జగన్ ని కోరి తిట్టిస్తున్నారా…?

నోరా వీపుకు చేటు అన్న సామెత ఒకటి ఉంది. రాజకీయ నాయకులు వీటిని గుర్తుపెట్టుకుని మరీ నోటికి పని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే తాము అన్న ఒక్కో [more]

Update: 2021-05-17 02:00 GMT

నోరా వీపుకు చేటు అన్న సామెత ఒకటి ఉంది. రాజకీయ నాయకులు వీటిని గుర్తుపెట్టుకుని మరీ నోటికి పని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే తాము అన్న ఒక్కో మాట తిరిగి రివర్స్ గేర్ లో తమకే తగులుతుంది అని కూడా వారు ఆలోచించాలి. ఇదిలా ఉంటే కొందరు నాయకులు వైసీపీలో తరచుగా వాగాడంబరం ప్రదర్శిస్తూంటారు. వారి వల్ల పార్టీకి జగన్ కి ఎంత మేలో తెలియదు కానీ ఆ రాళ్ళన్నీ తిరిగి జాగ్రత్తగా వచ్చి జ‌గన్ కే తగులుకుంటున్నాయి. ఆ సంగతి మరచిపోయి నేతలు నేల విడిచి చేస్తున్న సాము వల్లనే వైసీపీలో జగన్ ఇబ్బందులు పడుతున్నాడు అన్న మాట కూడా ఉంది.

ఆవేశంలో అలా..?

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ పిట్టగా మోత ఒక్క లెక్కన మోగిస్తారు. ఆయన ట్విట్టర్ లో ఎపుడూ లోకేష్, చంద్రబాబుల మీదనే సెటైర్లు వేస్తారు ఆయన ఈ మద్యన తరచుగా లోకేష్ చదువు ఏంటి అంటూ ప్రశ్నలు సంధిస్తూ వస్తున్నారు. లోకేష్ డిగ్రీల గురించి కూడా నిలదీస్తున్నారు. లోకేష్ చదువు ఏమో కానీ ఇపుడు జగన్ మీద వరసగా బాణాలు పడిపోతున్నాయి. మా నాయకుడి సంగతి సరే కానీ మీ అధినేత ఏం చదివారో కాస్తా చెప్పరూ సాయిరెడ్డి గారూ అంటూ టీడీపీ నేత వర్ల రామయ్య గట్టిగానే తగులుకుంటున్నారు.

జగనే టార్గెట్….

ఇక వైసీపీ రెబెల్ ఎంపీ ఈ మధ్య రచ్చబండ సందర్భంగా ఒక్క మాట చెప్పుకొచ్చారు. నన్ను ప్రతీ రోజూ కొందరు నాయకులు విమర్శిస్తున్నారు. నానా మాటలు అంటున్నారు. వారెవరికీ నేను బదులు చెప్పను, వారు నన్ను ఎన్ని మాటలు అంటే అంతకు రెట్టింపుగా నేను జగన్ని అంటాను, అంతే కాదు నా యాక్షన్ కూడా జగన్ మీదనే ఉంటుంది అంటూ హెచ్చరించారు. జగన్ వారిని అదుపులో పెట్టుకోకపోతే చివరికి ఇబ్బందులు ఆయనే పడతారు అంటూ కూడా రాజు చెప్పేశారు. రాజు అన్నాడని కాదు కానీ ఏ పార్టీ నేత ఎంత గట్టిగా మాట్లాడినా చివరికి అవి అధినేతలే చుట్టుకుంటాయన్నది వాస్తవం.

పట్టించుకోరా ..?

వైసీపీలో చాలా మంది మాటల రాయుళ్ళు ఉన్నారు. సందర్భం లేకుండా కూడా వారు విమర్శలు చేస్తారు. దీని వల్ల తటస్థ ఓటర్ల మద్దతు పార్టీ కోల్పోతోంది అన్న అంచనా కూడా ఉంది. దాని మీద ఎందుకో జగన్ దృష్టి పెట్టడం లేదు అంటున్నారు. జగన్ తన పనిలో తాను బిజీగా ఉంటున్నారు. ఆయన పల్లెత్తు మాట అనరు, మీడియా మైకుల వైపు కూడా చూడరు. ఆయన లాగానే ఆయన ట్విట్టర్ కూడా చాలా సైలెంట్ గా ఉంటుంది. మరి పార్టీ లైన్ లో నిర్మాణాత్మకమైన విమర్శలు చేయమని నేతలకు జగన్ అధినాయకుడిగా చెబితే బాగుంటుంది అన్నదే పార్టీలో వస్తున్న మాట. లేకపోతే ఎవరో ఏదో అన్న మాటకు జగన్ టార్గెట్ అవుతారు, జనంలో పలుచన కూడా అవుతారు.

Tags:    

Similar News