జగన్ ఆశలపై నీళ్లు అలా ఎందుకు పడ్డాయో?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త జిల్లాల ఏర్పాటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తాను పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ కావడంతో దానిని వెంటనే పూర్తి చేయాలని [more]

Update: 2021-04-11 05:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త జిల్లాల ఏర్పాటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తాను పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ కావడంతో దానిని వెంటనే పూర్తి చేయాలని భావించారు. ప్రస్తుతం 13 జిల్లాలున్న ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంతో కమిటీని కూడా నియమించారు. కమిటీ నివేదిక కూడా దాదాపు పూర్తయ్యే దశలో కేంద్ర ప్రభుత్వం జగన్ ఆశలపై నీళ్లు గుమ్మరించింది.

ఇచ్చిన హమీని….

పాదయాత్ర లో ప్రతి చోట జగన్ చెప్పిన మాట ఇదే. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా కేంద్రాన్ని చేస్తామని. దీంతో తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అందరూ భావించారు. కొత్త జిల్లాలు ఏర్పాటయితే ప్రభుత్వ పదవులతో పాటు పార్టీ పదవులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తాయని, నేతలను పదవులతో సంతృప్తి పర్చ వచ్చని జగన్ భావించారు. అందుకే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చేస్తూనే ఉన్నారు.

కేంద్రం ప్రకటనతో…

అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన జగన్ పార్టీలో నైరాశ్యం అలుముకుంది. మరో ఏడాదిన్నర వరకూ ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు సాధ్యం కాదు. ఎందుకంటే జనగణన పూర్తయ్యే వరకూ కొత్త జిల్లాల ఏర్పాటు సాధ్యం కాదు. కరోనా కారణంగా జనగణన ఇప్పుడు అయ్యేట్లు లేదు. మరో ఏడాదిన్నర సమయం పడుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం జనగణన పూర్తయ్యే వరకూ నిషేధిత ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొంది.

కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాతే….?

నిజానికి జగన్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత నిర్వహించాలనుకున్నారు. కానీ సాధ్యం కాలేదు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే అభివృద్ధిపై కూడా జగన్ ప్రత్యేకంగా ప్రణాళికను రూపొందించుకున్నారు. జిల్లాల వారీగా సమగ్ర అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జగన్ ఆశలను ఆవిరి చేశాయి. మరో ఏడాది వరకూ ఇక కొత్త జిల్లాల ఏర్పాటు సాధ్యం కానట్లే.

Tags:    

Similar News