జగన్ పైన ద్వేషంతోనేనా?

రాష్ట్రంలో ఏం జ‌రుగుతోంది ? రాజ‌ధానిపై విప‌క్షాలు ఏం చేస్తున్నాయి ? ఇప్పుడు ఈ రెండు ప్రశ్నల‌పై గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు కూడా పెద్ద ఎత్తున [more]

Update: 2020-01-06 02:00 GMT

రాష్ట్రంలో ఏం జ‌రుగుతోంది ? రాజ‌ధానిపై విప‌క్షాలు ఏం చేస్తున్నాయి ? ఇప్పుడు ఈ రెండు ప్రశ్నల‌పై గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు కూడా పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. ముఖ్యంగా “చంద్రబాబుపై కోపంతోనే జ‌గ‌న్ అమ‌రావ‌తిని మారుస్తున్నారు“ అనే కొత్త వాదాన్ని కొన్ని పార్టీలు తెర‌మీద‌కి తెచ్చాయి. అయితే, ఈ విష‌యంలో ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చింది. వ్యక్తిపై కోపం ఉంటే.. ఇలా చేయాల్సిన అవ‌స‌రం ఎందుకు ఉంటుంది? అనే ప్రశ్న కూడా తెర‌ మీదికి వ‌చ్చింది. పైగా మూడు రాజ‌ధానుల్లో అమ‌రావ‌తి కూడా ఉంద‌ని అధికార ప‌క్షం చెబుతోంది. అమ‌రావ‌తిని అభివృద్ది చేయ‌బోమ‌ని ఎక్కడా ఏ మంత్రి కూడా చెప్పలేదు. అయితే, కేవ‌లం ఎంత మేర‌కు అవ‌స‌ర‌మో .. అంత మాత్రమే అభివృద్ధి చేస్తామ‌ని, ఇప్పటి కే అభివృద్ది చెందిన విశాఖ‌ను ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకోవ‌డం వ‌ల్ల కేవ‌లం రూ.10 వేల కోట్ల ఖ‌ర్చుతో ప‌ని ముగుస్తుంద‌ని అంటోంది.

ఏ నిర్ణయం తీసుకున్నా….

క‌ర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయ‌డం ద్వారా శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఆ ప్రాంతానికి కూడా న్యాయం జ‌రుగుతుంద‌ని జ‌గ‌న్ అండ్ కో చెబుతున్న మాట‌. అయితే, ఇప్పుడు విప‌క్షాలు మాత్రం ఈ వాద‌న‌ను ఎక్కడా ప‌ట్టించుకోకుండా కేవ‌లం ఓ వ్యక్తిపై కోపాన్ని జ‌గ‌న్ చూపిస్తున్నారంటూ మ‌రో రాజకీయ దుమారాన్ని తెర‌మీదికి తెచ్చే ప్రయ‌త్నం చేస్తున్నారు. అయితే, ఇప్పుడు విశ్లేష‌కులు మ‌రో అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అస‌లు విప‌క్షాల‌కు జ‌గ‌న్‌పై కోపంతోనే అమ‌రావ‌తిపై రచ్చ చేస్తున్నారా? అనేది వీరి అనుమానం. ఎందు కంటే..జ‌గ‌న్ ఏ నిర్ణయం తీసుకున్నా.. ఆహ్వానించిన వారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవ‌డం గ‌మ‌నార్హం. ఆ నిర్ణయం రాష్ట్రానికి మేలు చేసేదైనా.. స‌రే ఎవరూ కూడా ఆహ్వానించ‌లేక పోయారు.

ఎన్ని చేసినా….

ఉద్దానం కిడ్నీ బాధితుల‌కు చంద్రబాబు హ‌యాంలో రూ.3000 పింఛ‌ను ఇస్తే.. జ‌గ‌న్ వ‌చ్చాక దానిని ఏకంగా రూ.10 వేల‌కు పెంచారు. మ‌రి దీనిని కూడా స్వాగ‌తించ‌లేక పోయారు విప‌క్ష నాయ‌కులు. అదే స‌మ‌యంలో మ‌ద్యం నియంత్రణ‌కు ప్రభుత్వం అడుగులు వేసినా విమ‌ర్శలు గుప్పించారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తూ నిర్ణయం తీసుకున్నా హర్షం వ్యక్తం చేయలేదు. దిశ చ‌ట్టంలో నూ లోపాల‌ను వెతికారు. ఇది సాధ్యం కాద‌ని తీర్మానం చెప్పారు. అంటే.. మొత్తంగా.. జ‌గ‌న్ అనే వ్యక్తి అధికారంలోకి రావ‌డాన్ని విప‌క్షాలు జీర్ణించుకోవ‌డం లేద‌నే విష‌యం స్పష్టంగా తెలుస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందు కూడా జ‌గ‌న్‌ను వ్యక్తిగ‌తంగా ఇబ్బంది పెట్టే మాట‌ల‌తో ప్రసంగాలు గుప్పించిన విష‌యం ప్రస్తుతం ప్రస్తావ‌నార్హం. ఇదే ఇప్పుడు విప‌క్షాల‌ను న‌డిపిస్తోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

విపక్షాల వాదనతో….

కేవ‌లం జ‌గ‌న్‌పై కోపంతోనే మూడు ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటున్నార‌నే వాద‌న కూడా మిగిలిన ప్రాంతాల్లో ప్రబ‌లుతోంది. ఇది బ‌ల‌ప‌డితే.. వ‌చ్చే రోజుల్లో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో విశాఖ స‌హా సీమ వాసుల‌కు ఈ పార్టీలు ఏం చెబుతాయి? ఎలా ఓట్లు అడుగుతాయి.? జ‌గ‌న్ మీ ప్రాంతాల‌ను కూడా అభివృద్ధి చేస్తాన‌న్నాడు..కానీ, మేమే వ‌ద్దని చెప్పాం.. ! అని చెప్పగ‌లవా? పాల‌నా రాజ‌ధాని లేకుండా అభివృద్ధి సాధ్యమా? ఇది నిజ‌మైతే.. ఈ దేశంలో అభివృద్ధి కాని న‌గ‌రం అంటూ ఉండ‌కూడదు. మ‌రి ఈ విష‌యంలో విప‌క్షాలు ఎలా రియాక్ట్ అవుతాయో.. చూడాలి. వ్యక్తి .. వ్యక్తి.. అంటూ చేస్తున్న భ‌జ‌న చివ‌రికి వారికే బూమ‌రాంగ్ అవుతున్న విష‌యాన్ని గుర్తించాల‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

Tags:    

Similar News