జగనే సినిమా చూపిస్తారట…?

అవును మరి. జగన్ రియల్ హీరోవే. రీల్ హీరోలందరి కంటే కూడా మొనగాడే. ఆయన జీవితంలో ఉన్నన్ని ట్విస్టులు ఏ సినిమాలోనూ ఉండవు. ఇక జగన్ ని [more]

Update: 2021-04-11 02:00 GMT

అవును మరి. జగన్ రియల్ హీరోవే. రీల్ హీరోలందరి కంటే కూడా మొనగాడే. ఆయన జీవితంలో ఉన్నన్ని ట్విస్టులు ఏ సినిమాలోనూ ఉండవు. ఇక జగన్ ని హీరో చేద్దామని ఒకానొక టైమ్ లో ఆయన మేనమామ గట్టి ప్రయత్నాలు కూడా చేసిన సంగతి కూడా ప్రచారంలో ఉంది. మరి ఇన్ని రకాలుగా హీరోయిజాన్ని సొంతం చేసుకున్న జగన్ కి సినిమా వాళ్ళతో బాగానే రిలేషన్స్ ఉన్నాయి. కానీ ఎందుకో ఏపీ మీద ఏ ఒక్క సినీ ప్రముఖుడూ దృష్టి పెట్టడం లేదు. దాంతో చివరికి తెగించి జగనే రెడీ అయిపోతున్నారుట.

ఆ రాజధాని కూడా….

విశాఖను జగన్ పరిపాలనా రాజధానిగా ప్రకటించారు. అది ఇవాళ కాకపోయినా రేపు అయినా సాకారం అవుతుంది. ఈ లోగా చేయాల్సిన పనులు బోలెడు జగన్ బుర్రలో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది సినీ రాజధాని. ఈ ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉన్నా కూడా ఎప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు. మూడు దశాబ్దాలకు ముందే నాటి ప్రభుత్వాలు సినీ ప్రముఖులకు విశాఖలో భూములు కేటాయించాయి. వాటిలో స్టూడియో నిర్మాణం చేపడితే విశాఖ మరో టాలీవుడ్ అవుతుందని కూడా అంతా ఆశపడ్డారు. అయితే ఒక్క రామానాయుడు తప్ప ఎవరూ స్టూడియోలు కట్టలేదు.

అక్కడే సెటిల్ ….

ఇక సినిమా పెద్దల తీరు చూస్తూంటే హైదారాబాద్ గడప దాటి బయటకు వచ్చేట్లు లేరు. టాలీవుడ్ మొత్తానికి కాకపోయినా కొంత అయినా విశాఖకు వస్తే ఇక్కడ కూడా పరిశ్రమ ఉంటుందని, సినీ యాక్టివిటీస్ బాగా జోరు అందుకుంటాయని జగన్ తలపోశారు. ఈ మేరకు సినీ ప్రముఖులతో ఒక తడవ మీటింగ్ కూడా జరిగింది. అంతా ఓకే అన్నారు కానీ ఎక్కడో ఏదో అడ్డంకి పడినట్లు ఉంది. హైదరాబాద్ ని కాదని ఇటు వైపు చూస్తే కేసీయార్ ఏమనుకుంటారో అన్నరాజకీయ మొహమాటాలు చాలా మంది పెద్దలకు ఉన్నట్లు ఉన్నాయి. దానికి తోడు ఏపీకి పోటీగా కేసీయార్ కూడా సినీ పెద్దలను బాగానే దువ్వుతున్నారు. దీంతో కొందరు ప్రముఖులు అక్కడే స్టూడియోలు కట్టేందుకు సన్నాహాలు కూడా చేసుకుంటున్నారని టాక్.

ప్రభుత్వమే రెడీ …

ఇక జగన్ దీన్ని చూసి చూసి విసిగారో లేక పట్టుదలగా తీసుకున్నారో కానీ ప్రభుత్వం తరఫున ఒక స్టూడియో కడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేస్తున్నారని టాక్. ఎవరికో సినీ ప్రముఖులకు భూములు ఇచ్చి వారు కడతారో లేదో అన్న బెంగ లేకుండా ప్రభుత్వ ఆద్వర్యంలో ఒక స్టూడియో కడితే ఔత్సాహిక సినీ కళాకారులకు భారీగా ఉపాధి అవాకాశాలు వస్తాయని ఆలోచిస్తున్నారని అంటున్నారు. అదే విధంగా కొత్త వారికి కూడా చాన్సులు దక్కుతాయని, ఏపీలో కూడా చిత్ర పరిశ్రమ వేళ్ళూనుకుంటుందన్నది జగన్ ప్లాన్ గా చెబుతున్నారు. మొత్తానికి చూస్తే జగన్ టాలీవుడ్ ని ఏపీకి తెచ్చేసేలాగానే సీన్ కనిపిస్తోంది.

Tags:    

Similar News