ఎప్పుడూ ఆడిపోసుకోవడమేనా…రిజల్ట్ చూసయినా….?

ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసి ఇరవై నెలలు దాటింది. అంటే ఇంకా రెండేళ్లు కూడా పూర్తికాలేదు. కానీ తొలి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ ను [more]

Update: 2021-02-15 03:30 GMT

ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసి ఇరవై నెలలు దాటింది. అంటే ఇంకా రెండేళ్లు కూడా పూర్తికాలేదు. కానీ తొలి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ ను ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఇసుక నుంచి కరోనా వరకూ జగన్ నిర్ణయాలను తప్పుపట్టారు. అసలు జగన్ కు పాలన చేతకాదని అన్నారు. ఫ్యాక్షనిస్టుల చేతికి అధికారమిచ్చి తప్పు చేశారని ప్రజలపైన కూడా చంద్రబాబు మండిపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

కరోనా సమయంలో….

ప్రధానంగా కరోనాను తీసుకుంటే కష్టసమయంలోనూ జగన్ ప్రభుత్వం బాగా పనిచేసిందన్న కితాబులొచ్చాయి. కేంద్ర ప్రభుత్వం నుంచే కాకుండా స్వయంగా ప్రధాని మోదీ సయితం జగన్ పనితీరును కరోనా విషయంలో మెచ్చుకున్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలకు అండగా నిలబడటం, సంక్షేమ పథకాలను నిలుపదల చేయకపోవడంతో పాటు పరీక్షల విషయంలో జగన్ ప్రభుత్వం చూపిన శ్రద్ధ అందరి మన్ననలను అందుకుంది.

పాలన చేతకాదంటూ…..

వైసీపీ నేతల కారణంగానే కరోనా ప్రబలిందన్న విమర్శలు కూడా టీడీపీ నేతలు చేశారు. తాము అధికారంలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చంద్రబాబు పదే పదే చెప్పారు. జగన్ సమీక్షలు చేయకుండా కూర్చుంటే ఎలా అని ప్రశ్నించారు. రోజుకు పదివేలకు తక్కువ కాకుండా కేసులు నమోదవుతున్నా జనంలో భయం పోగొట్టేందుకు జ్వరంలాంటిదేనని తరచూ చెప్పారు. పారాసెట్మాల్ వేసుకుంటే సరిపోతుందని ధైర్యంగా చెప్పిన వారిలో జగన్ మొదటివారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ వెనకడుగు వేయలేదు. ఫలితంగా ఇప్పుడు ఏపీలో కరోనా కంట్రోల్ లోకి వచ్చింది. రోజుకు వందలోపే కేసులు నమోదవుతున్నాయి.

ఆలయాలపై దాడుల విషయంలో……

ఇక ఆలయాలపై దాడుల విషయంలోనూ చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై నిత్యం విరుచుకుపడేవారు. క్రిస్టియన్ ముఖ్యమంత్రి అంటూ పదే పదే సంబోధించేవారు. అయినా జగన్ మరో మాట మాట్లాడకుండా తన పని తాను చేసుకుపోయారు. ఇప్పుడు ఆలయాలపై దాడుల ఘటనలో కూడా కేసుల చిక్కుముడులు వీడుతున్నాయి. నిందితులు దొరుకుతున్నారు. ఆలయాలపై కూడా దాడులు ఆగిపోయాయి. ఇక భవిష్యత్ లో వంగవీటి రంగా, అంబేద్కర్ విగ్రహాలపై టీడీపీ ధ్వంస రచనకు దిగే అవకాశముందని ఇంటలిజెన్స్ నివేదిక ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే అది ప్రభుత్వ కుట్ర అని టీడీపీ ఆరోపిస్తుంది. మొత్తం మీద చంద్రబాబు జగన్ పై చేసిన విమర్శలు, ఆరోపణలకు ఒక్కొక్కటిగా చెక్ పెట్టుకుంటూ వస్తుంది ప్రభుత్వం.

Tags:    

Similar News