జగన్ నిర్ణయానికి వారు యాంటీ

అసెంబ్లీ సాక్షిగా వారం రోజుల కింద‌ట సీఎం జ‌గ‌న్ చేసిన ప్రక‌ట‌న రాష్ట్రంలో తీవ్ర‌మైన చ‌ర్చకు దారితీసింది. అమ‌రావ‌తి రాజ‌ధానిని కేవ‌లం ఓ సామాజిక వ‌ర్గాన్ని దృష్టిలో [more]

Update: 2019-12-25 08:00 GMT

అసెంబ్లీ సాక్షిగా వారం రోజుల కింద‌ట సీఎం జ‌గ‌న్ చేసిన ప్రక‌ట‌న రాష్ట్రంలో తీవ్ర‌మైన చ‌ర్చకు దారితీసింది. అమ‌రావ‌తి రాజ‌ధానిని కేవ‌లం ఓ సామాజిక వ‌ర్గాన్ని దృష్టిలో ఉంచుకుని డెవ‌ల‌ప్ చేశార‌ని, దీనివ‌ల్ల మ‌ళ్లీ తెలంగాణ వంటి బ‌ల‌మైన ఉద్యమానికి ఆస్కారం ఉంద‌ని, సంప‌ద మొత్తం ఒకే చోట కేంద్రీకృతం అవుతుంద‌ని జ‌గ‌న్ వెల్లడించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మూడు ప్రాంతాల‌ను రాజ‌ధానులుగా ఎంపిక చేయ‌డం ద్వారా పాల‌న వికేంద్రీక‌ర‌ణ జ‌ర‌గ‌డంతోపాటు అభివృద్ధి కూడా జ‌ర‌గుతుంద‌ని జగన్ అభిప్రాయ పడ్డారు. అయితే, దీనిపై నియ‌మించిన జీఎన్ రావు క‌మిటీ నివేదిక ఇచ్చిన త‌ర్వాత నిర్ణయం తీసుకుంటామ‌ని చెప్పారు.

కోస్తా జిల్లాల్లో మాత్రం……

ఇక‌, ఈ నేప‌థ్యంలోనే తాజాగా రెండు రోజుల కింద‌ట జీఎన్ రావు క‌మిటీ నివేదిక‌ను ఇచ్చింది. దీనిలోనూ అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ జ‌రగాల‌ని క‌మిటీ సూచించింది. క‌ర్నూలులో న్యాయ రాజ‌ధాని, విశాఖ‌లో పాల‌నా రాజ‌ధాని, అమ‌రావ‌తిలో శాస‌న‌ రాజ‌ధాని ఏర్పాటు చేస్తే మంచిద‌నే అభిప్రాయం వ్యక్తమైంది. దీనిపై విశాఖ‌, క‌ర్నూలు స‌హా సీమ జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో జగన్ నిర్ణయానికి అనుకూలంగా స్పంద‌న వ్యక్తం కావ‌డం, జ‌గ‌న్‌కు నీరా జ‌నం ప‌లుకుతుండ‌గా.. కోస్తాలోని ప‌లు జిల్లాల్లో మాత్రం వ్యతిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి.

అమరావతికి దగ్గరగా ఉన్న…..

అమ‌రావ‌తి ప్రాం తంలోని 29 గ్రామాల ప్రజలు కూడా దీనిని వ్యతిరేకించారు. నిన్నటికి నిన్న భారీ ఎత్తున ఆయా గ్రామాల్లో ఉద్యమానికి సిద్ధమ‌య్యారు. ముఖ్యంగా వైసీపీ కార్యక‌ర్తలు, తృతీయ శ్రేణి నాయ‌కులు కూడా రోడ్డు మీద‌కు వ‌చ్చి ఆందోళ‌న చేశారు. ప్రభుత్వ కార్యాల‌యాల‌కు న‌ల్లరంగు పులిమి.. త‌మ నిర‌స‌న వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ముఖ్యంగా అద్దంకి, ప‌రుచూరు వంటి గుంటూరు బోర్డర్ లోనూ, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోనూ, కృష్ణా జిల్లాలోనూ నాయ‌కులు, ప్రజ‌లు కూడా జ‌గ‌న్ నిర్ణయాన్ని త‌ప్పుప‌ట్టారు.

వైసీపీ కార్యకర్తల నుంచి. …

అటు వైసీపీ, జ‌గ‌న్ వీరాభిమానులతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో కొంత‌మందికి ఈ నిర్ణయం న‌చ్చడం లేదు. ఇప్పటికే దాదాపు ఆరు కోట్ల రూపాయ‌ల‌తో అభివృద్ధి కార్యక్రమాలు చేసి, నిర్మాణాలు కూడా పూర్తయిన నేప‌థ్యంలో అమ‌రావ‌తిని మార్చడం ఎందుకని వీరు ప్రశ్నిస్తున్నారు. అదే స‌మ‌యంలో అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌కు ఎవ‌రూ అడ్డు చెప్పకపోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇప్పుడు జ‌గ‌న్ నిర్ణయంపై మిశ్రమ స్పంద‌న వ్యక్తమ‌వుతుండ‌డంతో ఏం జ‌రుగుతుందో అనే ఉత్కంఠ రాజ్యమేలుతోంది.

Tags:    

Similar News