మ‌రోసారి ఛాన్స్ ద‌క్కేనా.. ఆ మంత్రి ముచ్చట తాడేప‌ల్లి దాకా?

“స్థానిక ఎన్నిక‌ల్లో స‌త్తా చూపించాల‌న్నారు.. చూపించాం.. మ‌రి మాకు రెన్యువ‌ల్ ఉంటుందా ?“ ఇదీ తాజాగా ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు చెందిన ఇద్దరు మంత్రులు తాడేప‌ల్లి ప్యాలెస్‌లో [more]

Update: 2021-04-05 03:30 GMT

“స్థానిక ఎన్నిక‌ల్లో స‌త్తా చూపించాల‌న్నారు.. చూపించాం.. మ‌రి మాకు రెన్యువ‌ల్ ఉంటుందా ?“ ఇదీ తాజాగా ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు చెందిన ఇద్దరు మంత్రులు తాడేప‌ల్లి ప్యాలెస్‌లో కీల‌కంగా ఉన్న స‌ల‌హాదారు వ‌ద్ద ప్రస్తావించిన ముచ్చట‌. త్వర‌లోనే రాష్ట్ర మంత్రి వ‌ర్గాన్ని ప్రక్షాళ‌న చేయ‌నున్న నేప‌థ్యంలో ఏ ఇద్దరు మంత్రులు క‌లిసినా.. ఈ విష‌యంపైనే చ‌ర్చించుకుంటున్నారు. మ‌రీ ముఖ్యంగా యువ మంత్రుల ప‌రిస్థితి ఆశాజ‌నంగానే ఉన్నప్పటికీ.. 60 ఏళ్లు పైబ‌డిన వారి గురించి మాత్రం విస్తృతంగా చ‌ర్చ సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందు.. అంటే.. ఇటు మంత్రి వ‌ర్గంలోను, అటు పార్టీలోను కూడా యువ‌త‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని జ‌గ‌న్ నిర్ణయించుకున్నారు.

యువతకే అవకాశం….

ఈ క్రమంలోనే త్వర‌లోనే చేప‌ట్టబోయే మంత్రి వ‌ర్గ విస్తర‌ణ లేదా ప్రక్షాళ‌న‌లో యువ నాయ‌కుల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని ఆయ‌న నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అంటే.. 45-50 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న వారికి ఎక్కువ‌గా అవ‌కాశం ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో యువ‌త‌ను పార్టీవైపు తిప్పుకోవ‌డంతోపాటు.. ప్రతిప‌క్షానికి ఛాన్స్ ఇవ్వకుండా వ్యవ‌హ‌రించాల‌ని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం కేబినెట్లో ఉన్న వారిలో వ‌య‌స్సు పైబ‌డిన వారు… క‌నీసంం నోట్లో మాట బ‌య‌ట‌కు రాని మంత్రుల విష‌యంలో జ‌గ‌న్ తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు.

ఈ ఇద్దరు మంత్రులు….

ఈ క్రమంలో ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు చెందిన ఇద్దరు మంత్రులు కేబినెట్‌ను మారిస్తే తాము ఉంటామా ? అవుట్ అవుతామా ? అన్న విష‌యంపై తీవ్ర ఆందోళ‌న‌తో ఉన్నార‌ట‌. ఈ విష‌యం ఇప్పుడు పార్టీ నేత‌ల మ‌ధ్యే హాట్ టాపిక్ అయ్యింది. ఈ క్రమంలోనే వీరిద్దరు ఎక్కడికి వెళ్లినా.. మాకు ఛాన్స్ ఉంటుందంటారా ? మీదే బాధ్యత అంటూ.. జ‌గ‌న్‌తో ట‌చ్‌లో ఉన్న నేత‌ల‌కు నూరిపోస్తున్నారు. ఇటీవ‌ల ఇదే విష‌యంపై తాడేప‌ల్లిలో కీల‌కంగా ఉన్న స‌ల‌హాదారు వ‌ద్ద కూడా ప్రస్తావించారు. వాస్తవానికి స్థానిక ఎన్నిక‌ల‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం జ‌గ‌న్‌.. దీనిలో విజ‌యం సాధించేవారికి ప్రమోష‌న్‌, రెన్యువ‌ల్ ద‌క్కుతాయ‌ని ప్రక‌టించారు.

అన్ని రకాలుగా కష్టపడ్డా…..

ఈ నేప‌థ్యంలో అంద‌రూ శ్రమ తెలియ‌కుండా ప‌నిచేశారు. అభ్యర్థుల కంటే కూడా ఎక్కువ‌గా క‌ష్టప‌డ్డారు. ఈ క్రమంలో కొంద‌రు డ‌బ్బులు కూడా ఖ‌ర్చు పెట్టారు. ప‌లితంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పుంజుకుంది. అయిన‌ప్పటికీ.. వీరిలో జ‌గ‌న్ వ్యవ‌హారం.. మంత్రి వ‌ర్గం ప్రక్షాళ‌న వంటి విష‌యాల‌పై మాత్రం ఆశ‌లు స‌న్నగిల్లుతూనే ఉన్నాయి. కొత్తవారికి అవ‌కాశం ఇస్తాన‌ని ప‌దేప‌దే సంకేతాలు ఇస్తుండ‌డం.. యువ‌త‌కు అవ‌కాశం ఇస్తాన‌ని చెబుతుండ‌డం వంటి రీజ‌న్ల నేప‌థ్యంలో తాము ఎంత క‌ష్టించినా.. రెన్యువ‌ల్ క‌ష్టమ‌నే.. అభిప్రాయం వీరిలో క‌నిపిస్తోంది. దీంతో వారి ప్రయ‌త్నాలు వారు చేసుకుంటున్నారు. మ‌రి వీరి ప్రయ‌త్నాలు ఏమేర‌కు స‌క్సెస్ అవుతాయో చూడాలి.

Tags:    

Similar News