ఎందుకంత కాన్ఫిడెన్స్.. అతి విశ్వాసం కాదా?

వైఎస్ జగన్ ఆత్మవిశ్వాసంతో కనపడుతున్నారు. తన సంక్షేమ పథకాలకు ప్రజలు కనెక్ట్ అయ్యారని జగన్ గట్టిగా విశ్వసిస్తున్నారు. అందుకే ఎన్నికల ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. జగన్ [more]

Update: 2021-04-06 08:00 GMT

వైఎస్ జగన్ ఆత్మవిశ్వాసంతో కనపడుతున్నారు. తన సంక్షేమ పథకాలకు ప్రజలు కనెక్ట్ అయ్యారని జగన్ గట్టిగా విశ్వసిస్తున్నారు. అందుకే ఎన్నికల ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. జగన్ తన కటౌట్ గెలిపిస్తుందన్న విశ్వాసంతో ఉన్నట్లు కనపడుతుంది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం. ఇక్కడ పార్టీ అభ్యర్థికి ఏ మాత్రం గత ఎన్నిక కంటే మెజారిటీ తగ్గినా జగన్ పని అయిపోయిందన్న విమర్శలు విపక్షాల నుంచి వినిపిస్తాయి.

సంక్షేమ పథకాలే….

అయినా జగన్ దానిని ఖాతరు చేయడం లేదు. మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడంతో తనతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు గెలిపించాయని జగన్ భావించారు. ప్రధానమైన విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికల్లోనూ జగన్ ప్రచారంలో పాల్గొనలేదు. అయినా అక్కడ విజయం సాధించింది. స్థానిక నాయకులకే అక్కడ ప్రచార బాధ్యతలను జగన్ అప్పగించారు.

ఏడు అసెంబ్లీ సెగ్మంట్లలో….

నిజానికి జగన్ తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం నిర్వహిస్తారని అనుకున్నారు. కానీ జగన్ మాత్రం అందుకు అంగీకరించలేదు. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులకు మాత్రమే బాధ్యతలను అప్పగించారు. తనకు నమ్మకమైన, ప్రజలను ఆకట్టుకునే మంత్రులను ఇన్ ఛార్జులుగా నియమించి తాను తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికే జగన్ పరిమితమయ్యారు. అయితే పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ కేసీఆర్ ఇలాంటి తప్పిదమే చేసి దుబ్బాకను చేజార్చుకున్నారు.

కేసీఆర్ కూడా అలాగే అనుకుని…..

దుబ్బాక ఉప ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారంలో పాల్గొనలేదు. దీంతో అక్కడ ఓటమి పాలయింది. సాగర్ ఉప ఎన్నికల్లో మాత్రం కేసీఆర్ ఆ పనిచేయలేదు. హాలియా సభలో పాల్గొన్నారు. ఇదే విషయాన్ని కొందరు వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అతి విశ్వాసం అన్ని వేళలా పనికి రాదని, ఎన్నికలను లైట్ గా తీసుకోకూడదన్న వ్యాఖ్యలు పార్టీ నుంచి విన్పిస్తున్నాయి. రేపు తిరుపతి ఉప ఎన్నికల్లో గెలిచినా మెజారిటీ తగ్గితే మాత్రం అందుకు బాధ్యత జగన్ వహించాల్సి ఉంటుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News