ఎవ‌రినీ వ‌ద‌ల‌ని జ‌గ‌న‌న్న.. ఏం చేస్తున్నారంటే?

`ఎవ‌రీ వ‌ద‌లం`-ఇది త‌ర‌చుగా వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ చేసే కామెంట్‌. అంటే.. రాజ‌కీయంగా త‌న‌కు శ‌త్రువులుగా ఉన్న వారిని ఎవ‌రినీ వ‌ద‌లను అని చెప్పడంలోనే అంద‌రూ [more]

Update: 2021-05-07 06:30 GMT

'ఎవ‌రీ వ‌ద‌లం'-ఇది త‌ర‌చుగా వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ చేసే కామెంట్‌. అంటే.. రాజ‌కీయంగా త‌న‌కు శ‌త్రువులుగా ఉన్న వారిని ఎవ‌రినీ వ‌ద‌లను అని చెప్పడంలోనే అంద‌రూ మీనింగ్ చూస్తారు.కానీ, నిజానికి.. ఈ ఒక్కటే మీనింగ్ కాదు.. ఈ విష‌యాన్ని వైసీపీ నాయ‌కులు కూడా చెబుతున్నారు. పార్టీ ప‌రంగా.. ప్రజ‌ల ప‌రంగా.. కూడా జ‌గ‌న్‌కు చాలా దూర‌దృష్టి ఉంద‌ని చెబుతున్నారు. ఎవ‌రినీ వ‌ద‌ల‌ను అంటే.. పార్టీ ప‌రంగా .. చిన్నా చిత‌కా.. నేత‌ల‌ను ఎవ‌రినీ వ‌దిలేయ‌న‌ని, అంద‌రినీ.. ఆద‌రంగా చూస్తాన‌ని అర్ధమ‌ని చెబుతున్నారు. ఈ విష‌యమే .. పార్టీని ముందుకు న‌డిపిస్తోంద‌ని అంటున్నారు. అంటే.. పార్టీలో విభేదాలు ఉన్నప్పటికీ.. అంద‌రినీ క‌లుపుకొనిపోతార‌ని అంటున్నారు.

రెండేళ్ల కాలంలో…?

ఇక‌, ప్రజ‌ల ప‌రంగా చూసుకుంటే.. ఇప్పటి వ‌ర‌కు ఈ రెండేళ్ల కాలంలో జ‌గ‌న్‌.. పాల‌న గ‌మ‌నిస్తే.. కేవ‌లం రైతులు, పేద‌లు, మ‌హిళ ‌లు.. వెనుకబ‌డిన ద‌ళిత వ‌ర్గాల‌కు మాత్రమే ప‌రిమిత‌మైన‌ట్టు క‌నిపిస్తోంది. అయితే.. ఎన్నికల నాటికి ఈ ప‌రిస్థితి కొన‌సాగితే.. మ‌ధ్యత‌ర‌గ‌తి వ‌ర్గాల్లోనూ.. అగ్రవ‌ర్ణాల్లోనూ పెద్ద ఎత్తున వ్యతిరేక‌త వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని పార్టీ నేత‌లు భావిస్తున్నారు. కేవ‌లం పాల‌న‌, ప్రభుత్వం ఉన్నది.. పేద‌ల కోస‌మేనా.. మ‌హిళ‌ల కోస‌మేనా.. వెన‌క‌ప‌డిన వ‌ర్గాల‌ కోస‌మేనా? అనే మాట వినిపిస్తోంది. ఈ క్రమంలో అలెర్ట్ అయిన‌.. వైసీపీ అధిష్టానం.. ఈ ప‌రిస్థితి మ‌రింత ముద‌ర‌కుండా చూసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

మధ్యతరగతి ఓటు బ్యాంకు….

అటు అగ్రవ‌ర్ణాల‌ను, మ‌ధ్యత‌ర‌గ‌తి ఓటు బ్యాంకును చెడిపోకుండా చూసుకునేందుకు ఇప్పుడు వారికి కూడా ప్రభుత్వ సంక్షేమ ఫ‌లాలు.. అందించేందుకు జ‌గ‌న్ అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే జ‌గ‌న‌న్న టౌన్ షిప్‌ల‌కు ఆయ‌న శ్రీకారం చుట్టిన‌ట్టు వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో నివసించే మధ్యతరగతి ప్రజల కోసం జగనన్న స్మార్ట్‌ టౌన్ల పేరిట ఎం.ఐ.జి. లేఅవుట్ల ను ఏర్పాటు చేయ‌నున్నారు. ఇది వ‌చ్చే ఏడాది మొద‌ట్లో ప్రారంభించ‌నున్నారు.

లాభనష్టాలు లేకుండా..?

ఈ ప‌థ‌కం కింద‌.. లాభ న‌ష్టాలు లేని విధంగా స్థలాల‌ను మ‌ధ్యత‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు విక్రయించ‌ నున్నారు. దీంతో ఇప్పటి వ‌ర‌కు మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు ప్రభుత్వం దూరంగా ఉంద‌నే భావ‌న‌ను తుడిచి పెట్టేందుకు జ‌గ‌న్ ప్రయ‌త్నిస్తున్నార‌ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. మ‌రి ఇది ఏమేర‌కు వ‌ర్కవుట్ అవుతుందో చూడాలి. జ‌గ‌న్ ప్లాన్ ప్రకారం పేద‌లు, మ‌ధ్యత‌ర‌గ‌తి ప్రజ‌ల ఓట్ల టార్గెట్‌తో పాటు అటు ప‌ట్టణాల్లో ఉన్న ఉన్నత ఆదాయ వ‌ర్గాల వారిని కూడా త‌న వైపునకు తిప్పుకునే కార్యక్రమం కూడా మొద‌లైన‌ట్టే క‌న‌ప‌డుతోంది.

Tags:    

Similar News