జగన్ ఫోకస్ వారిపై ఇక ఉండదట

ఏపీ ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికల నాటికి వారిని పూర్తిగా వదిలేసేటట్లే కనపడుతుంది. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమకు బీసీలే భవిష్యత్ ఇస్తారన్న భరోసా లో [more]

Update: 2021-02-21 15:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికల నాటికి వారిని పూర్తిగా వదిలేసేటట్లే కనపడుతుంది. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమకు బీసీలే భవిష్యత్ ఇస్తారన్న భరోసా లో జగన్ లో ఉన్నట్లు కన్పిస్తుంది. కాపు సామాజికవర్గాన్ని మాత్రం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన భావిస్తున్నట్లే అర్థమవుతుంది. అందుకే ఆ సామాజికవర్గం ఓట్లను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం పెద్దగా చేయాల్సిన పనిలేదని నిర్ణయానికి వచ్చారు.

సంక్షేమ పథకాలు అందుతున్నా….

జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరికీ అందుతున్నాయి. ఇందులో కాపు సామాజికవర్గం కూడా ఉంది. కాపుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా ఆ సామాజికవర్గంలో అర్హులైన వారికి పథకాలను అందచేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో బీజేపీ, జనసేన కలవడంతో కాపుల ఓటు బ్యాంకు వైసీపీ నుంచి పక్కకు మరలే అవకాశం స్పష్టంగా కన్పిస్తుంది.

కూటమి వైపే కాపులు….

జనసేన జత కలవడంతో కాపు సామాజికవర్గం ఎక్కువగా ఆ కూటమి వైపు మొగ్గు చూపుతుంది. అందుకే ఇప్పుడు ఎక్కువగా బీసీలపై ఫోకస్ చేయాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాపు సామాజికవర్గం ఎక్కువ శాతం వైసీపీ వైపు చూశారు. వీరితో పాటు అధిక సంఖ్యలో ఉన్న బీసీలు సయితం జగన్ కు వెన్నుదన్నుగా నిలిచారు. బీసీలు సహజంగా టీడీపీకి అనుకూలంగా ఉండేవారు. అయితే గత ఎన్నికల్లో మాత్రం వారు వైసీపీ వైపు మొగ్గు చూపారు. అందుకే జగన్ కు అంతటి భారీ విజయం లభించింది.

బీసీలు మరింత బలంగా…..

ఈసారి కూడా బీసీలను వదులుకోకూడదన్న ధోరణిలోనే జగన్ ఉన్నారు. బీజేపీ, జనసేనలు కలసి కాపు సామాజికవర్గంపైనే ఫోకస్ పెట్టడం తమకు సానుకూలత అని జగన్ భావిస్తున్నారు. దానివల్ల బీసీలు మరింత బలంగా వైసీపీ వైపు చూస్తారంటున్నారు. ఈ పరిణామాలతో దెబ్బతినేది టీడీపీయేనన్న అంచనాలో ఉన్నారు. అందుకే జగన్ పెద్దగా కాపులపై ఫోకస్ పెట్టకూడదన్న నిర్ణయానికి వచ్చారట. ఆయన ఇకపై బీసీల వైపే చూస్తారన్న టాక్ పార్టీలో బలంగా విన్పిస్తుంది.

Tags:    

Similar News