విజన్ కాదట… విజిలేయడమేనట

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన ఇటు రాష్ట్ర భవిష్యత్తుతో పాటు, అటు రాజకీయంగా వైసీపీకి లాభించేదేనన్నది అంచనా. జగన్ రాయలసీమ వాసి అయినా [more]

Update: 2019-12-26 02:00 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన ఇటు రాష్ట్ర భవిష్యత్తుతో పాటు, అటు రాజకీయంగా వైసీపీకి లాభించేదేనన్నది అంచనా. జగన్ రాయలసీమ వాసి అయినా విశాఖనే ఎంచుకోవడానికి అనేక కారణాలున్నాయంటున్నారు. చంద్రబాబుది విజన్. 2025, 2050 విజన్ అంటూ చంద్రబాబు చెప్పుకొస్తారు. కానీ జగన్ విజన్ జోలికి పోవడం లేదు. ఇన్ స్టంట్ డెవెలెప్ మెంట్ వైపు మొగ్గు చూపుతున్నారంటున్నారు. అందుకే ఒక టైం బౌండ్ కార్యక్రమం పెట్టుకుని జగన్ ప్రకటనలు చేస్తున్నారంంటున్నారు.

ఇప్పటికే అభివృద్ధి చెంది….

విశాఖపట్నం ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరం విశాఖ మాత్రమే. కాస్మోపాలిటిన్ సిటీగా కూడా ఉంది. అన్ని హంగులున్న విశాఖలో సచివాలయం ఏర్పాటు చేస్తే ఏపీకి ఒక మంచి రాజధానిని ఇచ్చినట్లవుతుందన్నది జగన్ ఆలోచన. కొత్త నగరం నిర్మాణం కన్నా ఆల్రెడీ అన్ని వసతులున్న విశాఖను అభివృద్ధి చేస్తే భవిష్యత్తు ఉంటుందన్నది వైసీపీ నేతల అభిప్రాయం. ఈ మేరకే విశాఖ నగరాన్ని ఎంచుకున్నారు.

రాజకీయంగా కూడా…..

ఇక ఉత్తరాంధ్రలో జగన్ పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో బాగానే సీట్లు సాధించింది. విజయనగరం క్లీన్ స్వీప్ చేయగా, శ్రీకాకుళంలో రెండు మినహా అన్ని స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. విశాఖపట్నంలో మాత్రం నాలుగు స్థానాలను వైసీపీ చేజార్చుకుంది. ఈ నాలుగు విశాఖ నగరంలోనే ఉన్నాయి. ఇక్కడ బలోపేతం కావాలంటే విశాఖవాసుల మనసులు కొల్లగొట్టాలి. ఉత్తరాంధ్ర మొత్తం వైసీపీ పరమవుతుందన్నది జగన్ అంచనా. అంతేకాకుండా అన్ని ప్రాంతాల వారున్న విశాఖ నగరమయితే మరో హైదరాబాద్ లా అభివృద్ధి చెందుతుందని జగన్ భావిస్తున్నారు. విశాఖలో అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివాసం ఉంటున్నారు.

ఎవరూ వ్యతిరేకించరని…..

మరోవైపు విశాఖపట్నంలో ప్రభుత్వ భూములకు కొరతేే లేదు. విశాఖ పట్నం అంతర్జాతీయ విమానాశ్రయం కానుండటం మరింత ప్లస్ పాయింట్. ఇన్ని అవకాశాలున్న విశాఖపట్నంను అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా పెడతామంటే వెంకయ్య నాయుడుతో సహా ఎవరూ వ్యతిరేకించరన్న విశ్వాసం జగన్ కు ఉంది. ఎందుకంటే విశాఖపట్నం పై అనేక మంది నేతలకు ప్రేమ ఉండటమే కారణం. ఇక్కడ సంస్కృతి, వాతావరణం వంటివి ఆకట్టుకోవడంతోనే విశాఖకు అందరూ ఎడిక్ట్ అవుతారన్న నానుడి కూడా ఉంది. ఇలా అన్ని రకాలుగా ప్రయోజనాలు చేకూర్చే విశాఖను జగన్ ఎంచుకున్నారన్నది వాస్తవం.

Tags:    

Similar News