విక్టరీ ఊరికే రాలేదు… అసలు విషయం అదేనట

పంచాయతీ ఎన్నికలలో వచ్చిన ఫలితాలను బట్టి చూస్తుంటే వైసీపీకి గ్రామస్థాయిలో బలం చెక్కుచెదరలేదని పిస్తోంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 90 శాతం పంచాయతీలను వైసీపీ [more]

Update: 2021-02-10 06:30 GMT

పంచాయతీ ఎన్నికలలో వచ్చిన ఫలితాలను బట్టి చూస్తుంటే వైసీపీకి గ్రామస్థాయిలో బలం చెక్కుచెదరలేదని పిస్తోంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 90 శాతం పంచాయతీలను వైసీపీ మద్దతు దారులు గెలుచుకున్నారు. జగన్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు కావస్తుంది. ఇరవై నెలల్లో అసంతృప్తి పెరిగిందని విపక్షాలు అంచనా వేశాయి. అయితే పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలను చూస్తే మాత్రం వైసీపీ గ్రామస్థాయిలో మరింత బలం పెంచుకుందనే చెప్పాలి.

తొలి నుంచి రూరల్ ఏరియాలో…

తొలి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీకి పట్టుంది. గత అసెంబ్లీ ఎన్నికలలోనూ గ్రామీణ ప్రాంతాలే వైసీపీని అధికారంలోకి తేగలగాయి. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు కొంత మిశ్రమంగా స్పందించినప్పటికీ గ్రామీణ స్థాయి ఓటర్లు మాత్రం ఫ్యాన్ పార్టీ వైపు అప్పట్లో మొగ్గు చూపారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సంక్షేమ పథకాలపైనే దృష్టి పెట్టారు. దాదాపు 67 వేల కోట్లకుపైగానే సంక్షేమ పథకాలను ప్రజలకు పంచారు.

సంక్షేమ పథకాల అమలు…..

ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టు పెంచుకోవడం కోసం పాదయాత్రలోనూ, మ్యానిఫేస్టోలోనూ చెప్పిన అంశాలలో 90 శాతం అమలు చేసేందుకు జగన్ ప్రయత్నించారు. దీంతో జగన్ పై నమ్మకం పెరిగింది. అందుకే తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అధిక స్థానాల్లో విజయం సాధించిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. వైసీపీ నుంచి పోటీ ఎక్కువగా ఉండటంతో అనేక చోట్ల వైసీపీలోనే రెండు గ్రూపులు పోటీకి తలపడ్డాయి. లేకుంటే మరిన్ని పంచాయతీలు కైవసం చేసుకోగలిగేవారమని వైసీపీ నేతలు చెబుతున్నారు.

సానుభూతి కూడా తోడయి…..

ఇక సంక్షేమ పథకాలకు వరసగా వ్యవస్థల ద్వారా చంద్రబాబు జగన్ ను అడ్డుకోవడం కూడా వైసీపీకి కలసి వచ్చిందంటున్నారు. సానుభూతి పెరగడంతోనే వైసీపీకి వన్ సైడ్ గా ఓట్లు వేశారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. పంచాయతీ ఎన్నికల తొలి దశ ఎన్నికల్లో వైసీపీ ఊహించిన దానికన్నా పాజిటివ్ ఫలితాలు రావడంతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం పెల్లుబుకుతోంది. మొత్తం మీద జగన్ సంక్షేమ పథకాలే పంచాయతీ ఎన్నికల్లో విజయాన్ని సాధించిపెట్టాయని చెప్పక తప్పదు. రాజధాని ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సయితం వైసీపీ హవాను కొనసాగించడం విశేషం.

Tags:    

Similar News