జగన్..శరణం గత్యామీ ?

ఆఖరుకు ఏపీలో బీజేపీ ఇలా నిర్ణయించుకుందా. ఎక్కడో టీడీపీతో మొదలెట్టి మరెక్కడో జనసేనతో పొత్తు కట్టి చివరికి వైసీపీ దగ్గర తేలుతుందా అంటే సమాధానం మాత్రం అవును [more]

Update: 2021-03-14 05:00 GMT

ఆఖరుకు ఏపీలో బీజేపీ ఇలా నిర్ణయించుకుందా. ఎక్కడో టీడీపీతో మొదలెట్టి మరెక్కడో జనసేనతో పొత్తు కట్టి చివరికి వైసీపీ దగ్గర తేలుతుందా అంటే సమాధానం మాత్రం అవును అని వస్తోంది. ఏపీలో బీజేపీకి బెస్ట్ ఫ్రెండ్ జగనే అని ఆ పార్టీ అగ్రనాయకులు డిసైడ్ అయిపోయారుట. దాంతో పాటు దేశంలో వేగంగా మారుతున్న అనేక రాజకీయ సమీకరణల నేపధ్యంలో జగన్ తో దోస్తీ కట్టాలని కమలనాధులు సీరియస్ గానే ఆలోచిస్తున్నారని అంటున్నారు. జగన్ ఉంటే చాలు సౌత్ లో కొత్త బలం వస్తుందని బీజేపీ గట్టిగా నమ్ముతోందిట.

ఎన్డీయేలో చేరుతారా…?

నిజానికి ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బీజేపీ నేతలు కోరుతున్నది అదే. ఎన్డీయేలో వైసీపీ చేరిపోవాలని పదే పదే అడుగుతున్నారు. జగన్ మాత్రం ఇపుడు కాదు అంటూ తప్పించుకుంటున్నారు. కానీ చూడబోతే ఇక మీదట జగన్ అలా చెప్పి అసలు తప్పించుకోలేరు అన్నది ఢిల్లీ వర్గాల భోగట్టా. ఏపీలో జగన్ సర్కార్ రెండేళ్ల కాలాన్ని మే నెలతో పూర్తి చేసుకోబోతోంది. ఆనాటికి జగన్ ఎన్డీయేలో మిత్రుడిగా ఉంటారని కూడా కచ్చితంగా లెక్కలేసి మరీ చెప్పేస్తున్నారు.

షరతులు వర్తిస్తాయా…?

ఇక జగన్ ఎన్డీయేలో చేరడానికి కొన్ని షరతులు విధించారని అంటున్నారు. అవేంటి అంటే ముందుగా ప్రత్యేక హోదాను ఏపీకి ప్రకటించాలి. ఎటువంటి కొర్రీలు లేకుండా సకాలంలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయ్యేలా చూడాలి. ఇక విభజన హామీల మేరకు ఏపీకి రావాల్సినవి అన్నీ నెరవేర్చాలి. రెవిన్యూ లోటును కూడా పూర్తిగా భర్తీ చేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకోవాలి. ఇలాంటివి కనుక బీజేపీ పెద్దలు ఒప్పుకుంటే జగన్ ఎన్డీయేలో చేరిపోవడం ఖాయమని అంటున్నారు. జగన్ కి కూడా తిరుపతి ఉప ఎన్నిక తరువాత మరో మూడేళ్ళ వరకూ ఏపీలో ఏ రకమైన ఎన్నికలు లేవు. దాంతో కేంద్రంతో దోస్తీ చేస్తూ ఏపీ ప్రగతిని చూసుకోవాలన్నది మాస్టర్ ప్లాన్ గా ఉంది అంటున్నారు.

అదే భయం….

ఇక బీజేపీకి అర్జంటుగా జగన్ కావాల్సిరావడం ఆశ్చర్యకరమైన పరిణామమేదీ కాదు అంటున్నారు. పశ్చిమ బెంగాల్ సహా అయిదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి అసోం తప్ప మిగిలిన వాటిలో ఖాతా తెరచే సీన్ లేదు. ఇక మమతా బెనర్జీ మరో మారు అధికారంలోకి వస్తే దేశంలో మూడవ కూటమికి రంగం సిధ్ధం చేస్తారు. దాంట్లో జగన్ కేసీయార్ వంటి వారు చేరితే బీజేపీకి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే ముందుగా జగన్ ని ఎన్డీయేలోకి ఆహ్వానించి బలోపేతం చేసుకోవాలనుకుంటున్నారు. అలాగే జగన్ ని మూడవ కూటమికి దూరం చేయడం ద్వారా దక్షిణాదిన తమ పట్టును కాపాడుకుంటారు అనుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News