అందరూ రెడ్డి బాబులే… ఏం చేయాలో ఏమో?

మంత్రి వర్గ విస్తరణ అంటేనే అందరికీ ఆశలు కలుగుతాయి. తమ అనుభవం, పార్టీతో అనుబంధం వంటివి తమకు మంత్రి పదవి దక్కుతుందన్న ఆశలో అందరూ ఉంటారు. జగన్ [more]

Update: 2021-05-06 12:30 GMT

మంత్రి వర్గ విస్తరణ అంటేనే అందరికీ ఆశలు కలుగుతాయి. తమ అనుభవం, పార్టీతో అనుబంధం వంటివి తమకు మంత్రి పదవి దక్కుతుందన్న ఆశలో అందరూ ఉంటారు. జగన్ ప్రభుత్వం గత ప్రభుత్వాల మాదిరి కాదు. మధ్యలో విస్తరణ వంటి వాటికి అవకాశం కల్పించలేదు. కేవలం పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణల రాజీనామాలు చేయడంతో వారి స్థానంలో అప్పలరాజు, వేణుగోపాలకృష్ణలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అంతకు మించి జగన్ మంత్రి వర్గం జోలికి వెళ్లలేదు.

ఆరోపణలొచ్చినా…?

మంత్రులపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా జగన్ పట్టించుకోలేదు. గుమ్మనూరి జయరాం వంటి వారిపై ఆరోపణలు వచ్చినా లైట్ గానే తీసుకున్నారు. అయితే ఇప్పుడు జగన్ రెండోసారి మంత్రివర్గ విస్తరణ చేయబోతున్నారు. ఇదే ఎన్నికల కాబినెట్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అందుకే ఆశావహులు ఈ మంత్రి వర్గ విస్తరణపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అనేక మంది ఇప్పటికే లాబీయింగ్ మొదలు పెట్టారు.

సీనియర్ నేతలు…..

ఇందులో కర్నూలు జిల్లా నేతలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. గత ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో ఉన్న పథ్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలను, రెండు పార్లమెంటు స్థానాలను వైసీపీ గెలుచుకుంది. టీడీపీని ఇక్కడ జీరో చేసింది. ఇక్కడ ఆర్థిక మంత్రిగా బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, బీసీ సామాజివకర్గం నుంచి గుమ్మనూరి జయరాం జగన్ కేబినెట్ లో ఉన్నారు. ఇందులో ఖచ్చితంగా గుమ్మనూరి జయరాంను తప్పించాల్సి ఉంటుంది.

ఆశావహులు అనేక మంది…..

ఇప్పటికే కర్నూలు జిల్లా నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి తదితర సీనియర్ నేతలు ఉన్నారు. అందరూ రెడ్డి సామాజికవర్గం నేతలే. వీరిలో ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఒకరికి ఇవ్వాలంటే బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డిని జగన్ తప్పించాలి. లేదంటే బుగ్గనను కేబినెట్ లోనే ఉంచి మరో రెడ్డి సామాజికవర్గం నేతకు మంత్రిపదవి ఇవ్వాల్సి ఉంటుంది. మరి జగన్ ఎవరికి అవకాశం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. నేతలు మాత్రం తమ ప్రయత్నాలు తాముచేసుకుంటున్నారు.

Tags:    

Similar News