వైసీపీ నేత టీడీపీలోకి వెళ్లినా.. ఏం ప్రయోజనం?

అధికార వైఎస్సార్‌సీపీలో అస‌మ్మ‌తి జ్వాల‌లు ఎగ‌సి ప‌డుతున్నాయి. నేత‌లు ఎక్కువ కావ‌డం… ఇటు ప‌ద‌వులు త‌క్కువ కావ‌డంతో జ‌గ‌న్ అంద‌రిని సంతృప్తి ప‌ర‌చ‌లేక‌పోతున్నారు. ఈ క్రమంలోనే కొంద‌రు [more]

Update: 2021-06-04 11:00 GMT

అధికార వైఎస్సార్‌సీపీలో అస‌మ్మ‌తి జ్వాల‌లు ఎగ‌సి ప‌డుతున్నాయి. నేత‌లు ఎక్కువ కావ‌డం… ఇటు ప‌ద‌వులు త‌క్కువ కావ‌డంతో జ‌గ‌న్ అంద‌రిని సంతృప్తి ప‌ర‌చ‌లేక‌పోతున్నారు. ఈ క్రమంలోనే కొంద‌రు సీనియ‌ర్ల పార్టీ కోసం ఎన్నేళ్లు.. ఎంత‌లా క‌ష్టప‌డినా కూడా ఉప‌యోగం ఉండడం లేద‌న్న ఆవేద‌న‌తో ఉన్నారు. కొంద‌రు క‌క్కలేక మింగ‌లేక చందంగా పార్టీలో ఉన్నా… కొంద‌రు మాత్రం బ‌య‌ట‌కు వ‌చ్చి త‌మ దారి తాము చూసుకునేందుకు రెడీ అవుతున్నారు. కొంద‌రికి జ‌గ‌న్ నుంచి హామీలు వ‌చ్చినా ప‌ద‌వులు లేవు స‌రిక‌దా… ఎన్నిక‌ల‌కు ముందు వ‌చ్చి… ప్రజా బ‌లం లేని నేత‌లు కూడా ప‌ద‌వులు ద‌క్కించుకోవ‌డం పార్టీలో తీవ్ర అస‌మ్మతి జ్వాల‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది.

జగన్ కు సన్నిహితుడు…

తాజాగా జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌కే చెందిన కీల‌క నేత‌, జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు అయిన ఓ నేత టీడీపీ అధినేత చంద్రబాబును తిరుప‌తిలో క‌ల‌వ‌డం ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర ప్రకంప‌న‌లు రేపుతోంది. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల ప్రచారంలో ఉన్న చంద్రబాబును రాయ‌చోటికి చెందిన వైసీపీ నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కలిసారు. రాంప్రసాద్ రెడ్డి రాయ‌చోటిలో శ్రీకాంత్‌రెడ్డికే కాకుండా.. ఇటు సీఎం జ‌గ‌న్‌కు కూడా అత్యంత స‌న్నిహితుడు. రాయ‌చోటిలో శ్రీకాంత్ రెడ్డి వ‌రుస‌గా నాలుగు సార్లు విజ‌యం సాధించ‌డంలో ఆయ‌న‌ది కూడా కీల‌క పాత్రే.

ఏదో ఒక పదవి వస్తుందని…..

త‌న‌కు ఎమ్మెల్సీ లేదా.. ఇత‌ర కార్పొరేష‌న్ ప‌ద‌వుల్లో ఏదో ఒక ప‌ద‌వి ఇస్తార‌ని ఆయ‌న ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లు అవుతోంది. ఇప్పటి వ‌ర‌కు ప‌ద‌వి లేదు స‌రిక‌దా ? క‌నీసం ప్రయార్టీ కూడా లేక‌పోవ‌డం… ఇటు నియోజ‌క‌వ‌ర్గంలో శ్రీకాంత్‌రెడ్డి తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తుండ‌డం లాంటి ప‌రిణామాల‌తు ఆయ‌న‌లో తీవ్ర అస‌హ‌నానికి కార‌ణ‌మ‌య్యాయని స్థానికంగా ప్రచారం జ‌రుగుతోంది.

టీడీపీలోకి వచ్చినా..?

ఈ క్రమంలోనే ఆయ‌న టీడీపీ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. రాంప్రసాద్ రెడ్డి టీడీపీలోకి వ‌చ్చినా ఆయ‌న‌కు ఇక్కడ పార్టీ ప‌ద‌వులే త‌ప్ప ఎమ్మెల్యే టిక్కెట్ వ‌స్తుంద‌న్న గ్యారెంటీ లేదు. ఇప్పటికే ఇక్కడ పార్టీ త‌ర‌పున మాజీ ఎమ్మెల్యే ర‌మేష్‌కుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఏదేమైనా క‌డ‌ప జిల్లాలో సీఎం జగన్కే స‌న్నిహితంగా ఉన్న ఓ కీల‌క నేత ఇలాంటి టైంలో పార్టీ వీడ‌డం అధికార పార్టీకి దెబ్బే అనుకోవాలి.దయ్యాయి

Tags:    

Similar News