పట్టించుకోకపోతే… ఇక దిక్కుండదట

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తుంది. అయితే అనేక నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య విభేదాలున్నాయి. దాదాపు ముప్ఫయి నుంచి నలభై నియోజకవర్గాల్లో వైసీపీ [more]

Update: 2021-06-07 00:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తుంది. అయితే అనేక నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య విభేదాలున్నాయి. దాదాపు ముప్ఫయి నుంచి నలభై నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. అయితే జగన్ మాత్రం వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. కేవలం కొన్ని నియోజకవర్గాల్లో తలెత్తిన వివాదాలను మాత్రం దగ్గరుండి జగన్ పరిష్కరిస్తుండటం పార్టీలో చర్చనీయాంశమైంది.

అనేక నియోజకవర్గాల్లో….

అనేక మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు వేలు పెడుతున్నారని అసంతృప్తితో ఉన్నారు. వారు జగన్ ను కలసి చెప్పుకుందామంటే వీలు లేదు. జగన్ ఎమ్మెల్యేలకే అపాయింట్ మెంట్ ఇచ్చి నెలలు కావస్తుంది. కేవలం ఏదైనా పథకం ప్రారంభోత్సవానికి వీడియో కాన్ఫరెన్స్ లు, తాను జిల్లాలకు వెళితే అక్కడ విష్ చేసి రావడం తప్ప జగన్ ప్రత్యేకంగా ఎమ్మెల్యేలతో మాట్లాడిన పరిస్థితి లేదు.

ఎస్సీ నియోజకవర్గాల్లో….

నందికొట్కూరు నియోజకవర్గంలో బైరెడ్డి సిద్దార్థరెడ్డి అక్కడ ఎమ్మెల్యే ఆర్థర్ కు మధ్య పొసగడం లేదు. ఆర్థర్ అయితే రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానంటూ ఆయన బహిరంగంగానే అసహనం వ్కక్తం చేశారు. ఇక కోడూమురు నియోజకవర్గంలోనూ అక్కడ వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ కు, ఇన్ ఛార్జి హర్షవర్థన్ రెడ్డికి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. వీటి పరిష్కారానికి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అప్పగించారు. కానీ ఇంతవరకూ ఈ వివాదం పరిష్కారం కాలేదు.

జమ్మలమడుగులో మాత్రం…..

ఇక చీరాలలోనూ అంతే. కరణంబలరాం, ఆమంచి కృష్ణమోహన్ ల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటుంది. ఈ వివాదాన్ని సజ్జలకు అప్పగించారు. కానీ నిత్యం ఇక్కడ గొడవలే జరుగుతున్నాయి. జగన్ మాత్రం జమ్మలమడుగుపై ప్రత్యేక శ్రద్ధ కనపర్చడం చర్చనీయాంశమైంది. రామసుబ్బారెడ్డిని తన వద్దకు పిలిపించుకుని మరీ పంచాయతీని సాల్వ్ చేశారు. జగన్ స్వయంగా రంగంలోకి దిగడంతో వివాదానికి కొంత ఫుల్ స్టాప్ పడినట్లేనంటున్నారు. ఇలా అన్ని నియోజకవర్గాలపై జగన్ దృష్టి పెడితే విభేదాలు సమసిపోతాయని, లేకుంటే ఎన్నికల నాటికి మరింత తీవ్రమవుతాయని పార్టీ నేతలు చెబుతున్నారు.

Tags:    

Similar News