జగన్ జాగ్రత్త పడాల్సిందేనా?

ఏపీ అధికార పార్టీ వైసీపీలో అల‌క‌లు రాజ్యమేలుతున్నాయి. ఈ జిల్లా.. ఆ జిల్లా.. అనే తేడా లేకుండా అన్ని జిల్లాల్లోనూ ఎమ్మెల్యేలు అల‌కల‌ పాలిటిక్స్ చేస్తున్నారు. దీంతో [more]

Update: 2019-12-25 12:30 GMT

ఏపీ అధికార పార్టీ వైసీపీలో అల‌క‌లు రాజ్యమేలుతున్నాయి. ఈ జిల్లా.. ఆ జిల్లా.. అనే తేడా లేకుండా అన్ని జిల్లాల్లోనూ ఎమ్మెల్యేలు అల‌కల‌ పాలిటిక్స్ చేస్తున్నారు. దీంతో అధికార పార్టీలో క‌ల‌క‌లం రేగుతోంది. అస‌లు ఏం జ‌రుగుతోందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఇంత‌కీ విష‌యంలోకి వెళ్తే.. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీకి అనూహ్య సంఖ్యలో ఎమ్మెల్యేలు వ‌చ్చారు. సీఎం జ‌గ‌న్ ను ప‌క్కన పెడితే.. మొత్తం 150 మంది వైసీపీ త‌ర‌పునే గెలిచారు. కొన్ని జిల్లాల్లో జిల్లాల‌కు జిల్లాలే వైసీపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. దీంతో మంత్రుల‌కు, ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య ఆధిప‌త్య పోరు పెరుగుతోంది.

సీనియర్ల ఆధిపత్యంతో…..

వైసీపీ ఎమ్మెల్యేల్లో స‌గం మంది కొత్తవారు లేదా రెండోసారి ఎన్నికైన వారు ఉన్నారు. దీంతో ఆయా జిల్లాల్లోని సీనియ‌ర్ నాయ‌కులు వీరిపై పైచేయి సాధించేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. దీనిలో భాగంగానే నిధులు, వినియోగం, ప్రాధాన్యాల విష‌యంలో త‌మ‌కు న‌చ్చిన విధంగా దూసుకుపోతున్నారు. ఇక‌, కొంద‌రు మంత్రులు త‌మ‌కు సంబంధం లేకున్నా కూడా ప‌క్క నియోజ‌క‌వ‌ర్గాల్లో వేలు పెడుతున్నారు. ఈ ప‌రిస్థితితో ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పైకి చెప్పుకోలేక‌, చెప్పుకునేందుకు కూడా ఎవ‌రూ లేక వారు ఆత్మర‌క్షణ‌లో ప‌డిపోతున్నారు. మ‌రోప‌క్క, అధినేత సీఎం జ‌గ‌న్ ఇప్పటి వ‌ర‌కు క్షేత్ర‌స్థాయిలో ఎమ్మెల్యేల ప‌రిస్థితిని వాక‌బు చేసింది లేదు. ఇంకా చెప్పాలంటే చాలా మంది ఎమ్మెల్యేల‌కు ఇప్పటి వ‌ర‌కు సీఎం అపాయింట్‌మెంటే లేద‌ట‌.

క్యాడర్ నుంచి వత్తిడులు వస్తుండటంతో…..

తొలి అసెంబ్లీలో సీఎం జ‌గ‌న్ చేసిన ప్రక‌ట‌న మేర‌కు ప్రతి ఎమ్మెల్యేకు నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి నిధుల కింద రూ.కోటి ఇస్తాన‌ని చెప్పారు. అయితే, ఆరు మాసాలు గ‌డిచిపోయి.. ఏడో నెల కూడా అయిపోతున్నా.. ఇప్పటి వ‌ర‌కు ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు. కేవలం మంత్రులు చెబుతున్న వారికే నిధులు కేటాయిస్తున్నారు. కొన్ని చోట్ల సీనియ‌ర్ మంత్రులు ఏదో ఒక విధంగా జ‌గ‌న్‌ను మెప్పించి నిధులు తెచ్చుకుని త‌మ‌ప్రాధాన్యాల ప్రకారం చేయించుకుంటున్నారు. దీంతో దాదాపు 100 మందికి పైగా ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ర‌గిలిపోతున్నారు. పైగా తాము ఎమ్మెల్యేలుగా గెలిచేందుకు కిందిస్థాయి నాయ‌క‌త్వం స‌హ‌క‌రించింది. ఇప్పుడు వారిని సంతృప్తి ప‌ర‌చాల‌న్నా.. చేతిలో చిల్లిగ‌వ్వలేక ఇబ్బంది ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పటికైనా అధినేత జ‌గ‌న్ త‌మ‌ను ప‌ట్టించుకోవాల‌ని వారు కోరుతున్నారు.

Tags:    

Similar News