ఈ నిర్ణయం ….2024…?

వైఎస్ జగన్ మూడు రాజధానుల ఏర్పాటుకు సిద్ధమయి పోయారు. త్వరలోనే మూడు రాజధానులను ఏర్పాటు చేయడం ఖాయం. దీనికి ఆదేశాలు వెలువడటమే తరువాయి. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, [more]

Update: 2020-01-06 15:30 GMT

వైఎస్ జగన్ మూడు రాజధానుల ఏర్పాటుకు సిద్ధమయి పోయారు. త్వరలోనే మూడు రాజధానులను ఏర్పాటు చేయడం ఖాయం. దీనికి ఆదేశాలు వెలువడటమే తరువాయి. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేచర్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ను ఏర్పాటు చేయడానికి జగన్ సిద్ధమయిన తరుణంలో ఈ ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తున్నాయి. ప్రజలు 2024 లో జరిగే ఎన్నికల్లో జగన్ వైపు నిలుస్తారా? లేక వ్యతిరేకిస్తారా? అన్నది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా ఉంది.

సీమ ప్రాంతంలో….

జగన్ ఇంత మొండిగా ఉండటానికి కూడా కారణాలు లేకపోలేదు. ఇప్పటికే కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వైసీపీ బలంగా ఉంది. రానున్న నాలుగున్నరేళ్లలో ఈ జిల్లాల్లో అభివృద్ధి చేయాలన్నది జగన్ లక్ష్యం. పారిశ్రామిక రంగంతో పాటు సాగు, తాగునీరు అందించే లక్ష్యంగా జగన్ ఆలోచనలు ఉన్నాయి. ఇవే జరిగితే గతంకంటే ఈ జిల్లాల్లో వైసీపీ బలోపేతం అవుతుందే తప్ప బలహీనం కాదు. గత ఎన్నికల్లో కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో కేవలం మూడు సీట్లను మాత్రమే కోల్పోయింది.

ప్రాజెక్టులతో…..

ఇక అమరాతికి దగ్గరగా ఉన్న ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో నాలుగు సీట్లను వైసీపీ కోల్పోయింది. ఈసారి ప్రకాశం జిల్లాకు రామాయపట్నం పోర్ట్ తో పాటు దొనకొండను ఇండ్రస్ట్రియల్ క్యారిడార్ గా చేయాలనుకుంటున్నారు. దీనివల్ల ప్రకాశంలో కూడా తాము బలంగానే ఉంటామన్నది వైసీపీ నేతల అంచనా. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అమరావతిని అలాగే కొనసాగించినా వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు వచ్చినన్ని సీట్లు వచ్చే అవకాశం లేదు. దీంతో ఆ రెండు జిల్లాలపై జగన్ పెద్దగా హోప్స్ పెట్టుకోలేదు. అలాగని ఈ రెండు జిల్లాలను వదిలేయకుండా ఎడ్యుకేషనల్ హబ్, అగ్రికల్చరల్ జోన్ గా ఏర్పాటు చేయనున్నారు. పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో కూడా ఇదే వ్యూహాన్ని జగన్ అమలు పర్చనున్నారు.

ఉత్తరాంధ్రలో మాత్రం…..

ఇక ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుతో తమవైపు ఉంటారన్న నమ్మకంతో వైసీపీ ఉంది. అక్కడ దశాబ్దకాలంగా ఉన్న టీడీపీ ఓటు బ్యాంకును మొన్నటి ఎన్నికల్లో కొల్లగొట్టారు. ఇప్పుడు చంద్రబాబు మళ్ల వస్తే రాజధానిని తిరిగి అమరావతికి తీసుకెళ్తారని భావించి తమ పక్షానే నిలుస్తారన్నది వైసీపీ నేతల ఆలోచన. రెండు జిల్లాల్లో మినహా వైైసీీపీ వచ్చే ఎన్నికల నాటికి స్ట్రాంగ్ గా మారుతుందనే జగన్ మూడు రాజధానులకు ఫిక్స్ అయ్యారన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. మొత్తం మీద జగన్ నిర్ణయం 2024 ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు ఇస్తుందనేది వేచి చూడాలి.

Tags:    

Similar News