రోజుల ప‌నిదినాలు స‌హా లోన్లు ఇప్పించే బాధ్యత‌ను ప్రభుత్వం తీసుకునేలా సిఫార‌సులు చేసిన‌ట్టు తెలిసింది. ఇదిలావుంటే, మ‌రోప‌క్క, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మూడు రాజ‌ధానుల విష‌యంపై స్వయంగా సీఎం చ‌ర్చించార‌ని స‌మాచారం. దీనికి ఆ రాష్ట్ర సీఎం మ‌ద్దతును కూడా కూడ‌గ‌ట్టారని తెలుస్తోంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఇక‌, వైసీపీ స‌మ‌రోత్సాహంతో ముందుకు సాగుతుంద‌నే అంశానికి మ‌రింత బ‌లం చేకూరిన‌ట్టయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి, ఈ ప‌రిణామాల‌ను ఎదుర్కొని అమ‌రావ‌తిని నిల‌బెట్టుకోవ‌డం అనేది టీడీపీకి మిలియ‌న్ డాల‌ర్ల స‌మ‌స్యేన‌ని చెబుతున్నారు.

Tags:    

Similar News