డెసిషన్ ఈజ్ టేకెన్…యాక్షన్ బిగిన్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలను చేపట్టిన తర్వాత ఆయనలో పూర్తిగా మార్పు వచ్చిందంటున్నారు. ఎన్నికలకు ముందు జగన్ కు, ఇప్పటి జగన్ కు చాలా తేడా [more]

Update: 2021-04-01 02:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలను చేపట్టిన తర్వాత ఆయనలో పూర్తిగా మార్పు వచ్చిందంటున్నారు. ఎన్నికలకు ముందు జగన్ కు, ఇప్పటి జగన్ కు చాలా తేడా ఉంది. స్పష్టంగా కన్పిస్తుంది. సహజంగా ప్రాంతీయ పార్టీ అంటే అధినేతదే ఫైనల్ నిర్ణయం. దీనిని ఎవరూ కాదనలేరు. పార్టీలో అసంతృప్తులు ఎలాంటివి తలెత్తకుండా నిర్ణయాలు తీసుకుంటేనే పార్టీ మనుగడ ఉంటుంది. అయితే జగన్ మాత్రం సీనియర్ నేతల సలహలు, సూచనలను మాత్రం పట్టించుకోవడం లేదంటున్నారు.

సీనియర్ నేతలు చాలా మందే ఉన్నా….

వైసీపీ లో సీనియర్ నేతలు చాలా మందే ఉన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వద్ద పనిచేసిిన వారు కూడా అందులో ఉన్నారు. వయసు రీత్యా కూడా వారు జగన్ కంటే పెద్దవారు. రాజకీయంగా అనుభవంలోనూ వారే సీనియర్లు. సహజంగా తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ వీరిపైనే ఎక్కువ ఆధారపడతారని అందరూ భావించారు. సీనియర్ నేతలు సయితం తాము చక్రం తిప్పవచ్చని ఊహించుకున్నారు. కానీ వారి అంచనాలన్నీ జగన్ తలకిందులు చేస్తున్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో…..

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలే దీనికి ఉదాహరణ. మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను జగన్ అందరి నేతలకు అప్పగించారు. కొన్ని జిల్లాలను సీనియర్ నేతలకు, మంత్రులకు అప్పగించారు. సహజంగా ఇన్ ఛార్జి మంత్రులు, సీనియర్ల వద్దకు నేతలు క్యూకడతారు. తమకు పదవులపై హామీ ఇవ్వాలని పట్టుబడతారు. ఏ పార్టీలోనైనా సహజంగా జరిగేది ఇదే. వైసీపీలో కూడా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సీనియర్ నేతలు, మంత్రులు అనేక మందికి హామీలు ఇచ్చారు. మేయర్లు, ఛైర్మన్లు చేస్తామని చెప్పారు. తమ వర్గం కాపాడుకోవడానికి కూడా వారు ఈ హామీలు ఇచ్చి ఉండవచ్చు.

సొంతంగానే నిర్ణయం….

కానీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రం జగన్ సీనియర్ నేతలను, మంత్రులను దూరం పెట్టారు. వారు చేసిన సిఫార్సులవీ చెల్లుబాటు కాలేదు. జగన్ సామాజికవర్గాల ఆధారంగానే కొత్త వారికి అవకాశమివ్వడంతో సీనియర్ నేతలు సయితం అవాక్కయ్యారు. దీంతో మంత్రులకు సయితం కొన్ని చోట్ల భంగపాటు తప్పలేదు. తాము మాటిచ్చిన వారికి సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. ఇక ఎమ్మెల్యేలకు కూడా జగన్ షాకిచ్చారు. వారి నియోజకవర్గాల్లో జరిగిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా మేయర్, ఛైర్మన్లను తానే ఎంపికచేశారు. దీంతో సీనియర్ నేతలు, మంత్రులు ఇంకా జగన్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోలేదట.

Tags:    

Similar News