అక్కడే జగన్ కు అతి పెద్ద సమస్య

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తన మంత్రివర్గాన్ని త్వరలో విస్తరించబోతున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తులు కూడా ఆయన ప్రారంభించారు. రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని [more]

Update: 2021-06-12 00:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తన మంత్రివర్గాన్ని త్వరలో విస్తరించబోతున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తులు కూడా ఆయన ప్రారంభించారు. రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని జగన్ గతంలోనే చెప్పారు. ఇప్పటికే రెండేళ్లు గడిచిపోవవడంతో, మరో ఆరు నెలల్లో మంత్రివర్గాన్ని సమూలంగా మార్చి వేయాలన్నది జగన్ ఆలోచనగా ఉంది. ఈ మేరకు జిల్లాల వారీగా ఆయన కసరత్తులు ప్రారంభించినట్లు చెబుతున్నారు.

మంత్రివర్గంలో….?

అన్ని జిల్లాల మాట సంగతి అటు ఉంచితే ఇప్పుడు జగన్ కు చిత్తూరు జిల్లా పెద్ద సమస్యగా ఏర్పడింది. ఇక్కడి నుంచి మంత్రి పదవులు దక్కించుకునే వారెవ్వరన్నది చర్చనీయాంశమైంది. చిత్తూరు జిల్లాలో ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి మంత్రులుగా ఉన్నారు. నారాయణ స్వామిని ఈ దఫా తప్పించడం ఖాయం. ఆయన స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన వారిని మంత్రిగా ఎంపిక చేయాల్సి ఉంటుంది.

పెద్దిరెడ్డిని తప్పించడం….?

ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మంత్రి వర్గం నుంచి తప్పించడం అంత సులువు కాదు. వైసీపీకే కాకుండా జగన్ కు అత్యంత సన్నిహితుడిగి ముద్రపడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించలేరు. ఆయన ఐదేళ్ల పాటు మంత్రిగా కొనసాగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో కీలక నేతలకు జగన్ మలి విడత మంత్రివర్గంలోనూ స్థానం దక్కే అవకాశాలు కన్పించడం లేదు.

ముగ్గురూ ఒకే …?

చిత్తూరు జిల్లాలో సీనియర్ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి నేతలున్నారు. వీరిలో భూమన ఇదే తన చివరి ఎన్నికలని ప్రకటించేశారు. దీంతో ఆయనకు మంత్రి పదవి దక్కుతుందా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది. ఇక ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు జగన్ మంత్రి పదవి ఇవ్వకపోయినా నామినేటెడ్ పదవులు ఇచ్చారు. వీరంతా ఒకే సామాజికవర్గం కావడంతో జగన్ కు ఎంపిక ఇబ్బందికరంగా మారిందంటున్నారు. మరి చిత్తూరు జిల్లా విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారన్నది పార్టీలోనూ ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News