వైఎస్‌ను మించి.. జ‌గ‌న్ మార్క్ వ్యూహం ఇదేనట

ఏ నాయ‌కుడికైనా త‌న సొంత జిల్లాపై ప్రేమ ఉంటుంది. ఈ క్రమంలోనే అనేక మంది నాయ‌కులు త‌మ సొంత‌గ‌డ్డ రుణం తీర్చుకునేందుకు ప్రయ‌త్నిస్తారు. మ‌రీ ముఖ్యంగా సీఎం [more]

Update: 2021-03-07 15:30 GMT

ఏ నాయ‌కుడికైనా త‌న సొంత జిల్లాపై ప్రేమ ఉంటుంది. ఈ క్రమంలోనే అనేక మంది నాయ‌కులు త‌మ సొంత‌గ‌డ్డ రుణం తీర్చుకునేందుకు ప్రయ‌త్నిస్తారు. మ‌రీ ముఖ్యంగా సీఎం స్థాయిలో ఉన్నవారు మ‌రింత‌గా త‌మ సొంత ప్రాంతాల‌పై ప్రాణం పెట్టుకుంటారు. గ‌తంలో వైఎస్ కూడా క‌డ‌ప‌పై ఇలానే అభివృద్ధి తాలూకు వ్యూహంతో ముందుకు సాగారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడే క‌డ‌ప‌ను కార్పొరేష‌న్‌గా మార్చేయ‌డంతో పాటు రింగ్ రోడ్డు ఏర్పాటు చేశారు. అంతే కాదు పులివెందుల‌లో క‌నివినీ ఎరుగ‌ని రేంజ్‌లో అభివృద్ధి చేయ‌డంతో పాటు పులివెందుల‌కే రింగ్ రోడ్డు ఏర్పాటు చేశారు.

వైఎస్ తర్వాత….

పులివెందుల టు క‌డ‌ప‌కు నాలుగు లైన్ల ర‌హ‌దారి వేసేశారు. పులివెందుల‌, క‌డ‌ప చ‌రిత్రలో ఎప్పుడూ జ‌ర‌గ‌నంత అభివృద్ధి వైఎస్ హ‌యాంలో జ‌రిగింది. ఇక పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలోనే ట్రిఫుల్ ఐటీ వ‌చ్చింది. అయితే.. ఇప్పుడు ఆయ‌న కుమారుడు, సీఎం జ‌గ‌న్‌.. తండ్రిని మించిన వ్యూహంతో క‌డ‌ప‌పై త‌న‌మార్కు అభివృద్ధిని చూపిస్తూ.. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేప‌డుతున్నారు. తాజాగా జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో భారీ ఎత్తున అన్ని ప్రాజెక్టుల‌ను క‌డ‌ప‌కే కేటాయించ‌డం ఆస‌క్తిగా మారింది. ఈ ప్రాజెక్టులు, వీటికి కేటాయింపులు చూస్తే షాక్ అయిపోయేలా ఉంది.

పెద్దయెత్తున అభివృద్ధి…..

క‌డ‌ప జిల్లా వల్లూరు మండలం అంబాపురంలో 93.99 ఎకరాల్లో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో మెగా ఇండస్ట్రియల్‌ పార్కు కోసం భూమి కేటాయించారు. ఇక్కడ ఈ పార్కు ఏర్పాటు వ‌ల్ల వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు రానున్నాయి. జిల్లాలోని సీకే దిన్ని మండలం కొప్పర్తిలో 598.59 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్‌ పార్కు నిర్మాణానికి ఏపీఐఐసీకి స్ధలం కేటాయింపున‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జ‌మ్మల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో ముద్దనూరులో నూతన అగ్నిమాపక కేంద్రం నిర్మాణానికి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌. 12 పోస్టులు మంజూరుకు ఓకే చెప్పారు.

వ్యక్తిగత ముద్ర……

అలాగే జిల్లా ప్రజ‌లు ద‌శాబ్ద కాలంగా ఎదురు చూస్తోన్న స్టీల్‌ ప్లాంటు నిర్మాణానికి జాయింట్‌ వెంచర్‌ ఎంపిక ప్రక్రియకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. జమ్ములమడుగు మండలం పెద్దండ్లూరు, సున్నపురాళ్లపల్లె గ్రామాల్లో 3148.68 ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌కు కేటాయించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ స్ధలంలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. ఇలా.. తాజాగా జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో మెజారిటీ ప్రాజెక్టులు క‌డ‌పకే ద‌క్కడం.. గ‌మ‌నార్హం. అయితే.. వాస్తవానికి రాజ‌కీయ ప్రయోజ‌నం ఏమీ క‌నిపించ‌క‌పోయినా.. వ్యక్తిగ‌తంగా జ‌గ‌న్ త‌న ముద్రవేయాల‌నే త‌పన క‌నిపించింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News