చెల్లెమ్మ వచ్చిందట… అన్నయ్యకు ఆనందమట …?

జగన్ మొత్తం ఏపీకే అన్న. కానీ జగన్ కి చాలా మంది సోదరులు సోదరీమణులు ఉన్నారు. వారిది చాలా పెద్ద కుటుంబం. అన్నయ్య అని ఆప్యాయంగా పిలిచే [more]

Update: 2021-02-10 11:00 GMT

జగన్ మొత్తం ఏపీకే అన్న. కానీ జగన్ కి చాలా మంది సోదరులు సోదరీమణులు ఉన్నారు. వారిది చాలా పెద్ద కుటుంబం. అన్నయ్య అని ఆప్యాయంగా పిలిచే సొంత చెల్లెలు షర్మిల జగన్ కి కొండంత బలం. ఇక చేదోడు వాదోడుగా ఉండే బాబాయ్ వైఎస్ వివేకా ఏకైక కుమార్తె సునీత కూడా మరో చెల్లెలు. ఇంకో బాబాయ్ వైఎస్ సుధీర్ రెడ్డి కూతురు విరానికారెడ్డి కూడా చెల్లెలే. ఆమె సినీ హీరో మంచు విష్ణు సతీమణి. అంటే సీనియర్ యాక్టర్ మోహన్ బాబు కోడలు అన్న మాట. మొత్తానికి జగన్ కి అటు వైపు కూడా మంచి బంధమే ఉంది.

ఆ చెల్లెళ్ళు అలా…..

ఇక జగన్ సీఎం అయ్యాక తాడేపల్లిలోని ఇంటికి మారాక సొంత చెల్లెలు షర్మిల గత ఇరవై నెలలలో ఒకసారి కూడా రాలేదు అన్న ప్రచారం అయితే ఒక వైపు సాగుతోంది. షర్మిలకు జగన్ కి మధ్య తేడే ఏదో వచ్చినట్లేనన్న పుకార్లూ షికార్లు చేస్తున్నాయి. మరో వైపు షర్మిల సొంతంగా ఒక పార్టీనే పెడుతుంది అంటూ వార్తా కధనాలు వచ్చాయి. అవి ఎంతవరకూ నిజమో తెలియదు కానీ జగన్ సీఎం అయ్యాక మాత్రం చెల్లెలుతో కలసిన ఫోటో అయితే మీడియాలో రాలేదు అన్నది నిజం. ఇక మరో చెల్లెలు వివేకా కూతురు డాక్టర్ సునీత జగన్ అన్న మీదనే రగులుతున్నారు. ఆమె తన తండ్రి హత్య కేసుని ముఖ్యమంత్రి సీటులో కూర్చున్న అన్న ఇప్పటికీ తేల్చలేదని గుస్సా అవుతూ దాదాపుగా తిరుగుబాటు బావుటాయే ఎగరేస్తున్నారని అంటున్నారు.

సర్ ప్రైజ్ విజిట్ …

ఈ నేపధ్యంలో మరో బాబాయ్ కూతురు విరానికారెడ్డి జగన్ ఇంటికి రావడం అంటే అది విశేషమే అంటున్నారు. వెంట విష్ణు కూడా ఉన్నారు. ఈ దంపతులు జగన్ తో విందారగించారు. వారిని ఆప్యాయంగా జగన్ దంపతులు సాగనంపుతున్న ఫోటోలు కూడా మీడియాలో వచ్చాయి. మొత్తానికి జగన్ తన ఇంటికి చెల్లెమ్మ వచ్చిందని తెగ ఆనందిస్తున్నట్లుగా ఆ ఫోటోలలో కనిపిస్తోంది. ఒక విధంగా మోహన్ బాబు ఫ్యామిలీ మళ్ళీ బాగా దగ్గర అవుతోంది అన్న సంకేతాలు కూడా ఈ భేటీ ద్వారా అందుతున్నాయి.

దన్ను కోసమా …?

సినీ పరిశ్రమలో వైసీపీకి ఇపుడు పెద్దగా మద్దతు లేనట్లే. అప్పట్లో కరోనా టైమ్ లో కూడా స్పెషల్ ఫ్లైట్ లో వచ్చి మరీ జగన్ ని కలసిన మెగాస్టార్ చిరంజీవి ఇతర సినీ పెద్దలు మళ్ళీ భేటీ వేయలేదు. జగన్ సినీ పరిశ్రమకు రాయితీలు ఇచ్చినా కూడా ఈ వైపు తొంగి చూడలేదు, వివిధ కారణాల వల్ల ఇతర సినీ ప్రముఖులు కూడా వైసీపీకి మద్దతుగా మాట్లాడడంలేదు. ఈ నేపధ్యంలో చాన్నాళ్ళుగా జగన్ మీద మోహన్ బాబు గుస్సా మీద ఉన్నారని ప్రచారం సాగింది. అయితే ఈ మధ్య తిరుపతి టూర్ కి వచ్చిన మోహన్ బాబు టీటీడీలో పాలన బాగుంది అంటూ ఇండైరెక్ట్ గా జగన్ సర్కార్ కి మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇపుడు విష్ణు వెళ్లి స్వయంగా కలిసారు. మరి ఈ బంధం గట్టి పడితే తెలుగు సినీ సీమ నుంచి పెద్ద దన్ను జగన్ కి దక్కినట్లే. అంతే కాదు, చెల్లెమ్మలు ఇద్దరూ దూరం అంటూ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతున్న వేళ ముచ్చటగా మూడవ చెల్లెమ్మ జగన‌న్న ఇంటికి రావడం కంటే ఆనందం వేరే ఏముంటుంది.

Tags:    

Similar News